అంతకంతకూ దిగజారుతున్న రూపాయి విలువతో భారత కార్పొరేట్ల
లాభాలకు భారీగానే గండిపడనుంది. విదేశీ రుణాల రూపంలో ఎడాపెడా నిధులను
సమీకరించిన దేశీయ కంపెనీలు ఈ ఏడాది 2 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 9,800
కోట్లు)కు పైగా మొత్తాన్ని రుణ చెల్లింపుల కోసం అదనంగా చెల్లించాల్సి
వస్తుందని అంచనా. డాలరుతో రూపాయి మారకం విలువ దిగజారడమే దీనికంతటికీ కారణం.
దీంతో ఈ ఏడాది కార్పొరేట్ ఇండియా లాభాల్లో ఆమేరకు ప్రతికూల ప్రభావానికి
దారితీయొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఆగస్టు నుంచి ఇప్పటిదాకా దాదాపు
రెండు నెలల వ్యవధిలో డాలరుతో రూపాయి మారకం విలువ 12 శాతం పైగానే దిగజారి 50
స్థాయికి(28 నెలల కనిష్టం) పడిపోయిన సంగతి తెలిసిందే. ఆగస్టు ప్రారంభంలో
రూపాయి విలువ 44 వద్ద ఉంది.
దేశీయంగా వడ్డీరేట్ల పెరుగుదల, ద్రవ్యసరఫరా అడ్డంకుల నేపథ్యంలో వ్యయాలను తగ్గించుకోవడం కోసం భారత కార్పొరేట్లు ఇటీవల కాలంలో చౌక విదేశీ రుణాలను ఇబ్బడిముబ్బడిగా సమీకరించాయి. వీటిలో అమెరికా డాలరు రూపంలో ఉన్న రుణాలే అత్యధికం. అయితే, అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితుల కారణంగా రూపాయి మారకం విలువ క్షీణించడంతో కార్పొరేట్లు ఆశించిన ప్రయోజనాలు ఆవిరయ్యేందుకు దారితీస్తోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆసియాలో ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే తీవ్రంగా పతనమైంది మన రూపాయే. గడిచిన ఒక్క వారంలోనే రూపాయి విలువ 5% పడింది.
ఈ ఏడాది ప్రథమార్ధంలో ఈసీబీల జోరు...
విదేశీ వాణిజ్య రుణాల(ఈసీబీ) రూపంలో భారత కంపెనీలు ఈ ఏడాది జనవరి-జూలై మధ్య 21 బిలియన డాలర్ల నిధులను సమీకరించినట్లు అంచనా. గతేడాది మొత్తం సమీకరించిన ఈసీబీల విలువ 10 బిలియన్ డాలర్లు మాత్రమే. ఒక్క జూలైలోనే దాదాపు 100 కంపెనీలు 4 బిలియన్ డాలర్లకు పైగా విదేశీ రుణాలను సమీకరించాయి. ఆర్‌బీఐ గణంకాల ప్రకారం ఈ ఏడాది అధిక మొత్తంలో విదేశీ రుణాలు తీసుకున్న కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్), ఎన్‌టీపీసీ, ముంద్రా పోర్ట్ అండ్ సెజ్, ఐఓసీ, వొడాఫోన్ ఎస్సార్, ఎయిరిండియా, గెయిల్, అదానీ పవర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎయిర్‌సెల్, టాటా టెలీ, ఐడియా సెల్యులార్, సుజ్లాన్, ఐడీఎఫ్‌సీ, ఆర్‌కామ్, ఆర్‌ఈసీ, ఎంఅండ్‌ఎం, బీపీసీఎల్‌లు ఉన్నాయి. ఆర్‌ఐఎల్ ఒక్కటే ఈ జూలైలో తన పాత రుణాల రీఫైనాన్సింగ్ కోసం 1.09 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలను తీసుకుంది. 3జీ స్పెక్ట్రమ్ ఫీజుల కోసం గతంలో దేశీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల రీఫైనాన్సింగ్ కోసం టెలికాం కంపెనీలు కూడా భారీగానే విదేశీ రుణాల సమీకరణ జరిపాయి.
పరిస్థితులు తారుమారు...
ఈ ఏడాది తొలినాళ్లలో డాలరుతో రూపాయి మారకం విలువ స్థిరంగానే ఉన్నప్పటికీ, గత కొద్ది వారాల్లోనే పరిస్థితులు తారుమారయ్యాయి. ఒక్కసారిగా రూపాయి క్షీణించడం మొదలుపెట్టింది. గతంలో ఉన్న స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా కంపెనీలు కరెన్సీ ఒడిదుడుకుల రిస్క్‌లపై హెడ్జింగ్ కూడా చేయలేదని విశ్లేషకులు అంటున్నారు. ఫలితంగా రూపాయి క్షీణత ధోరణి రివర్స్ అయితే తప్ప, విదేశీ రుణాలను భారీగా సమీకరించిన చాలా కంపెనీలు తమ ఖాతాల్లో ఈ ఏడాది మార్క్-టు-మార్కెట్ నష్టాలను చవిచూడాల్సి ఉంటుందనేది వారి అభిప్రాయం. రూపాయి ప్రస్తుత క్షీణత స్థాయిని పరిగణనలోకి తీసుకుంటే కార్పొరేట్ల లాభాల్లో సుమారు 2 బిలియన్ డాలర్లకు పైగానే ఆవిరవ్వొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫారెక్ ఎక్స్‌పోజర్‌పై హెడ్జింగ్ లేని కార్పొరేట్లకు రూపాయి క్షీణత సెగ భారీగా తగలనుందని, పీఎస్‌యూల విదేశీ రుణ భారం ఈ ఏడాది పెరిగిపోవచ్చని ఎస్‌ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్‌కు చెందిన జగన్నాథం తునుగుంట్ల అభిప్రాయపడ్డారు. రూపాయి విలువ 12-14% మేర పతనం కావడం వల్ల దేశీయ కంపెనీల ప్రస్తుత విదేశీ రుణ భారం 2 బిలియన్ డాలర్ల మేర పెరిగిపోవచ్చని ఆయన పేర్కొన్నారు.

No comments:
Post a Comment