
భావోద్వేగభరిత డ్రామా, అర్థంలేని త్యాగం, అవధుల్లేని హింస...వంటి కథాంశాల నుంచి నేటి తెలుగు సినిమా దూరంగా వెళుతోందనిపిస్తోంది. విషాదాంతాలను నేటి ప్రేక్షకుడు కోరుకోవటం లేదు. సందర్భోచిత హాస్యానికి, డ్రామాకి ఆదరణ పెరుగుతోంది. వినోదానికి మొదటి ప్రియారిటీ ! తదుపరి...విషయానికి ! ఇస్తున్నాడు. అలా మొదలైంది, మిస్టర్ పర్‌ఫెక్ట్ ఇలాంటి ఈక్వేషన్‌తో వచ్చి విజయాన్ని అందుకున్నవే. తాజాగా సుకుమార్ వంతు వచ్చింది. కాలేజీ కథకి వినోదాన్ని జోడించి, ఫ్యామిలీ డ్రామాతో
'100 % లవ్'ను చూపాడు.
మాస్ పాటలు, భీకరమైన ఫైట్స్ అనేవి ఎంచుకోకుండా, ప్రేక్షకుల్ని మెప్పించాలన్న నాగచైతన్య ప్రయత్నం బాగుంది. నాగచైతన్య నెగిటివ్ రోల్ ఎంత ముఖ్యమైందో, తమన్నా యాక్షన్ కూడా అంతే ముఖ్యమైంది. అహంభావికి తగిన వ్యక్తిగా తమన్నా నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మనిషిలో ఉండే ఈర్ష్య, అసూయ అనే అంశాల చుట్టూ నడిచిన కథలు తెలుగు తెరకు ఇటీవల రాకపోవటంతో కాస్త కొత్తదనంగా అనిపిస్తుంది. మొత్తంగా పదిన్నర కోట్ల రూపాయలతో బన్నీవాసు తెరపై కురిపించిన 'వంద % ప్రేమ'కు ప్రేక్షకుడు గరిష్ట మార్కులే వేశాడు.
కథ, దర్శకత్వం : సుకుమార్
తారాగణం : నాగచైతన్య, తమన్నా
స్క్రిన్‌ప్లే : జె.హరిప్రసాద్
సంగీతం : దేవిశ్రీప్రసాద్
నిర్మాత : బన్నీవాసు
బ్యానర్ : గీతాఆర్ట్స్
ఇది కథ : బాలు (నాగచైతన్య) చదువులో టాపర్. ఫస్ట్ ప్లేస్ తప్ప, సెకండ్ అనే పదం అతని డిక్షనరీలో లేదు. పల్లెటూరి నుంచి చదువుకోవడానికి బాలు మరదలు మహాలక్ష్మి (తమన్నా) పట్నానికి వస్తుంది. బాలు ఇంట్లో ఉండి, అతను చదువుకునే కాలేజ్‌లోనే చేరుతుంది. చదువులో మహాలక్ష్మి యావరేజ్ స్టూడెంట్. దాంతో బాలు సలహాలు, సూచనలు అవసరమవుతాయి. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య చనువు పెరుగుతుంది. బాలుపై మహాలక్ష్మి మనసుపారేసుకుంటుంది. మరోవైపు బాలు చెప్పిన టిప్స్ పాటించి, చదువులో అతనికి పోటీగా మారుతుంది.

చూడాల్సిందే !
'ఇగో' క్లాష్, అహం అడ్డుగోడలు అనేవాటితో తెరకెక్కిన కథాంశాలు ఇటీవల రాలేదనే చెప్పొచ్చు. పైగా ఎంచుకున్న కథాంశం ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్‌కు సంబంధించినదై ఉండటం నేటి యువతకు బాగా కనెక్ట్ అయింది. ఇందులో దర్శకుడు సుకుమార్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ఇలాంటి ఇగో క్లాష్‌లు చాలాచోట్ల యువత మధ్య చూస్తుంటాం.
అమితాబ్‌బచ్చన్ నటించిన అభిమాన్, ఆనంద్ సినిమాల్లోనూ కథకు ఇదే కీలకాంశం. ఇక్కడ తేడా ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్+లవ్. దీనికి దర్శకుడు కొంత హ్యూమన్ సైకాలజీ జోడించాడు. తన స్కూల్ డేస్, కాలేజ్ డేస్ అనుభవాలు బాగా ఉపయోగపడ్డాయి. కొన్ని ఆలోచనలు వైల్డ్‌గా తోస్తాయి. ఇలాంటి కథనాలకు హీరో నెగిటివ్ రోల్ బాగా సూటవుతుంది. కానీ కొన్ని చోట్ల హీరో నాగచైతన్య దాన్ని ప్రతిబింబిం చటంలో సఫలం కాలేదనే చెప్పొచ్చు. ఇక టెక్నీషియన్ల విషయానికొస్తే...సినిమాకు ప్రధాన బలం స్క్రిన్‌ప్లే. రూపొందించిన జె.హరిప్రసాద్‌కు అందరికన్నా ఎక్కువగా వందమార్కులు పడతాయి. మొదటి భాగం హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో, సెకండ్ పార్ట్ హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపెట్టడం సరిగ్గా సెట్ అయింది. ఇందుకు దర్శకుడి సుకుమార్ క్రియెటివిటీ పెద్ద ఎస్సట్ అయిందనే చెప్పొచ్చు. మొదటి సగ భాగంలో చూపిన కాలేజ్ కథంతా, అతని అనుభవాలనే భావించొచ్చు. టైటిల్ కార్డ్ చూపించిన విధానం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది.
మొదటి భాగాన్నంతా వినోదానికి కేటాయించాడు. రెండో భాగంలో ఫ్యామిలీ ఓరియెంటేషన్ జోడించి కొన్ని మలుపులు తిప్పక తప్పలేదు. రెండో అర్థభాగంలో కొన్ని డల్ సీన్స్ ఉన్నా, ప్రేక్షకుడ్ని అవంత చికాకు పరచవు. మరోవైపు దేవిశ్రీప్రసాద్ కూర్చిన సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది.

వీటికి చూపిన పిక్చరైజేషన్ బాగుంది. సన్నివేశాలు జిగ్‌జాగ్ లేకుండా, కంటికి భారం కలగకుండా చూపటంలో జాగ్రత్త పడ్డారు. విజువల్స్ విషయంలో ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగేండేవి. నిర్మాతగా అన్ని శాఖల్నీ అసెంబ్లింగ్ చేయటంలో బన్నీవాసు సఫలమయ్యాడనే చెప్పొచ్చు. చేసిన తొలి ప్రయత్నానికి ప్రేక్షకుడు మంచి మార్కులే వేశాడు.
- ఎస్.పి.పవన్
No comments:
Post a Comment