Sep 20, 2011

మళ్లీ కేసీఆర్‌ ఆమ‘రణం’

(సూర్య ప్రధాన ప్రతినిధి):టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ మరోసారి ఆమరణ నిరాహారదీక్షకు సన్నద్ధమ వుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం అనుసరిస్తున్న తాత్సార వైఖ రికి నిరసనగా కేసీఆర్‌ మళ్లీ ఆమ‘రణానికి’ సిద్ధమవుతున్నారు. రోశయ్య ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో తన ఆమరణ నిరాహారదీక్షద్వారా కేంద్రం మెడలు వంచి, అర్ధరాత్రి కేంద్రహోంమంత్రి చిదంబరం ద్వారా సానుకూల ప్రకటన వచ్చేలా చూడటంలో కేసీఆర్‌ విజయం సాధించారు. అది ఆ తర్వాత ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధుల విజయానికి నల్లేరుమీద నడకలా పనిచేసింది.

తన ఆమరణ నిరాహారదీక్ష తర్వాత తెలంగాణపై సానుకూల వైఖరి ప్రదర్శిం చిన కేంద్రం, మళ్లీ సీమాంధ్ర నేతల దీక్షలతో వెనక్కి తగ్గి శ్రీ కృష్ణ కమిటీ వంటి కాలయాపన కార్యక్రమాలు చేపట్టడంతో కేసీఆర్‌ కేంద్రంపై గుర్రుగా ఉన్నారు. అయినప్పటికీ సోనియాగాం ధీని పల్లెత్తు మాట అనకుండా, కాంగ్రెస్‌ను బలోపే తం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని ఢిల్లీలో ప్రకటించారు. కాంగ్రెస్‌లో మార్పు వస్తుందన్న ఆశతో టీడీపీని లక్ష్యంగా చేసుకున్నారు. అప్పటికీ కాంగ్రెస్‌ వైఖరిలో మార్పు రాకపోగా, విభజించి పాలించే చందంగా తెలంగాణ-సీమాంధ్ర నేతల తో ఉద్యమాలను ప్రోత్సహిస్తున్న వైఖరితో విసిగిపో యిన కేసీఆర్‌.. మరోసారి ఒత్తిడి తీసుకువ చ్చేం దుకు ఆమరణ నిరాహారదీక్షను ఆయుధంగా ఎం చుకుంటున్నారు. ఈసారి ఆయన సిద్దిపేటలో గా నీ, నిజామాబాద్‌లోగానీ దీక్ష చే పట్టనునట్లు తెలి సింది. నిజామాబాద్‌లో దీక్ష చేస్తే అక్కడ జరగనున్న ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధి పోచారం విజయానికి అది దోహదపడుతుందని భావిస్తున్నారు.

No comments: