Sep 3, 2011

దూకుడు, బోళాతనం కలగలసిన బొత్స ప్రస్థానం..., కిరణ్ ను, చిరు ను వెనక్కి నెడుతున్న బొత్స...

తన ప్రసంగాలలో కొంచెం దూకుడు, మరి కొంచెం బోళాతనం మిక్స్ చేసి జగన్ వర్గాన్ని బొత్స సత్యనారాయణ చీల్చి చెండాడుతున్న తీరు జగన్ పార్టీ లో కలకలం రేపుతోంది. అదే చిరంజీవి కానీ, కిరణ్ కానీ ఎపుడైనా జగన్ ను విమర్శిస్తే కొండా సురేఖ, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మీదపడి కరిచినంత పని చేస్తారు. ఆ దెబ్బకు చిరంజీవి, కిరణ్ లు మరి కొన్ని రోజులవరకు జగన్ ఊసెత్తరని  అనిపిస్తుంది. కానీ బొత్స తీరు చూస్తుంటే జగన్ వర్గం పై ఎపుడు ఎదురుదాడి చేద్దామా అన్నట్టు ఉంటుంది. ఈ విధం గా, కాంగ్రెస్ పార్టీ తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్ధి రేసులో బొత్స ముందు ఉన్నాడు. కిరణ్ ను చిరంజీవి ని రేసు లో వెనక్కు నెట్టాడు. 
            పిసిసి అధ్యక్ష పదవి లో ఉన్న బొత్స జగన్ కోసం రాజీనామాలు చేసిన MLA లకుసర్ది చెప్పడం మాని, తమ రాజీనామాలు ఆమోదింపచేసుకోండని వారిని రెచ్చగొట్టడం ఏమిటని కొందరు ప్రశ్నించినా...,  ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ పార్టీను ఈ రకమైన దూకుడు తో ఎదుర్కోవడమే కరెక్టు అనిపిస్తోంది. 
            MLA లుగా గెలిచినవారు YS బొమ్మతో గెలిస్తే, మరి ఓడిన వారికి YS బొమ్మ పనిచేయలేదా...? మరి గెలిచిన వారిలో నా లాంటి కొంతమంది 2004 కు ముందునుండే YS బొమ్మ లేకుండానే గెలుస్తూ వచ్చాం కదా... అని జగన్ పార్టీ పై ఎదురుదాడి కు దిగి కాంగ్రెస్ వర్గాలలో స్థైర్యం నింపేందుకు ప్రయత్నిస్తూ బొత్స తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు.

No comments: