![]() * దూకుడులో నా పాత్రకు నాలుగురకాల షేడ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పటివరకు చేయలేదు. కామెడీ పండించటమే కాకుండా, పలు విధాలుగా పాత్ర పోషణ చేయటం కొత్తగా ఉంది. ఇలాంటి తరహా ప్రతీ చిత్రంలో చేయాలంటే సాధ్యం కాదు. పూర్తిస్థాయి కామెడీ పాత్రలు చేయలేను కూడా. ![]() * సినిమా షూటింగ్ సమయంలోనే దర్శకుడు శ్రీనువైట్ల మీకు బ్లాక్‌బస్టర్ హిట్ ఇస్తున్నానని అన్నారు. కానీ ఆయన నాకు ఇండిస్టీ రికార్డ్ ఇచ్చారు. అమెరికాలో రెస్సాన్స్ బ్రహ్మాండంగా ఉంది. నైజాంలో వచ్చినంత కలెక్షన్లు అమెరికాలో వచ్చాయి. ఇలా రావడానికి శ్రీనువైట్ల దర్శకత్వంతోపాటు నిర్మాతల పబ్లిసిటీ కూడా ఎంతో సహకరించింది. నేను చేసిన చిత్రాల్లో బెస్ట్ ప్రొడ్యూసర్స్ వీరు. వీరి బ్యానర్‌లో మరో సినిమా చేయబోతున్నా. * సినిమా విడుదలకాగానే ముంబైలో పూరీజగన్నాథ్ షూటింగ్‌కు వెళ్ళిపోయాను. మొదటిరోజే మంచి టాక్ వచ్చింది. విజయయాత్ర చేస్తున్నామని దర్శకనిర్మాతలు చెప్పారు. నేను ప్రేక్షకుల స్పందనను కళ్ళతో చూడలేకపోయాను. రెస్సాన్స్ బాగా వచ్చిందని చెప్పారు. ముఖ్యంగా ఎం.ఎల్.ఎ. గెటప్‌కు మంచి స్పందన వచ్చింది. పోకిరిలో పోలీసు ఆఫీసర్ అనేది చివర్లో తెలుస్తుంది. దూకుడులో మొదటే తెలుస్తుంది. దాన్ని ఎలా డీల్ చేస్తాడనే టెన్షన్ చాలా మందిలో ఉంది. సినిమా మొత్తం చూశాక బాగా తీశాడని కాంప్లిమెంట్ ఇచ్చారు. * నాకు ఈ చిత్రంలో అన్ని సీన్స్ ఇష్టమే. కానీ మందుకొట్టే సీన్‌ను కొత్తగా ఉండాలని.. నాచేత తాగించకుండా కేవలం వాసన చూసి మత్తులోకి వెళ్ళినట్లు చూపించే విధానం దర్శకుడు టాలెంట్‌కు నిదర్శనం. దాన్ని ప్రేక్షకులు బాగా ఎంజారు చేస్తున్నారు. * నాన్నగారు ఫోన్‌చేసి శుభాకాంక్షలు చెప్పడమే ఉత్తమ కాంప్లిమెంట్. చూసిన రోజే వెంటనే ఫోన్ చేసి 80కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పారు. ఇక పూరీగారైతే కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉందన్నారు. బ్రహ్మానందంకంటే కొన్ని సీన్స్ డామినేట్ చేశారని కాంప్లిమెంట్ ఇచ్చారు. అంతకన్నా కావాల్సింది ఏముంది. రాజమౌలికూడా అభినందించారు. ఈ చిత్రాన్ని పలు బాషల్లో తీయడానికి ప్రయత్నిస్తున్నారు. హిందీలో నన్నే చేయమని కొంతమంది అడిగారు. నేను తెలుగులోనే బిజీగా ఉన్నాను. ఇప్పట్లో చేసే ఆలోచన లేదు. * బిజినెస్‌మేన్ ఇంకా షూటింగ్ జరుగుతుంది. జనవరి 12న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. పోకిరి తర్వాత మా కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం. భారీ అంచనాలున్నాయి. దూకుడు చిత్రం ఆ చిత్రానికి ప్లస్ అవుతుంది. * వెంకటేస్‌తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. ఆ పాత్ర గురించి ఇప్పుడే చెప్పకూడదు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చెప్పిన కథ బాగా నచ్చింది. రేపు ప్రేక్షకులకూ నచ్చుతుందనే నమ్మకముంది.
దూకుడు వసూళ్లు 100 కోట్లు
|
|
- సూపర్‌స్టార్ కృష్ణ
|
|
|
Oct 12, 2011
పూర్తిస్థాయి కామెడీ చేయలేను : మహేష్ బాబు..దూకుడు వసూళ్లు 100 కోట్లు...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment