
సురేందర్ రెడ్డి ఇప్పటికి ఒక నాలుగైదు సినిమాలు తీసాడు. ఫస్ట్ సినిమా ' అతనొక్కడే ' " ఏమోలే " అనుకునేలా తీసాడు. జూ|| తో తీసిన అశోక్ దరిద్రంగా తీసాడు , అతిథి కొంత వరకు బాగనే తీసాడు. ఇక కిక్ సినిమాతో కొంచెం కామెడీ మిక్స్ చేసి ' అతనొక్కడే ' ఒక్క హిట్ చేసాడు. ఇన్ని సినిమాలు తీసినా , సురేందర్ రెడ్డి మీద ఎక్స్పెక్టేషన్స్ ఆంధ్ర దేశంలో ఎవరికీ ఉండవు.
సినిమా మొదటి సగం సరదాగా గడిచిపోతుంది . ఇంటర్వెల్ తో మంచి ట్విస్ట్ ఇచ్చాడు. మన రెడ్డి కి ఇంటర్వెల్ ట్విస్టులు అతనొక్కడే సినిమా నుంచి అలవాటే . అంతవరకు ఎంత పులిహారా కలిపినా ఈ ఇంటర్వెల్ సీన్ బాగా డామినేట్ చేస్తుంది.
సురేందర్ రెడ్డికి సెకండ్ హాఫ్ తియ్యడం రాదేమో ! . అతనొక్కడే సినిమాలో ఒక మాదిరిగా తీసాడు , మొదటి సినిమా కాబట్టి చాలా రోజుల నుండి కథ గురించి అలోచించి ఉండచ్చు. అతిథిలో సెకండ్ హాఫ్ పాడు చేసాడు. కిక్ సినిమాలో కూడా ఇంటర్వెల్ తరువాత పిచ్చి, పిచ్చిగా తీసాడు. రవితేజా కి సూట్ అయ్యింది కాబట్టి దానికి వర్క్ అవుట్ అయింది. ఈ సినిమాలో కూడా సెకండ్ హాఫ్ ఫ్లాష్ బాక్ మనం ఊహించినట్టే ఉంది .
జూ|| మన రెడ్డిని అడిగాడేమో "భయ్యా, నా నరుకుడు సెక్షన్ సినిమాలో పెట్టు భయ్యా" అని. సింహాద్రిలోలా కత్తి ఇవ్వకుండా రెడ్డి కూతురి (అంటే ఈసారి, అది మా చిత్తూరు యాస) సుత్తి ఇచ్చాడు. నరసింహుడులో కూడా జూ సుత్తి పట్టుకుని మనుషుల్ని చంపుతాడు. జూ|| కి నరకడం ( కత్తి ) వర్క్ అవుట్ అయింది కానీ సుత్తి వర్క్ అవుట్ అవడం లేదు. తెలుగు సినిమాలో బాగా నరకడం చూపించేవాడు రాజమౌళి మాత్రమే ! రాజమౌళి మనల్ని ఎమోషనల్ గా ప్రిపేర్ చేస్తాడు, సురేందర్ కి ఇంకా అలా తియ్యటం రాలేదు. నరికేటపుడు పాట నాకు నచ్చలేదు, కీరవాణి అయి ఉంటే ఏదోదో వాయించి మనల్ని బుజ్జగించేవాడు. మళ్ళీ చాలా రోజుల తర్వాత స్కార్పియోలు ఎగిరాయి, ఈ మధ్య తెలుగు సినిమాలో ఇలా ఎగరడం లేదు అనుకున్నా.
తమన్నా ఈ సినిమాలో ఎప్పటిలాగే మబ్బుగా (ఈ మాట తిరుపతిలో ఎక్కువగా అంటూ ఉంటారు) నటించింది. ఈ పిల్ల ఇంక హైదరాబాదుకు రావడం అనవసరం, ఇల్లు ఖాళీ చేసి చెన్నైలోనే ఉండచ్చు. ఎందుకు ఇక్కడ అనవసరంగా బాడుగ దండగ, ఊరికే అటూ, ఇటు తిరగడం ఎందుకు? తమిళ్ వాళ్ళయితే పాటలకి బాగా వాడుకుంటారు, ఏదో ఒకటి వర్క్ అవుట్ అవుతుంది ఆమెకి.
జూ కోసం ఈ సినిమా ఒకసారి ఖచ్చితంగా చూడచ్చు. అతిథి సినిమాలో లాగే ఫ్లాష్ బాక్ పక్కన పెట్టి చూస్తే సినిమా ఒకే అనిపిస్తుంది. కామెడీ మీద అబ్బాయ్ చాలా సినిమాలు చేస్తూ వచ్చాడు, ఈ సినిమాలో నాకు పరవాలేదు అనిపించాడు. నేను అలవాటు పడిపోయానేమో! సినిమాలో ఇంక పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.
దసరాకి ఊసరవల్లి రికార్డు ఏమీ లేదు . కాబట్టి శ్రీ రామ రాజ్యం వచ్చే వరకు దూకుడు దే మొదటి స్థానం . ' శ్రీ రామరాజ్యం ' కుడా చెప్పలేము అంత బావుంటుందని .
ఇతర సినిమాల తో పోలిస్తే ఊసరవల్లి :

యాంకర్ ఇంట్రో - హాయ్..హలో..నమస్తే.. దసరాకి అందరూ పులి వేశాలు వేస్తుంటారు. తను ఆల్రెడీ యంగ్ టైగర్కదా... ఇక పులి వేషం ఎందుకు అనుకున్నాడేమో ..మన ఎన్.టి.ఆర్. ఈ దసరాకి `ఊసరవెల్లి`లా సరదాలు పంచడానికి వచ్చేశాడు. థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తోన్న ఎన్.టి.ఆర్. ఊసరవెల్లిపై సమ్‌థింగ్ స్పెషల్ షో ..ఇప్పుడు స్పెషల్‌గా మీకోసం
బ్యాంగ్
యాంకర్ 1- ఎన్.టి.ఆర్. ....ఈ మూడక్షరాల పేరే ఆడియన్స్‌ని ఐస్కాంతంలా అట్రాక్ట్ చేస్తోంది. తాత బొబ్బిలి పులి నుంచి వచ్చిన నట వారసత్వంతో జూ. ఎన్.టి.ఆర్. యంగ్ టైగర్‌లా వెండితెరపై విజృంభించి కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాడు.
యమదొంగ - పులి ఇంట్రో -

యాంకర్ 2- డైలాగ్ చెప్పడంలో ఓ పవర్..డాన్స్ చేస్తుంటే ఓ పవర్... యాక్షన్ సన్నివేశాలలో ఓ పవర్.
అసలు పవర్ ప్యాక్డ్ పర్ఫార్మన్స్కి కేరాఫ్ అడ్రస్‌లా నిలిచే యంగ్ టైగర్ని వాచ్ చేయడమే...ఫ్యాన్స్‌కి పెద్ద పండగ..
ఊసరవెల్లి - కరెంట్ తీగ డైలాగ్
యాంకర్ 3- స్టూడెంట్ నంబర్. 1 సినిమాలో రాజమౌళి ఎన్.టి.ఆర్. ని సైలెంట్‌గా ప్రెజెంట్ చేశాడు. కానీ వి.వి. వినాయక్ ఆది సినిమాలో ఎన్.టి.ఆర్. లోని అసలు సిసలు సునామీని ఆవిష్కరించాడు.
ఆది - డైలాగ్
యాంకర్ 4- అగ్ని పర్వతం బద్దలయినప్పుడు లావా పొంగు భయాన్ని కలిగిస్తుంది. యాక్షన్ సన్నివేశాలలో
ఎన్.టి.ఆర్. పర్ఫార్మన్స్ చూసిన వాళ్లకు సిల్వర్ స్క్రీన్‌పై లావా పొంగుతున్న ఫీల్ కలుగుతుంది.
ఊసరవెల్లి - యాక్షన్ ట్రైలర్

యాంకర్ 5- ఎన్.టి.ఆర్.లోని పవర్‌ని ఫుల్‌ఫ్లెడ్జ్‌గా వాడుకున్న డైరెక్టర్ రాజమౌళి అనే చెప్పాలి. సింహాద్రి చిత్రంలో ఎన్.టి.ఆర్. నటనలోని వేల రంగుల్ని సరికొత్తగా ప్రెజెంట్ చేసి కలెక్షన్ల వర్షాన్ని కురిపించాడు
రాజమౌళి .
సింహాద్రి - యాక్షన్ సీన్
యాంకర్ 6- మాస్ ఇమేజ్ రంగులో చిక్కుకున్న ఎన్.టి.ఆర్. రంగు మార్చిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఎన్.టి.ఆర్. అంటే ఓ వర్గం ప్రేక్షకులే ఇ ష్టపడే స్థాయి నుంచి ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా ఎన్.టి.ఆర్.ని రీచ్ అయ్యేలా చేశాడు వంశీ.
బృందావనం
యాంకర్ 7- ఎన్.టి.ఆర్.లో యస్.యస్. రాజమౌళి ఒక రంగు..వి.వి. వినాయక్ ఒక రంగు..మెహర్ రమేష్..ఒక రంగు.. కృష్ణ వంశీ మరో రంగు ఎలివేట్ చేస్తే..డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఎన్.టి.ఆర్.లో ఎన్నో షేడ్స్ ఉన్నాయంటూ ఎన్.టి.ఆర్.ని ఊసరవెల్లిని చేశాడు
ఊసరవెల్లి ట్రైలర్

యాంకర్ 8- ఎన్.టి.ఆర్. డైలాగ్స్ చెప్పడంలో ఓ పంచ్ ఉంటుంది. ఎన్.టి.ఆర్. డైలాగ్ డెలివరీలో ఓ పవర్ వుంటుంది. ఆ పంచ్ పవర్ సిల్వర్ స్క్రీన్‌పై సునామీలు సృష్టిప్తోంది.
- కంత్రి -
యాంకర్ 9 - అశోక్ సినిమాతో ఎన్.టి.ఆర్.ని సరిగా ఎలివేట్ చేయలేక పోయిన సురేందర్ రెడ్డి మాంచి కిక్ మీద సెకండ్ అటెంప్ట్ గా చేసిన డైనమిక్ ప్రాజెక్ట్ ..ఊసరవెల్లి
ఎన్.టి.ఆర్. బైట్స్ ఆన్ సురేందర్ రెడ్డి, + సురేందర్ రెడ్డి బైట్స్ ఆన్ ఎన్.టి.ఆర్.
యాంకర్ 10- ఎన్.టి.ఆర్.లోని లవర్ బోయ్ రంగును..ఎన్.టి.ఆర్.లోని యాక్షన్ రంగును కలిపి సురేందర్ రెడ్డి ఎన్.టి.ఆర్.ని ఊసరవెల్లిగా చేశాడు. ఈ కొత్త రంగు దసరా ఢమాకాలా ఆడియన్స్‌ని అలరిస్తోంది.
ఎన్.టి.ఆర్. బైట్స్
యాంకర్ 11- రైటర్ వక్కంతం వంశీ..డైరెక్ట్ సురేందర్ రెడ్డి ..ఇది ఇప్పటి హిట్ కాంబినేషన్. కిక్ సినిమా
సూపర్ సక్సెస్‌తో కాక మీద వున్న ఈ జోడి తమ అన్ని రంగులను ఎన్.టి.ఆర్. ఊసరవెల్లిలో నింపేశారు.
వంశీ బైట్స్
యాంకర్ 12- ఎన్.టి.ఆర్. సురేందర్ రెడ్డిల సెకండ్ టైమ్ కాంబినేషన్..ఎన్.టి.ఆర్. , తమన్నా లఫస్ట్ టైమ్ జోడి.. ఎన్.టి.ఆర్. , దేవీ ప్రసాద్‌ల ఫోర్త్ టైమ్ కాంబినేషన్ ఊసరవెల్లికి రంగులు నింపేశాయి. నిర్మాత ఛత్రపతి ప్రసాద్ ఎన్.టి.ఆర్. ` ఊసరవెల్లి`ని భారీగా తీర్చిదిద్దారు.
ఎన్.టి.ఆర్. బైట్స్ ఆన్ ఛత్రపతి ప్రసాద్
యాంకర్ 13- ఎన్.టి.ఆర్. సినిమాల్లో మ్యూజిక్ కూడా రచ్చ రచ్చ చేస్తుంది. నా అల్లుడు, రాఖీ, అదుర్స్, చిత్రాలకు అదుర్స్ అనిపించేలా మ్యూజిక్ చేసిన దేవీ ప్రసాద్ ఊసరవెల్లికి హుషారైన సంగీతాన్ని అందించాడు. సరికొత్త రంగులతో ఎన్.టి.ఆర్. ఊసరవెల్లి ట్యూన్స్ థియేటర్లలో ఆడియన్స్‌కి సరదాలు పంచుతున్నాయి.
దేవీశ్రీ ప్రసాద్ బైట్స్
యాంకర్ 14- మాస్ రంగు వున్న ఎన్.టి.ఆర్.కి వంశీ పైడిపల్లి క్లాస్ రంగు పులిమాడు. కంత్రి రమేష్ ఎన్.టి.ఆర్. కి గ్రాఫిక్స్ రంగు పులిమి చతికిలపడ్డాడు. ఇంత జరిగాక సురేందర్ రెడ్డి ఎన్.టి.ఆర్. లోని క్లాస్ రంగుని, మాస్‌ని కలిపి ఊసరవెల్లి కి కొత్త రంగులిచ్చి రచ్చ రచ్చ చేస్తున్నాడు.
ఊసరవెల్లి ట్రైలర్
యాంకర్ 15- ఇది ఎన్.టి.ఆర్. ఊసరవెల్లి స్పెషల్ షో.. రిలీజ్‌కు ముందే
ప్రపంచంలో అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న చిత్రంగా ఊసరవెల్లి రికార్డులు
సృష్టించింది. ఇప్పుడు దసరా సాక్షిగా విడుదలైన ఊసరవెల్లి ఇంకెన్ని
రికార్డులు బ్రేక్ చేస్తుందో వేచి చూడాలి. మరో స్పెషల్ షోతో మళ్లీ
కలుద్దాం. అన్ టిల్ దెన్ బైబై..
Tags : NTR Oosaravelli, Oosaravalli movie review, how is oosaravalli, oosaravelli review in telugu , oosaravalli special review ... OOSARAVALLI NTR , Surendar Reddy , Oosaravelli
Tags : NTR Oosaravelli, Oosaravalli movie review, how is oosaravalli, oosaravelli review in telugu , oosaravalli special review ... OOSARAVALLI NTR , Surendar Reddy , Oosaravelli
ఈ అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి - :: నేటి ప్రపంచం ::
1 comment:
ఊసరవల్లి సినిమా యావరేజ్ గా ఉంది . ఫస్ట్ హాఫ్ సరదాగా గడిచిపోతుంది . సెకండ్ హాఫ్ బాలేదు . ఎన్.టీ.ఆర్. కోసం ఒకసారి చూడవచ్చు . - సత్యనారాయణ , వరంగల్
Post a Comment