Sep 26, 2011

రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లే : ట్రాయ్

 ఒక్క సిమ్‌కార్డ్‌కు ఒక్క రోజులో 100 ఎస్‌ఎంఎస్‌లను మాత్రమే అనుమతించాలన్న విషయంలో రెండో ఆలోచనలేదని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) స్పష్టం చేసింది. ఈ నిబంధన రేపటి(27 నుంచి అమల్లోకి రానుంది.

అవాంఛిత కమ్యూనికేషన్‌ను నివారించే ప్రయత్నాల్లో ఇదొకటని పేర్కొంది. అయితే దివాళి, ఈద్‌వంటి పండుగల రోజుల్లో ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుందని వివరించింది. భవిష్యత్తులో ఏమైనా సమస్యలొస్తే, అప్పుడు ఆలోచిస్తామని పేర్కొంది. రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లను మాత్రమే అనుమతించడం సాధారణ వినియోగదారుని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని, ఈ నిబంధనపై పునరాలోచించాలని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ట్రాయ్‌కు ఇటీవలే విజ్ఞప్తి చేసింది.

మరింత సమాచారమివ్వండి: మొబైల్ టారిఫ్‌లను 20% పెంచడంపై అదనపు సమాచారం కావాలని మొబైల్ ఆపరేటర్లను ట్రాయ్ ఆదేశించింది. ఈ విషయమై గతంలో టెల్కోలు ఇచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందని ట్రాయ్ తాజాగా ఈ ఆదేశాలిచ్చింది.

No comments: