Oct 30, 2011

రవితేజ " నిప్పు " సినిమా ...

  • రవితేజ, గుణశేఖర్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'నిప్పు'. బొమ్మరిల్లు పతాకంపై వైవియస్‌.చౌదరి నిర్మిస్తున్నాడు.
  • సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. నిర్మాత వైవియస్‌.చౌదరి మాట్లాడుతూ...'శరవేగంగా రూపొందుతున్న 'నిప్పు' త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 
  • రవితేజ తరహా వినోదం, గుణవేఖర్‌ టేకింగ్‌ సినిమాలో ప్రధాన విశేషాలు. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రను నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ పోషిస్తున్నారు. 
  • కామెడీకి హీరోయిజాన్ని తెచ్చిపెట్టిన ఆయన మా చిత్రంలో పనిచేయటం ప్లస్‌ పాయింట్‌. 
  • తను మాత్రమే చేయ్యగలరనిపించే వైవిధ్యమైన పాత్ర ఇది. నేను, దర్శకుడు గుణశేఖర్‌ అడిగిన వెంటనే ఒప్పుకున్నారు. 
  • హీరో రవితేజ పాత్ర నిప్పులా ఉంటుంది. అందుకే చిత్రానికి టైటిల్‌ 'నిప్పు' అని పెట్టాం' అని అన్నారు. 
  • దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఈ చిత్రంలో ఓ క్యారెక్టర్‌ ప్లే చేశాడట ! 
  • అయితే ఇదేదో ప్లాన్‌ జరిగింది కాదని, అనుకోకుండా ఆయన షూటింగ్‌ స్పాట్‌కు వచ్చినపుడు చిన్న పాత్ర పోషించారని ఫిలీంనగర్‌ సమాచారం.
  • హరీష్‌శంకర్‌ ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌తో 'గబ్బర్‌సింగ్‌' సినిమా చేస్తున్నారు. పోల్లాచిలో షూటింగ్‌ జరుగుతోంది. 
  • 'నిప్పు'లో దీక్షాసేథ్‌ హీరోయిన్‌గా నటస్తోంది. ఈ చిత్రంలో ప్రదీప్‌ రావత్‌, బ్రహ్మానందం, బ్రహ్మాజీ... తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 
  • సంగీతం: థమన్‌, ప్రొడ్యూసర్‌ :వైవియస్‌.చౌదరి, కథ,స్క్రిన్‌ప్లే, దర్శకత్వం:గుణశేఖర్‌. 
  • ఈ అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి .

No comments: