హైదరాబాద్, మేజర్‌న్యూస్: సకల జనుల సమ్మెకు ప్రత్యా మ్నాయ ఏర్పాట్లతో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి ముందుకు దూసుకుపోతున్నారు. అదేవిధంగా అటు కేంద్రం లోనూ తన పలుకుబడిని ఉపయోగించి రాష్ట్రంలో నెలకొన్న తాజా గడ్డు పరిస్థితులను అధిగమించడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అదనపు బొగ్గు, విద్యుత్ తదితర అంశాలపై ప్రధానంగా ఆయన దృష్టి సారించినట్లు తెలిసింది. రవాణా, నీటి సరఫరా, శాంతిభద్రతలు ఇతర అత్యవసరాలపై కూడా ప్రజలకు ఎటువంటి అవాంతరాలు కలగకుండా ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టాలని ఆయన మంత్రులు, అధికా రులను ఆదేశించారు.
అదే విధంగా తెలంగాణ మంత్రులతో జిల్లాల వారిగా చర్చించి సామాన్య ప్రజలకు సకల జనుల సమ్మెతో ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. సోమవారం ముఖ్యమంత్రి సచివాలయంలో ఉన్నత స్థాయి అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సకల జనుల సమ్మెకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైనే ఆయన ప్రధానంగా దృష్టి సారించారు, అటు విద్యుత్ కష్టాలను అధిగమంచడానికి హర్యానా సీఎంకు ఫోను చేసి అవసరమైన మేరకు విద్యుత్‌ను సర్థుబాటు చేయమని కోరారు. అదేవిధంగా పక్క రాష్ట్రాల సీఎంలతో కూడా విద్యుత్, బొగ్గు తదితర అత్యవసర వస్తువులపై చురుగ్గా మంతనాలు సాగిస్తున్నట్లు సీనియర్ అధికారులు తెలిపారు. తెలంగాణకు చెందిన ఒకరిద్దరు మంత్రులు మినహా డిప్యూటీ సీఎం దామోదర్ రాజ నరసింహ, శ్రీధర్‌బాబు, దానం, ముఖేష్, పొన్నాల మహిళా మంత్రులందరూ వారి జిల్లాల అధికారులతో సీఎం ఆదేశాలకు అనుగుణంగా తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణపై వివరించండి...!
సకల జనుల సమ్మెలో భాగంగా ఉద్యమకారులు టి మంత్రులను అడ్డుకున్నప్పటికీ తెలంగాణపై రాష్ర్ట ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వివరిస్తూ.. మరో రెండు నెలల్లో సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉందని వారికి వివరించమని సీఎం టి మంత్రులను కోరినట్లు తెలిసింది. ఇప్పటికే హైదరాబాద్ బ్రదర్స్ మంత్రి దానం, ముఖేష్‌లు తెలంగాణపై ప్రభుత్వ విధానాన్ని పదేపదే బహిరంగంగానే స్పష్టం చేస్తున్నారు. అదే దారిలో టి మంత్రులు శ్రీధర్‌బాబు, సుదర్శన్ రెడ్డి, పొన్నాల, సబితా, డికె అరుణలు ఎక్కడికక్కడ టి ఆందోళన కారులతో తెలంగాణపై కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వివరిస్తున్న విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక కాంగ్రెస్‌తోనే సాధ్యమ వుతుందని, ఇప్పటికే దీనిపై గులాం నబీ ఆజాద్‌కు తమ వాద నలు వినిపించినట్లు వారు చెబుతున్నారు. మొత్తంగా రానున్న రోజుల్లో టి పార్టీల తెరవెనుక వ్యూహాన్ని అధిగమించే విధంగా టి మంత్రులు సిద్ధంగా ఉండాలని, టి మంత్రుల సమా వేశంలోనూ ఇదే అంశంపై సీఎం పదేపదే స్పష్టం చేస్తున్నట్లు సీనియర్ మంత్రి ఒకరు చెప్పారు.
పెండింగ్ పైళ్లపైనా దృష్టి...
సకల జనుల సమ్మెతో అత్యవసర ఫైళ్లు పెండింగ్ పడకుండా శాఖల పరిగా వాటి క్లియరెన్స్‌పైనా దృష్టి సారించాలని సీఎం సీఎస్‌కు మౌఖిక ఆదేశాలు జారీచేశారు. దీనిలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల ప్రత్యేక ముఖ్యకార్యదర్శి స్థాయి అధికారులకు కూడా స్పష్టమైన సంకేతాలు చేరాయి. ఫైళ్ల క్లియరెన్సుపై కింది స్థాయిలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. అధికారులు ప్రత్యేక శ్రద్ద కనబరిచి వాటిని తక్షణం క్లియర్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

No comments:
Post a Comment