Pages

Nov 2, 2011

సూపర్స్టార్ వెంకటేష్ " బాడీగార్డ్ " సినిమా గురించి...

  • వెంకటేష్‌ తాజా చిత్ర 'బాడీగార్డ్‌' సంక్రాంతికి రానుంది. 
  • గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కింది. 
  • మల్టీడైమెన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (ప్రై) లిమిటెడ్‌ సమర్పణలో శ్రీసాయిగణేష్‌ ప్రొడక్షన్స్‌ (ప్రై) లిమిటెడ్‌ పతాకంపై బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మిస్తున్నారు. 
  • భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తరహాలో రూపొందిన ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. 
  • ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ...'ఒక పాట మినహా షూటింగ్‌ మొత్తం పూర్తయింది. 
  • డిసెంబర్‌లో ఆడియో రిలీజ్‌ చేసి జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నాం. 
  • తమన్‌ ఈ చిత్రానికి ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ ఇచ్చారు. వెంకటేష్‌ కెరీర్‌లోనే విభిన్న చిత్రంగా 'బాడీగార్డ్‌' రూపొందుతోంది. 
  • మా బ్యానర్‌లో వెంకటేష్‌ చేస్తున్న రెండో సినిమా ఇది. తప్పకుండా పెద్ద హిట్‌ అవుతుందన్న నమ్మకం వుంది' అని అన్నారు. 
  • వెంకటేష్‌, త్రిష, సలోని, ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, ఆలీ, సుబ్బరాజు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ప్రగతి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 
  • ఈ చిత్రానికి మాటలు: కోన వెంకట్‌, సంగీతం: తమన్‌ గౌతంరాజు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ప్రసాద్‌ మైనేని, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌బాబు, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: గోపీచంద్‌ మలినేని.

No comments:

Post a Comment