జగన్ ఒక అహంభావి, దేనినైనా డబ్బుతో కొనే రకం. పోనీ మనుషులను, రాజకీయనాయకులను డబ్బుతో కొంటే కొన్నాడు, కానీ వారికి విలువ నిస్తాడా..., అంటే అదీ ఉండదు. డబ్బుతోవారిని కొన్నాడు కాబట్టి వారిని బానిసలలా ట్రీట్ చేస్తాడు. తన పార్టీ లోని ఇతరుల నిర్ణయాలను పరిగణన లోకి తీసుకోడు. ఆత్మగౌరవం ఉన్ననేతలు జగన్ పార్టీ లో కొనసాగలేరు. కాంగ్రెస్ పార్టీ లోని మరియు తెలుగుదేశం పార్టీ లోని, రాజకీయంగా ఎదగలేక ప్రత్యామ్నాయం కోసం వేచి ఉన్నచిన్న స్థాయి నాయకులకు మాత్రమే జగన్ పార్టీ దిక్కయింది. జగన్ డబ్బుతో వీరికి పబ్బం గడుస్తుంది. ఇలాంటి వారు జేజేలు కొడుతుంటే జగన్ ఇక గాల్లో తేలిపోతుంటాడు. ఓదార్పు యాత్రల సమయం లో ప్రజలకు స్పందిస్తూ జగన్ నవ్వే నవ్వు లో కేవలం యాంత్రికత మాత్రమే గోచరిస్తుంది. సరే, జగన్ గొప్ప వ్యాపారవేత్తా అంటే... కాదు. అక్రమసొమ్ముతో స్థాపించిన వ్యాపార సామ్రాజ్యానికి డైరెక్టర్లు, ఆడిటర్లు ఉంటారు, వారి ఆధ్వర్యం లో అతని వ్యాపారాలు కొనసాగుతూంటాయి. కానీ అదే జగన్ రాజకీయాలలో ఎవరి మాటా వినడు. అదే అతని తండ్రికి KVP లాంటి సలహాదారులున్నారు. అయితే ఇక్కడ, జగన్ ను BJP లో ఉన్నగాలి బ్రదర్స్ తప్పుదోవ పట్టించి కాంగ్రెస్ నుండి బయటకు రప్పించారా అని అనిపిస్తుంది. అలా ఎందుకంటే జగన్ ను BJP లోకి తీసుకువెళ్ళడానికి. అయితే క్రైస్తవ మతస్తుల అండ ఉన్న జగన్ BJP కు మద్దతు తెలపడానికి భయపడుతున్నాడు. ఇలా గాలి బ్రదర్స్ ఎత్తుగడలు సగం లోనే ఆగిపోయాయి. కానీ జగన్ అలా చెప్పుడు మాటలు వినక కాంగ్రెస్ కొనసాగి ఉంటె ఈ పాటికి ముఖ్యమంత్రి అయి ఉండేవాడు. ఈ విధంగా చూస్తే జగన్ కు తెలివితేటలు లేవనిపిస్తుంది. అదే గాలి బ్రదర్స్ BJP లోనూ, జగన్ కాంగ్రెస్ లోనూ కొనసాగితే, కేంద్రం లో కాంగ్రెస్ లేదా BJP ఏ పార్టీ అధికారం లో ఉన్నా, ఒకరిని ఒకరు కాపాడుకుంటూ, రాష్ట్రాలలో ఇంకా మిగిలి ఉన్న సహజ సంపద ను దోచుకుంటూ, ఇంకా..., ఇంకా... అలా... అలా...
కానీ ఇలా..., జగన్ రాజకీయ జీవితం చూస్తుంటే అతను ఏమంత పెద్ద తెలివైన వాడు కాదు, పైగా రాష్ట్ర ప్రజలను ఉద్దరించే రకం అసలు కాదు అని అనిపిస్తుంది.
సరే..., ఇలా దోచుకున్నావేంటి నాయనా..., అంటే చంద్రబాబు దోచుకోలేదా...? అంటాడు. ఇదా సమాధానం...!!!
1 comment:
కాంగ్రెస్ ఆడుతున్న పెద్ద నాటకం లో జగన్ కాంగ్రెస్ ను విడిచిపెట్టడం ఒక చిన్న అంకం. కోర్టు తప్పించి ప్రభుత్వం ఏ చర్యా తీసుకోటం లెదు. దీనివల్ల తెలియటం లేదా. ఇది ఒక నాటకమని. కోర్టులో కేసు ఎప్పటికి తేలేను. ఎన్ని మార్పులువస్తాయి. ఎవరికి తెలుసు? కాలం సాగిపోతే మనుషులు మరిచి పోతారు. హై కోర్టు సుప్రీమ్ కోర్టు లలో కేసు తేలేటప్పటికి సంపాదించినదంతా వారిదగ్గరే వుంటుంది. అంటె కాంగ్రెస్ దగ్గరున్నటులే కదా. ముఖ్యమంత్రి పదవి ఒక నాటకం.
Post a Comment