హైదరాబాద్, మేజర్‌న్యూస్: సకలజనుల సమ్మె రాష్ట్ర సర్కారును అతలాకుతలం చేస్తోంది. సమ్మె దెబ్బకు ఖజానా నిలువునా వణుకుతోంది. సకల జనుల సమ్మెతో ముప్పేట దాడి జరుగుతోంది. దాంతో సర్కారు దిమ్మ తిరుగుతోంది. ఏడు రోజు లుగా జరుగుతున్న సమ్మె ప్రభావంతో ప్రభుత్వ ఖజానాకు సుమారుగా రూ.1600 కోట్లమేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కిరణ్ సర్కార్‌పై సకల జనుల సమ్మె ప్రభావం గణనీయంగా పడ్తోంది. ఈ భారం ఖజానాపై పడటంతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సంకటంలో పడే ప్రమాదం కనిపిస్తోంది. ఈ గడ్డు పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన పలు ప్రత్యామ్నాయాలు అంతగా ఫలితం చూపడం లేదు. ఎస్మా పరిధిని పెంచిన ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రభుత్వ శాఖల్లో సమ్మె లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ టి-ఉద్యోగులు ఈ బెదిరింపులను బేఖాతరు చేస్తుండటంతో ప్రభుత్వ ఖజానాకు కా సుల రాక గణనీయంగా తగ్గుతోంది. క్రమక్రమం గా నానాటికీ సమ్మె విస్తృతి పెరుగుతండటంతో ప్రభుత్వం కలవరపడుతోంది.
సకల జనుల సమ్మె ఏడో రోజున రవాణా శాఖ అందులో మమేకం కావడంతో ప్రభుత్వానికి ఊపిరి సలపడం లేదు. సోమవారం ఒక్కరోజే ఆరీ్టి సీ సమ్మెదెబ్బకు ప్రభుత్వానికి రూ.9-10కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇక ఈ-సేవ ఉద్యోగులు సమ్మె లో భాగస్వాములు కావడంతో ఈ-సేవా కేంద్రాల్లో వసూళ్లు నిలిచిపోయాయి. ప్రభుత్వానికి ఈ-సేవల ద్వారా రోజుకు రూ.250 కోట్లమేర ఆదాయం వసూలవుతుండగా గత ఆరు రోజులుగా అవి నిల్చి పోయాయి. ప్రభుత్వ ఖజానాకు అత్యంత ఆదా యాన్నిచ్చే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో సమ్మె ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికే ఈ శాఖ ద్వారా ప్రభుత్వానికి రూ.250 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా స్టాంపు పేపర్ల అమ్మకాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
న్యాయస్థానాల్లోను స్టాంపు పేపర్ల కొరతతో కార్యక లాపాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయవనరుగా ఉన్న భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో ప్రభుత్వ రాబడి క్రమంగా క్షీణిస్తోంది. జిల్లాల వారీగా ఏడు రోజుల ఆదాయ వివరాలను రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ కార్యాలయం పరిశీలించగా సోమవారానికి అవి 0 ఫలితాలు సూచించినట్లుగా తెలిసింది. రాష్ట్ర ఖజానాకు ప్రధాన ఆదాయవనరుగా ఉన్న ఎకై్సజ్ శాఖలో మెల్లమెల్లగా సమ్మె ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే ఎకై్సజ్ మద్యం అమ్మకాల్లో రూ.150 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇంకా పూర్తిస్థాయిలో ఎకై్సజ్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటే ఈ నష్టం గణనీయంగా పెరగనుంది. 10 జిల్లాల్లో ఇప్పటికే లిక్కర్ గోడౌన్లలో సరుకు నిండుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఎకై్సజ్ ఉద్యోగుల సమ్మె ప్రభావం మద్యం అమ్మకాలపై పడి ప్రభుత్వ ఖజానాకు ఆమేరకు ఆదాయం తగ్గుముఖం పడ్తోంది. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా ప్రభు త్వానికి పెద్దగా నష్టం వాటిల్లనప్పటికీ ఉద్యోగుల సహకారం లేకుండా పన్నుల వసూలు ప్రభుత్వానికి తలనొప్పులు తెస్తోంది. ఇప్పటికే సమ్మె ప్రభావం రోజురోజుకీ తీవ్ర రూపం దాల్చుతుండటంతో ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్థిక పరిస్థితి జఠిలం అయ్యే పరిస్థితి దాపురిస్తోంది. దీని ప్రభావం తెలంగాణేతర ప్రాంతాల ఉద్యోగుల జీతాలపై పడనుంది. సెప్టెంబర్ నెల ప్రభుత్వ జీతాలకు ప్రభుత్వం సంకటస్థితిని ఎదుర్కొనే అవకాశం కన్పిస్తోంది. ప్రభుత్వ పాలనకు క్షేత్రస్థాయిలో కీలకంగా నిలిచే రెవెన్యూ సేవలు తెలంగాణలో పూర్తిగా ఆగాయి. దీంతో ప్రజలకు, విద్యార్దులకు రెవెన్యూ ధ్రువపత్రాలు, ప్రభుత్వ పన్నుల వసూలుకు బ్రేక్ పడింది. విదేశీయానానికి వెళ్లే వారు పాస్‌పోర్టుల జారీలో తీవ్ర జాప్యంతో అవస్థలు ఎదుర్కుంటున్నారు.

No comments:
Post a Comment