- ఆంధ్రప్రదేశ్ చరిత్ర, గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 ఇతర పోటీ పరీక్షలకు ప్రత్యేకం.
రెండో చాళుక్య భీముని భార్యలు ఎవరు?
- ఇద్దరు-అంకిదేవి, లోకాంబిక
రెండో చాళుక్య భీముని కుమారులెవరు?
- దానార్ణవుడు, అమ్మరాజు
అంకిదేవి కుమారుడు ఎవరు?
- దానార్ణవుడు
అమ్మరాజు ఎవరి కుమారుడు?
- లోకాంబిక
రెండో చాళుక్య భీముని అనంతరం రాజ్యాధికారాన్ని చేపట్టినదెవరు?
- రెండో అమ్మరాజు
రెండో అమ్మరాజుకు గల మరొక పేరు?
- ఆరో విజయాదిత్యుడు
రెండో అమ్మరాజు పాలనాకాలం ఏది?
- క్రీ||శ|| 945-971
రెండో అమ్మరాజు బిరుదు ఏది?
- కవిగాయక కల్పతరువు
రెండో అమ్మరాజు ఆస్థాన కవులు ఎవరు?
- కవిచక్రవర్తి, పోతనభట్టు
రెండో అమ్మరాజుని హతమార్చి సింహాసనం ఆక్రమించినది?
- దానార్ణవుడు
దానార్ణవుని పాలనాకాలం ఏది? - క్రీ||శ|| 970-973
ఇట్టితరి పెద్దకలు పాలకుడెవరు?
- జటాచోడు భీముడు
దానార్ణవుడ్ని హతమార్చి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్న దెవరు?
- జాటాచోడ భీముడు
జటాచోడ భీముడు ఎవరి బావమరిది?
- రెండో అమ్మరాజు
జటాచోడ భీముని పాలనాకాలం ఏది?
- క్రీ||శ|| 973-1000
కైలాసనాధ స్వామి ఆలయంలో శాసనం వేయించిన దెవరు?
- జటాచోడ భీముడు
జటాచోడ భీముని హతమార్చి సింహాసనాన్ని అధిష్టించినదెవరు?
- శక్తివర్మ
శక్తివర్మ పాలనాకాలం ఏది?
- క్రీ||శ|| 999-1011
శక్తివర్మకు సాయం చేసిందెవరు?
- రాజరాజ చోళుడు
రాజరాజు కుమార్తె కుందవ్వను వివాహం చేసుకున్న దెవరు?
- విమలాదిత్యుడు
చోళ-చాళుక్య యుగం ఎప్పుడు ప్రారంభమైంది?
- శక్తివర్మకు రాజరాజచోళుడు సాయం చేయడంతో క్రీ||శ||999
శక్తివర్మ బిరుదు ఏది?
- చాళుక్య చంద్రుడు
శక్తివర్మ అంనతరం రాజ్యాధికారాన్ని చేపట్టినదెవరు?
- విమలాదిత్యుడు
శక్తివర్మ, విమలాదిత్యులు ఎవరి కుమారులు?
- దానార్ణవుని
విమలాదిత్యుని పాలనాలకాలం ఏది?
- 1011 - 1018
విమలాదిత్యుని బిరుదు లేవి?
- రాజమార్తాండ, ముమ్మిడిభీమ
విమలాదిత్యుని గురువు ఎవరు?
- జైన సన్యాసి త్రికాలయోగి సిద్ధాంత దేవుడు
విమలాదిత్యుని భార్యలు ఎవరు?
- కుందవ్వ, మేళవ
రామతీర్థంలో 'రామకొండ' అనే గుహాలయాన్ని నిర్మించిన దెవరు?
- విమలాదిత్యుడు
విమలాదిత్య, కుందవ్వల కుమారెడెవరు?
- రాజరాజ నరేంద్రుడు
రాజరాజ నరేంద్రుని పాలనాకాలం ఏది?
- క్రీ||శ|| 1019 -1060
రాజరాజు భార్య ఎవరు? - అమ్మంగాదేవి
అమ్మంగాదేవి ఎవరి కుమార్తె?
- మొదటి రాజేంద్రచోళుని
కళ్యాణి చాళుక్యులకు, రాజరాజనరేంద్రునకు మధ్య జరిగిన యుద్ధం ఏది?
- కలిదిండి యుద్ధం
సింహాసనం కోసం రాజరాజనరేంద్రునితో పోరాడిందెవరు?
- సవతి తమ్ముడు విజయాదిత్యుడు
ఆంధ్ర సాహిత్యానికి పునాది వేసిన రాజెవరు?
- రాజరాజ నరేంద్రుడు
రాజ రాజ నరేంద్రుని ఆస్థాన కవి ఎవరు?
- నన్నయభట్టు
నన్నయభట్టు బిరుదుల ఏవి?
- ఆదికవి, వాగమశాసనుడు
ఆంధ్ర మహాభారత రచనలో నన్నయభట్టుకు సాయం చేసినదెవరు?
- నారాయణభట్టు
నారాయభట్టు ఎవరి ప్రధాని?
- అహవమల్ల సోమేశ్వరుని
కళ్యాణిచాళుక్య రాజైన అహవమల్ల దానమిచ్చిన ఆగ్రహారం ఏది?
- నందంపూడి అగ్రహారం
'కరీభ వజ్రాంకుశ' అనే బిరుదు ఎవరిది?
- నారాయణభట్టు
రాజరాజ నరేంద్రుని లేఖకుడు ఎవరు?
- నన్నయణభట్టు
నందంపూడి నరేంద్రుని లేఖకుడు ఎవరు?
- గండాచార్చుడు
రాజరాజ నరేంద్రుని కుమారుడు ఎవరు?
- రాజేంద్రుడు
రాజరాజ నరేంద్రుని అనంతరం సింహాసనాన్ని అధిష్టించినదెవరు?
- విజయాదిత్యుడు
విజయాదిత్యుని కుమారుడు ఎవరు?
- రెండో శక్తివర్మ
విజయాదిత్యుని అనంతరం రాజ్యాధికారాన్ని చేపట్టినదెవరు?
- రెండోశక్తివర్మ
రెండోశక్తివర్మ పట్టాభిశిక్తుడైనది?
-1061 అక్టోబరు 18న
రెండో శక్తివర్మను వధించి వేంగి రాజ్యాధికారాన్ని రాజేంద్రునకు అప్పగించిన తంజావూరు చోళ రాజెవరు?
- వీర రాజేంద్రుడు
రాజేంద్రుడు అధీనంలోకి వేండి ఎప్పుడు వచ్చింది?
- 1068
కుళోత్తుంగ చోళుడని ఎవరిని పిలుస్తారు?
- రాజేంద్రచోళుడు
వీర రాజేంద్రుని అనంతరం తంజావూరు చోళరాజ్యాన్ని కూడా తన అధీనంలోకి తెచ్చుకొన్న చాళుక్యరాజు?
- రాజేంద్రచోళుడు
కులోత్తుంగ చోళుని సంతతి వారిని ఏమంటారు?
- చాళుక్య చోళుడు
చాళుక్య చోళ మైత్రి ఫలితంగా ఏయే దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు హెచ్చినవి?
-ఆంధ్ర- తమిళ దేశాలు
కులోత్తుంగ చోళుడు ఎక్కడినుండి పాలించాడు?
- కంచి
రాజమహేంద్రవరంలో కులోత్తుంగ చోళుని సామంతుడు ఎవరు?
-విజయాదిత్యుడు
విజయాదిత్యుడు మరణించినది?
- 1075
ఎవరి మరణంతో తూర్పు చాళుక్యయుగం ముగిసిపోయింది?
- విజయాదిత్యుని
చాళుక్య చోళ పాలనాకాలాన్ని ఏమని పిలుస్తారు?
- మాండలిక యుగం
తూర్పు చాళుక్యుల కాలంలో పరిపాలన ఎవరి ఆధీనంలో ఉండేది?
- 18 శాఖలుగా విభజించబడి తీర్థుల ఆధీనంలో
తీర్థులు అనగా ఎవరు?
- ఉద్యోగులు
సప్తాంగాలు అంటే ఏవి?
- రాజు, మంత్రి, రాజ్యం, దుర్గం, కోశం, సైన్యం, మిత్రులు
తూర్పు చాళుక్యుల కాలంలో ప్రాంతీయ పాలనా విభాగాలు ఏవి?
- విషయము, నాడు, కొట్టము, గ్రామము
రాష్ట్రీయోద్యోగుల పేర్లేవి?
- నైయోగిక, వల్లభులు, మన్నేయులు
గ్రామాధికారులను ఏమని పిలిచేవారు?
- గ్రామేయకులు
గ్రామంలో వుండే ప్రభుత్వోద్యోగి ఎవరు?
- గ్రామిణి
గ్రామాలలో శిస్తు వసూళ్ళు బాధ్యత ఎవరు చూసేవారు?
- గ్రామిణి
కేంద్రపాలనలో కాకుండా స్థానిక పరిపాలకుల చేతిలో ఉండే ప్రాంతాన్ని ఏమనేవారు?
- విస్తార ప్రాంతం
తూర్పు చాళుక్యుల కాలంలో విస్తార ప్రాంతాలు ఏవి?
- ఎలమంచిలి, పిఠాపురం, ముదిగొండ
పన్నులేని భూములను ఏమని పిలిచేవారు?
- ఉంచాలి.
గొడుగులు చేసే వారిచ్చే పన్నును ఏమనేవారు?
- గొదెన పన్ను
ముఖ్యమైన పన్నులను చూసే అధికారి ఎవరు?
- వడ్డ వ్యవహారి
పన్నుల లెక్కలు చూసే అధికారి ఎవరు?
-కరణము
సుంకాధికారులపై అధికారి ఎవరు?
- భండారి
గ్రామ పరిపాలనా బాధ్యత ఏ వృత్తుల వారి ఆధీనంలో ఉండేది?
- గ్రామ ద్వాదశం అనే పండ్రెండు వృత్తుల వారి
- గ్రామాధికారి, న్యాయాధికారి, కరణము, గ్రన్తి, తలారి, జ్యోతిష్కుడు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి గ్రామోపాధ్యాయుడు
గ్రన్తి అంటే ఎవరు?
- గ్రామ తటాకం, చిన్న చిన్న జలాధారాలపై ఆధిపత్యం వహించే వ్యక్తి
పాన్బాగ్ అంటే ఎవరు?
- కొన్ని ప్రాంతాలలో గ్రామకరణం పేరు
గ్రామాధికారిని ఏయే పేర్లతో పిలిచేవారు?
- రాట్, రెడ్డి, రట్టోడ్లు
భారీ వ్యాపారాలపై విధించిన పన్ను?
- హెజ్జుంక లేదా పెర్జుంక
స్వల్ప వ్యాపారాలపై వేసిన పన్ను?
- కిరుపుల సుంకం
భూమి కొలతలకు ప్రమాణం ఏది?
- గద్యాణము, హాగ
సైనిóకాధికారులు ఎవరు?
- సంధి విగ్రహి, తంత్రపాలుడు
దుర్గాలను రక్షించు అధికారి ఎవరు?
- దుర్గాధ్యక్షుడు
తూర్పు చాళుక్యుల నాటి గ్రామ సభలకు గల పేరు?
- వార గోష్ఠులు
ఏడో శతాబ్ధంలో ఆంధ్ర దేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడెవరు?
- హుయాన్‌త్సాంగ్
తూర్పు చాళుక్యుల కాలంలో వర్తక శ్రేణికి ఏమని పేరు?
- నకరం
నగర ప్రధాన కారాలయం ఏది?
- పశ్చిమ గోదావరి జిల్లా పెనుడొండ
సమస్త భువనేశ్వరాలయం ఎక్కడ ఉంది?
- బెజవాడ
గుణగ విజయాధిత్యుని సేనాని పాండురంగడు ఏ మతస్థుడు?
- జైనమతస్థుడు
బెజవాడలోని కుమారస్వామి ఆలయానికి గొర్రెలు దానం చేసినట్లు తెలిపే శాసనం ఏది?
- యుద్ధమల్లుని బెజవాడ శాసనం
సర్పలోకాశ్రయ, కటకాభరణ అనే జినాలయాలను నిర్మించినది ఎవరు?
- రెండో అమ్మరాజు
తూర్పు చాళుక్యుల కాలంలో జైన ధర్మానికి ప్రధాన కేంద్రాలు ఏవి?
- అత్తిలి, బెజవాడ, పుదూరు, రాజమహేంద్రవర్మ, కొల్లిపాక
ఆ కాలంలోని సుప్రసిద్ధ గురువులు ఎవరు?
- ఆర్హనందన్, దిననందన్
మొట్ట మొదటిసారిగా తెలుగు పద్యాలు కన్పించిన శాసనం ఏది?
- పాండురంగని అద్దంకి శాసనం
అద్దంకి శాసనం కనిపించే తెలు వృత్తం ఏది?
- తరువోజ
మధ్యాక్కరలున్న చాళుక్యరాజు శాసనం ఏది?
- యుద్ధమల్లుని బెజవాడ శాపనం
No comments:
Post a Comment