Oct 30, 2011

సకల విరమణ.. తదనంతరం...?

 https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiQqMrSDJMexae79YUj2bOZ_YAQDUcK-qGb7xhvISQJJChF_sKWveeLhE_vgcTdac911S8ZSUxuYnJ_xJX4xvWpUFnJJhlgGXCi_byy4Go2MrLik7Pozn9N2VVtCBFb3JKvKkZ2SP_YcFcZ/s1600/sakala-janula-samme-300x232.jpg
  • ఊహించినట్టుగానే ఉచితమైన రీతిలోనే సకల జనుల సమ్మె 42 రోజుల తర్వాత విరామం తీసుకుంది. 
  • విరమణ అన్నా, విరామం అన్నా వాస్తవంగా వర్తమాన ప్రభావంలో పెద్ద తేడా ఏమీ వుండదు. 
  • రాజకీయ నాటకాలతో ఉత్పన్నమైన సమస్యలకు సంక్షోభాలకు ఉద్యోగుల సమ్మెలు పరిష్కారం చూపించలేవని ఈ బ్లాగులో రాయడమే గాక ఇతరత్రా కూడా స్పష్టంగానే చెబుతూ వచ్చాను. 
  • ఇది సమ్మెదార్లను తక్కువ చేయడం కాదు. సవాళ్లు సంక్లిష్టతల తీవ్రతను చెప్పడం మాత్రమే. 
  • వరుసగా వివిధ తరగతులు విరామం తీసుకోవడం అనివార్యమైన పరిణామం. 
  • ఈ వాస్తవాన్ని గుర్తించడంలో ఎవరూ ప్రతిష్టలకు పోనవసరం లేదు. అలాగే విరమించారు గనక విఫలమైనారని ఇతరులు భావించనవసరం లేదు. 
  • ఇలాటి విషయాల్లో జయాపజయాల లెక్కల కన్నా జన హితమే కొలబద్దగా పెట్టుకోవాలి. 
  • అయితే ఉద్యోగులైనా విద్యార్థులైనా రాజకీయ వాస్తవాలను ప్రాంతాల వారీ కోర్కెల పరిమితులను కూడా గమనంలోకి తీసుకోవడం అవసరం.
  • రాజకీయ సమస్యను భావోద్వేగ భరితంగా మార్చి చూపించడం స్వార్థపర శక్తులకు ఉపయోగం తప్ప విశాల జనబాహుళ్యానికి కాదు. 
  • పాలకులు తల్చుకుంటే రాష్ట్ర విభజన చేయొచ్చు. ప్రస్తుతానికి వారు అలా అనుకోవడం లేదు. 
  • ఆ అవకాశం లేదని కూడా పదే పదే స్పష్టంగానే చెబుతున్నారు. రెండువారాల్లో వచ్చేస్తుందని కెసిఆర్‌ చెప్పినప్పుడు గాని నవంబరు 1 కి వస్తుందని కోదండరామ్‌ అన్నప్పుడు గాని అవి ఆధారరహితాలేనని అందరికీ తెలుసు. 
  • వారికి ఇంకా బాగా తెలుసు.సమ్మె విరమణకై విజ్ఞప్తి చేసిన ఆజాద్‌ వ్యాఖ్యలలో కూడా ఇసుమంతైనా కొత్త దనం లేదు. 
  • అన్నీగత వైఖరి పునరుద్ఘాటనలే. అయినా ఆ ప్రకటన పెద్ద ప్రధానమైందన్నట్టు చూపించడంలో వాస్తవికత శూన్యం. 
  • ఇప్పుడు నిరాహారదీక్షలు అంటున్నారు గాని ఇంత త్వరలో పరిస్థితులు మారిపోతాయిని అనుకోవడానికి ఆస్కారమే లేదు. 
  • కాకపోతే వూపు నిలబెట్టడానికి ఉపయోగపడొచ్చు. 
  • కేంద్ర రాస్ట్ర ప్రభుత్వాలు రాజకీయ నిర్ణయ ప్రకటన వేగవంతం చేయడమే ఇప్పుడు జరగాల్సింది.

No comments: