గ్రహణ సమయములో సూర్యుని వైపు చుదకుదడనే మన పూర్వకాలం నుండి వస్తున్న విశ్వాసం . ఆధునిక సైన్స్ కుడా దీనిని ఆమోదించింది. సూర్యుని వైపు సూటిగా చూడటం వల్ల సుర్యకిరణాలు మన కంటిపై పడి నేత్ర పతలమును కాల్చివేస్తుంది. ఇలా చూడటం గ్రహణ సమయమినా, మామూలు రోజుల్లోనైనా ప్రమాదకరం. కానీ మామూలు రోజుల్లో మనము సూర్యుని వైపు చూసినప్పుడు ఆ ప్రకాశాన్ని వేడిని, భరించలేక కనురెప్పలు ముసుకుపోతాయి. ఇలా కంటిరెప్పల ద్వారా మనకు రెటీనా రక్షించబడుతుంది.
కానీ గ్రహణ సమయములో చంద్రుడు సూర్యుడిని ఎంతగానో అడ్డుగా ఆక్రమించి ఉంటాడు. కావున సూర్యకిరణాల తీవ్రత తగ్గి ఉంటుంది. ఈ సమయంలో సూర్యుడిని ఎలాంటి కంటిశ్రమ లేకుండా చుదగాలుగుతాము. అదే పొరపాటు. ఒకవేళ అలా గ్రహణ సమయములో చూసినట్లయితే సూర్యకిరణాలు గ్రహణ సమయములోనైనా, మామూలు సమయములోనైనా ఒకే వేడిని కలిగి ఉంటాయి అని గ్రహిమ్పబడింది. కావున అలా సూర్యుడిని చూడడం కళ్ళకు ప్రమాదకరం. చూడడానికి అనువుగా ఉందని అలా సూర్యుడిని గ్రహణ రోజుల్లో చూసే ప్రమాదం ఉండనే, మన పెద్దలు అలా చూడరాదని తెలియజేసారు.
No comments:
Post a Comment