గాలి జనార్దన్ రెడ్డి బంగారం కుర్చీలోనే కూర్చుంటారు. దాని ఖరీదు 2.2 కోట్ల రూపాయలు. బంగారంతో తయారు చేసిన విగ్రహాలకు పూజలు చేస్తారు. వాటి విలువ రూ. 2.28 కోట్లు. రూ. 13.15 లక్షల విలువ చేసే బెల్టు ధరిస్తారు. 6 కోట్ల విలువ చేసే కార్లలోనే తిరుగుతారు. ఇంకొక చిన్న విషయమన్దోయ్ కేవలం 1000 కోట్ల రూపాయాల ఇళ్లలోనే ఉంటారు. అంతే కాదు అది ధరించి మాత్రమె బంగారు దేవుళ్ళకు పూజ చేస్తారు. పొద్దున్నే లేచిన దగ్గరనుండి గాలికి అంతా బంగారమే ! గాలి జనార్దన్ రెడ్డి జీవితమంతా స్వర్ణమయమే. గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన ఈ వివరాలతో ఓ ఆంగ్లదినపత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది. బంగారు పల్లెంలోనే తింటారు. గిన్నెలు, చెంచా, ఫోర్కు, కత్తి – అన్నీ బంగారానివే. వీటి విలువ రూ. 20.87 లక్షలు ఉంటాయని సమాచారం.
ఆ వివరాలన్నీ కర్ణాటక లోకాయుక్తకు సమర్పించినవేనని ఆ పత్రిక రాసింది. 2010 మార్చి 31వ తేదీ వరకు తనకు గల ఆస్తుల వివరాలను గాలి జనార్దన్ రెడ్డి 2010 జూన్ 25వ తేదీన లోకాయుక్తకు సమర్పించారు. గాలి జనార్దన్ రెడ్డికి గల ఆభరణాల జాబితా మూడు పేజీల నిండా ఉంది. వాటి విలువ కోట్లాది రూపాయలు ఉంటుంది. ఎన్నో సెట్ల గాజులు, పచ్చ సఫైర్ స్టోన్, ర్యూబీ, బంగారు పరికరాలు, నెక్లెస్లు, చెవి పోగులు, పురుషుల ఆభరణాలు, రింగులు, బంగారు విగ్రహాలు – ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.
ఎయిర్ కండీషనర్స్, టీవీ సెట్లు, ఫర్నీచర్ – ఇంటి వస్తువుల విలువ లక్షలాది రూపాయలు ఉంటుంది. వ్యవసాయ భూములు, భవనాలను, వారసత్వ ఆస్తులను మినహాయిస్తేనే గాలి జనార్దన్ రెడ్డి ఆస్తులు 153.49 కోట్ల రూపాయల విలువ చేస్తుంది. ఆయన నెజీతం రూ. 31.54 కోట్లు కాగా, వాణిజ్య ఆదాయం రూ. 18.30 కోట్లు.
మరి ఇప్పుడు ఎంత ఉన్నాయో ఆలోచించండి?
సి.బి.ఐ. వారికిలభించిన ఆధారాల మేరకు దాదాపు 7000 కోట్ల అక్రమ మైనింగ్ జరిగినట్లు సమాచారం.
ఇక పోతే గాలి సోదరుల చరిత్ర చాలా ఉంది. రాబోయే పోస్ట్ లలో రాస్తాను.
పాపం బంగారు జనార్ధనుడు జైల్లో ఏం చేస్తున్నాడో.
No comments:
Post a Comment