Sep 27, 2011

నవ్వు ... ఏడుపు.. ఆరోగ్యానికి మంచివే!

మనిషికి మాత్రమే చేతనైన విద్య నవ్వు. మనిషి ఆరోగ్యానికి నవ్వు మంచి సంకేతం. ఎదుటి వ్యక్తిని సంతోషంగా కలసినట్లు చెప్పగల ఏకైక శారీరక భాష. స్నేహితులను ఆత్మీయంగా దరిజేర్చగల ఒక మహత్తర ఆయుధం నవ్వు. పిల్లలు ఆడుకునేటప్పుడు ఇంగ్లీషులో అతి పొడవైన పదం చెప్పమని అడుగుతుంటారు. ఇంగ్లీషులో అతిపొడవైన పదం 'స్మైల్‌' అని చెబుతారు. ఎందుకంటే ఇందులో 'మైలు' ఉంది. నవ్వుకి విలువ కట్టడం ఎవరికీ సాధ్యం కాదు.
ఇది మనిషి నుండి శక్తిని విడుదల చేస్తుంది. ఇది విద్యుచ్ఛÛక్తి, అయస్కాంత శక్తి మాదిరి కంటికి కన్పించదు. ఈ శక్తి ఎదుటి మనిషి ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జంతువులకు నవ్వడం తెలీదు. 'సివంగి నవ్వు' గురించి చెబుతుంటారు. కానీ సివంగి ఎప్పుడూ నవ్వినట్లు కనిపించదు. రుచించని నవ్వును వ్యంగ్యంగా సివంగి నవ్వని అభివర్ణిస్తుంటారు. మనిషి నవ్వినప్పుడు తక్కువ సంఖ్యలో ముఖంలోని కండరాలు కదులుతాయి. కోపం వచ్చినప్పుడు ఎక్కువ కండరాలు కదులుతాయి. నవ్వు మనుషుల మధ్య ఉత్సాహాన్ని తెచ్చిపెడుతుంది. అనారోగ్యంతో ఉన్నవారు నవ్వుల హరివిల్లుతో ఆరోగ్య మందిరంలో ఉన్నట్లు అనుభూతి పొందుతారు. అప్పుడే పుట్టిన బిడ్డ ఏడుస్తుంది. అలా ఏడవకపోతే గిల్లి ఏడిపిస్తారు. బిడ్డ ఏడిస్తే అందరూ ఆనందపడతారు. ధైర్యంగా ఉంటారు. పుట్టిన బిడ్డకు మూడవ నెల వస్తేగాని నవ్వడం ప్రారంభించదు. అప్పుడప్పుడు బిడ్డ నిద్రలో తెలీకుండానే నవ్వుతుంది.
నవ్వు విశేషాలు
ప్రపంచంలో అద్భుతమైన పెయింటింగ్‌గా లియొనార్డో డావిన్సీ గీసిన 'మోనాలిసా పెయింటింగ్‌'ని చెబుతారు. నిగూఢమైన ఆమె నవ్వులోని అర్థాన్ని ఎవరూ చెప్పలేని కారణంగా ఆ పెయింటింగ్‌కు విశేషమైన ప్రాముఖ్యత వచ్చిందనీ చెప్పుకుంటారు. పెళ్లికూతుర్ని చూడడానికి మగపెళ్లివారు వస్తారు. ఆ తర్వాత ఆమె ఇష్టాన్ని అడుగుతారు. చిరునవ్వు నవ్వితే ఆమెకు ఆ సంబంధం ఇష్టమని అర్థం. చిరునవ్వులో ఎంత అర్థముందో. మేకప్‌ అంటే ఇష్టపడే ఆడవారికి చిరునవ్వుకు మించిన మేకప్‌ లేదని చెప్పాలి. కష్టాల్లో ఉన్నవారిచేత నవ్విస్తే కష్టాలన్నీ మర్చిపోతారు. నవ్వు అంటువ్యాధి óలాంటిది. ఒకరు నవ్వితే మరొకరు నవ్వుతారు.
వ్యాపారంలో కష్టమర్లను నవ్వుతూ ఆహ్వానించి ఆకర్షించవచ్చు. వ్యాపారం అద్భుతంగా రాణించేటట్లు చేసుకోవచ్చు. కొంతమంది పని బాగానే చేస్తుంటారు. కానీ వారి ముఖాన నవ్వనేది వుండదు. అలాంటివారు ముఖంలో నవ్వు కన్పించేటట్లు ప్రవర్తిస్తే వారి పని మరింత రాణింపుకు వస్తుంది. నవ్వడం రానివారికి నేర్పాలి. నవ్వు జీవిత మాధుర్యాన్ని ఎంతగానో పెంచుతుంది.
నవ్వు - ప్రయోజనాలు
* నవ్వు మనిషి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. న శరీరంలోని ఆక్సిజన్‌ పరిమాణాన్ని పెంచుతుంది. న శరీరంలోని నొప్పులను మాయం చేయగల ఎండార్ఫాన్‌ను విడుదల చేస్తుంది. న మానసిక ఒత్తిడికి గొప్ప విరుగుడు నవ్వు. న మనిషి ఆత్మస్థయిర్యాన్ని పెంచి మానసిక సమతుల్యతను కాపాడుతుంది. న శారీరక అవయవాలు పుష్టిగా తయారవుతాయి. న ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఇదొక మంచి వ్యాయామం. న నరాలు, రక్తనాళాలు ఒత్తిడి పొరలనుండి విముక్తి పొందుతాయి. న గుండె వేగం పెరగడం వల్ల చర్మం మీది స్వేద రంధ్రాలు తెరుచుకుంటాయి. న మనిషి రోగనిరోధక శక్తిని నవ్వు పెంచుతుంది.
ఆరోగ్యానికి ఏడుపు
మనిషిలో విచారం, నిరాశ, నిస్పృహ వంటి వాటిని అణగదొక్కితే అనారోగ్యం మొదలవుతుంది. జీవితంలో ఏదో ఒక సమయంలో ఏడవని మనిషి ఉండడు. స్తన్య జంతువుల్లో పుట్టగానే ఏడ్చేది మనిషి ఒక్కడే. ఆ తర్వాత జీవితంలో ఒత్తిడులు, బాధలు మనిషిని ఏడ్చేట్టు చేస్తాయి. సాంఘిక జీవనం, ప్రవర్తనా పద్ధతులు, అహంకారం, సిగ్గు వంటివి మనిషి ఏడుపుకు ఆనకట్ట వేస్తున్నాయి. ఏడుపనేది ఆడవారి సొత్తు అని జనాభిప్రాయం. నిజానికి వారికి ఓర్పు ఎక్కువ. ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువ కాలం జీవిస్తారు. కంట తడి పెట్టడం, బిగ్గరగా ఏడవడం, కావలసినప్పుడు ఆపేయడం ఆడవారికే సాధ్యం. ఇవి వారి ఆరోగ్య పరిరక్షణలో ముఖ్య పాత్ర వహిస్తాయి. మనిషి వికృత భావావేశాలకు లోనయినప్పుడు, వాటి ఒత్తిడి నుండి బయటపడేందుకు ఏడుపు ఒక మార్గం.
ఏడుపు వల్ల లాభాలు
* మనిషి విషాదభరితమైన, దుఃఖపూరితమైన ఆవేశాలకు లోనైనప్పుడు శరీరంలో విషపదార్థాలు పుడతాయి. వీటిని శరీరం నుండి విసర్జించడానికి ఏడుపు ఎంతో సహకరిస్తుంది. న విచారంలో ఉన్న మనిషి ఏడిస్తే కొంత ఉపశమనం లభిస్తుంది. న సహాయం చేయమని సూటిగా అడిగే సంకేతం 'ఏడుపు'. ఇది సహాయం అవసరమని తెలియజేసే ఒక పిలుపు. న ఏడుపు అనేది ఒక కమ్యూనికేషన్‌ పద్ధతి. మాటలతో చెప్పలేని భావాలు ఏడుపు ద్వారా చెప్పడం సాధ్యమౌతుంది. న మనిషి హృదయానికి కిటికీలు వంటివి కళ్లు. హృదయంలోని ఆవేదనకు ప్రతిరూపంగా కన్నీళ్లు కారతాయి. న పిల్లలు నిరాశకు గురైనప్పుడు పెద్దల దృష్టిని ఆకర్షించేందుకు ఏడుస్తారు. న ఏడుపు ఒత్తిడి నుండి విముక్తి కలిగిస్తుంది. న మెదడు, గుండె తేలికై మనిషి ఆలోచనా శక్తిని యథా స్థితికి తెస్తుంది. న మనిషి ఏడవకపోతే హాయిగా ఉండలేడు. ఏడుపును బట్టి మనిషిలోని దుఃఖాన్ని సులువుగా అంచనా వేయవచ్చు. న ఏడవకుండా ఉండడం వల్ల శరీరాన్ని అనారోగ్యం వైపు తరలిస్తున్నాడని మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయం.
మరువకూడదు
భావావేశం వల్ల వచ్చే ఏడుపుకు, ఇతరుల సానుభూతి పొందేందుకు ఏడ్చే ఏడుపుకు చాలా తేడా ఉంటుంది. ఇతరులు ఈ విషయాన్ని సులువుగా పసిగట్టగలరు. తన అనుభవంలో వచ్చే అనేక విషయాలను తట్టుకుని వాటిని మనసులో దాచుకుని బయటికి గంభీరంగా కన్పించే మనిషి లోపల ఉన్న అగ్ని పర్వతాల పేలుళ్ల కు ఎప్పుడో ఒకప్పుడు జవాబు చెప్పాల్సి వస్తుంది. దెబ్బ తగిలినప్పుడు కూడా భయం, ఆత్రుత, నొప్పి, కోపం వంటి వాటిని కొంతమంది అణగదొక్కుతున్నారు. ఇటువంటి ఒత్తిడి వల్ల క్రమంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. నిస్పృహతో ఉన్న వ్యక్తులు ఏడవకపోతే ప్రమాదం.

No comments: