సికింద్రాబాద్-నిజాముద్దీన్, సికింద్రాబాద్- యశ్వంత్ పూర్ గరీబ్థ్,్ర హైదరాబాద్-ముంబై, సికింద్రాబాద్- పాట్నా, హైదరాబాద్-న్యూఢిల్లీ రైళ్లు రద్దయ్యాయి. వాటితో పాటు పలు రైళ్లను దారి మళ్లించారు. 222 ఎంఎంటిఎస్ సర్వీసులు, 102 డిఎంహెచ్‌యు సర్వీసు లనూ రద్దు చేసినట్లు ద.మ. రైల్వే పేర్కొంది. అన్ని ప్యాసింజర్ రైళ్లనూ రద్దు చేశారు.అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సాధనే ద్యేయంగా జరుగుతోన్న సకల జనుల సమ్మెలో భాగంగా నేటి అర్ధరాత్రినుంచి ఆటోలు సమ్మెలో పాల్గొననున్నాయి. 24, 25 తేదీల్లో ఆటోలను నిలిపివేయాలని ఆటో డ్రైవర్ల యూనియన్లు నిర్ణయించాయి.
ఇప్పటికే తెలంగాణాలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంబించిపోయిన నేపథ్యంలో ఆటోల సమ్మె ప్రభావంతో మరింతగా ఉద్యమం ఉధృత మయ్యే అవకాశాలున్నాయి. దీంతో ప్రజలకు రవాణా సదుపాయం కల్గిస్తోన్న ఆటోలు సైతం పూర్తిస్థాయి సమ్మెలో మమేకం అయితే ప్రజలకు ప్రయాణ ఇబ్బందులు పెరగనున్నాయి. దసరా పండగా వస్తుండ టంతో ప్రజలు గమ్య స్థానాలకు చేరేందుకు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆటోల సమ్మెతో సమస్య మరింత జఠిలం కానుంది.




No comments:
Post a Comment