Sep 26, 2011

రేపటి నుంచి ఆందోళన ఉధృతం : 30న బంద్


రేపటి నుంచి తెలంగాణ కోసం ఆందోళనని ఉధృతం చేస్తున్నట్లు తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రకటించారు. లోటస్పాండ్ వద్ద ఈరోజు తెలంగాణ రాజకీయ జెఎసి నేతల సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి, ఎంపిల అరెస్ట్ని ఖండించారు. ఇక నుంచి సీమాంధ్ర బస్సులను తెలంగాణలో తిరగనివ్వం అని చెప్పారు. ఏదైనా జరిగితే తమకు బాధ్యతలేదన్నారు. హాజీ యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపారు. వారికి వీడ్కోలు పలుకుతామని చెప్పారు.

కోదండరామ్ తెలిపిన వివరాలు :

27వ తేదిన ఆర్టీసి కార్మికులు తెలంగాణ అంతటా ర్యాలీలు నిర్వహిస్తారు.
ఆ ర్యాలీలలో అందరూ పాల్గొనాలని కోదండరామ్ పిలుపు ఇచ్చారు.
28న హైదరాబాద్లో పెద్ద ఎత్తున రాస్తారోకోలు నిర్వహిస్తారు. తెలంగాణలో వంద ప్రాంతాలలో రాస్తారోకోలు నిర్వహిస్తారు.
29న విద్యుత్ కోతకు నిరసనగా ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి.
30న తెలంగాణ బంద్.
1న కాగడాల ప్రదర్శన.
2న టోల్గేట్ల పన్ను బహిష్కరణ.
9,10,11 మూడు రోజులు రైల్ రోకో.

విలేకరుల సమావేశంలో టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు, బిజెపి నేత విద్యాసాగర్ రావు పాల్గొన్నారు.

No comments: