Sep 27, 2011

క్రియేటివిటీని అలవాటుగా మల్చుకోగలిగితే...!

అందరూ చేసే పొరబాటు ఏమిటంటే ప్రతిదాన్నీ తమ వృత్తి వ్యాపారాలకు అనుకూలంగా మాత్రమే మలుచుకుంటారు. జీవితంలో మిగిలిన అంశాలకు అంత ప్రాముఖ్యతనివ్వరు. ఎందుకంటే వృత్తి వ్యాపారాలలో భుక్తిని సంపాదించి పెట్టేవి కాబట్టి వాటికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. జీవితంలో తాము చేయదలుచుకున్న పలు కార్యక్రమాలను కాలాన్ని కేటాయించే నేపథ్యంలో నైష్పత్తిక వ్యవహారాశైలిని వదిలిపెట్టి మొత్తం కాలాన్ని డబ్బు సంపాదించడానికే కేటాయిస్తారు. ఇది సరైంది కాదు. ఇందువల్ల ప్రధానంగా రెండు నష్టాలు వున్నాయి. అవి:
1. జీవితంలో ప్రధానమైన ఇతర విషయాలు అలక్ష్యం చేయబడతాయి. 2. తద్వారా క్రియేటివిటీ దెబ్బతిని తత్ఫలితంగా వృత్తి వ్యాపారాదులు కూడా సక్రమంగా సాగవు.
జీవితంలో క్రియేటివిటీని పెంపొదించుకోదలిచిన వ్యక్తులు ఈ రెండు నష్టాలపట్ల అప్రమత్తంగా వుండాలి. మన బ్రతుకుదెరువు కార్యక్రమాలకు మాత్రమే ఎక్కువసేపు అంటిపెట్టుకుని వుండడంవల్ల మన జీవితం యాంత్రికమైపోతుంది. విశ్లేషణా సామర్థ్యం గణిత, తార్కిక భాషా సామర్థ్యాలకు మాత్రమే మనం ఎక్కువగా పని కల్పిస్తుంటాం. ఫలితంగా మన మెదడులోని ఒక (కుడి) వైపు భాగానికి బొత్తిగా పని లేకుండా పోతుంది. మనం ఎక్కువగా శ్రద్ధ కనబరచవల్సిన ''క్రియేటివిటీ'' వుండేది ఈ భాగంలోనే అందుచేత మనం నిత్య జీవితంలో ఎక్కువపాళ్లు పని క్రియేటివ్‌ సామర్థ్యం క్రమంగా అణగారిపోతుంది. దీనివల్ల జీవితంలోని వృత్తిపరమైన సామర్థ్యాలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతాయని మనం మొదటి అధ్యాయంలో చెప్పుకున్నాం. మన మెదడులోని కుడి, ఎడమ భాగాలు వేటికవే వైయక్తికంగా పని చేసినప్పటికీ ఒకదానికొకటి తోడ్పాటును అందించుకుంటాయి. కార్యనిర్వహణలో మీరు కనబరిచే విశ్లేషణా సామార్థ్యానికి క్రియేటివిటీ సహకారం ఎంతయినా వుంటుంది. మీరు మీ జీవన కార్యక్రమాలను చాలా తెలివిగా, క్రియేటివిటీకీ అధిక ప్రాధాన్యతనిస్తూ ప్లాన్‌ చేసుకోవాలి. యాంత్రికతను సాధ్యమైనంత దూరంగా వుంచాలి. మీరు సీరియస్‌గా పనిచేసే కార్యాలయంలో కూడా మీరు క్రియేటివిటీని యథాశక్తి నెలకొల్పవచ్చు. అది ఎలాగో మీరు తరువాత అధ్యాయంలో నేర్చుకుంటారు.
ముందుగా మీ 'రోజు'ను రూపొందించండి

1.నిద్ర లేస్తూనే 'ఈ రోజుని ఎలా గడపాలో సక్రమంగా మలుచుకోండి. మీ మైండ్‌ను రిలాక్స్‌డ్‌గా వుంచండి. ఆలోచనలను స్వేచ్ఛగా తిరుగాడనివ్వండి. మీరు కోరుకున్నట్లుగా ఈ రోజంతా గడవాలంటే సాధ్యమైన వాటిని ఒక జాబితా రూపంలో రాయండి. మీకు అపరిమితమైన స్వేచ్ఛ, అనంతమైన సంపద వుంటే మీరు 'ఈరోజు' మీకు నచ్చిన విధంగా గడపడానికి ఏమేం చేస్తారో రాయండి.
2. ఆదర్శవంతమైన జీవితాన్ని ప్రతిరోజూ ఆదర్శవంతంగానే గడపాలి. మీ దృష్టిలో ఆదర్శవంతమైన రోజు అంటే ఎలా వుండాలో వర్ణించండి. వివరణాత్మకంగా వర్ణించండి. ఇక్కడ సంక్షిప్తత పనికి రాదు. సాధ్యమైనంత వివరంగా రాయండి. మీకు వీలయినంత స్పష్టంగా వివరించే ప్రయత్నం చేయండి. ఉదయం నిద్రలేచినప్పటి నుండే ప్రారంభించండి. ఉదయం లేవగానే మీరు ఏం చేస్తారు? జాగింగ్‌కు ఎటువైపు వెళతారు. ఆదర్శవంతమైన రోజుగా దీన్ని మలిచేందుకు మీకు ఏమేం కావాలో రాసుకోండి. ఇక్కడ డబ్బు ప్రామాణికం కాదు. మీరు రోజంతా ఎలా గడపాలనుకుంటున్నారో వివరంగా రాయండి. మీరు ఆఫీసుకు వెళ్లేటప్పుడు మీ మానసిక, శారీరక శక్తి సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోండి. మీకు కార్యాలయానికి వెళ్లడం అమితోత్సాహంగా అనిపించాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.
3.పెంపొందింపచేసుకోవడానికి ఎల్లవేళలా ఆకర్షితుడై వుంటానని అంటాడు. అలా క్రియేటివ్‌గా వుండటానికి ప్రయత్నించడం వల్లనే ఒత్తిళ్లు తగ్గుతాయంటాడు. అనేక ఒడిదుడుకులు వున్న నేటి పరిస్థితుల్లో క్రియేటివిటీని మేల్కొలిపి విభిన్న తరహాగా జీవించడమే సమస్యకు సరైన పరిష్కార మార్గమని ఫ్రాంక్లిన్‌ అంటాడు. అందుకు ఉదాహరణగా ఆయన తాను తీసుకునే చర్యలనే చెప్తాడు. క్రియేటివిటీకి సంబంధించి ప్రముఖులు రాసిన కొటేషన్లను సేకరించడం ఆయన చేపట్టే విభిన్న కార్యక్రమాల్లో ఒకటి. ఆయనవద్ద ప్రస్తుతం 1, 50,000కు పైగా కొటేషన్లు వున్నాయి. వాటన్నిటినీ 100 పుస్తకాల రూపంలో భద్రపరిచారు. క్రియేటివిటీ మీద ఇన్ని కొటేషన్లును సేకరించడం కూడా ఒక క్రిచేటివిటీ ప్రక్రియే. తాను సేకరించిన కొటేషన్లను గురించి వివరిస్తూ, ఈ ప్రపంచలో క్రియేటివిటీపట్ల చాలా భిన్నమైన అభిప్రాయాలు వున్నాయంటాడు. అయితే ఇవన్నీ ఏదో ఒక ప్రయోజనాన్ని చేకూర్చేవే.

No comments: