Oct 4, 2011

కాఫీ జ్ఞాపకశక్తిని కలిగిస్తుందా ? : కలిగిస్తుంది !


మన సంప్రదాయకులు ఇది నిజమే నంటారు. దాదాపుగా చాలామంది భారతీయులు తమ దినచర్యను ఓ గ్లాసెడు వేడి వేడి కాఫీని సేవించి ప్రారంబిస్తారు. ఈ పానీయం తనను రోజంతా హుషారుగా, తాజాగా ఉంచుతుందని విశ్వాసం. 
                                      ఈ మద్య కాలంలో కాఫీ పై వచ్చిన దినపత్రికలలోని వ్యాసాలూ, కాఫీ విలువను అనేక రెట్లు పెంచింది. ఈ వార్త ప్రకారం కాఫీ మనిషి జ్ఞాపక శక్తిని పెంచడానికి దోహదం చేస్తుంది. అరిసోనా విశ్వవిద్యాలయం అద్యయనం ఈ విషయాన్ని నిరూపిస్తూ కాఫీ యొక్క గొప్పతనాన్ని చాటింది. 65 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి ఉదయం సమయములో జ్ఞాపకశక్తి బాగానే పని చేస్తుంది. తరువాత క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుంది. కాఫీలోని ' కెఫిన్ ' అనే రసాయన పదార్ధం ఉదయ సమయం తరువాత తగ్గుముఖం పట్టే జ్ఞాపక శక్తిని అదుపు చేసి, సంయమనం కలిగిస్తుంది. కాబట్టి కాఫీని తాగడం వలన మన జ్ఞాపకశక్తి సమానంగా ఉంటుంది. అందువలన కాఫీని తాగడం వలన మనకు లాభమే తప్ప నష్టమేమీ లేదు. కొందరు కాఫీ తాగడం వలన పళ్ళు పుచ్చిపోతాయని మంచిది కాదు అని అంటారు. అది అంతా వారి బ్రమే .
                                      ఒక్క మాటలో చెప్పాలంటే మన ప్రాచీనులు తమ బుద్ధిబలానికి క్షేమం కలిగించే పానీయాన్ని వాడడమే కాక ముందు తరాలకు ఈ విషయ జ్ఞానాన్ని అందించారు. పెద్దల మాట అందుకే చద్ది మూట అంటారు .   

No comments: