కోపం రెండు రకాలుగా
వస్తుంది. ఒకటి కారణం వల్ల, రెండోది కారణం లేకుండా. అసందర్భంగా వచ్చే కోపం
చీటికి మాటికి విసుగు తెప్పిస్తుంది. చిన్న చిన్న విషయాలపై అకారణంగా కోపం
తెచ్చుకుంటారు. ఒక సందర్భానుసారంగా వచ్చేది దీర్ఘకాలంగా ఉంటుంది. అంటే
వారిని ఎవరో ఒత్తిడి కలిగిస్తుంటారు. ఉద్యోగరిత్యా కానీ, కాలేజిలో ఎవరైనా
ఆమెను ఇబ్బంది పెట్టేట్టు ఉంటారు. ఇంట్లో, బయట మానవ సంబంధాలు
సరిగ్గాలేకుంటే కూడా కోపం వస్తుంది. ఒత్తిడికి గురిచేస్తున్నవారిని చూస్తే
కోపం తీవ్రమవుతుంది. తనకు కోపం వస్తుంది, దీన్ని అణచుకోవాలని అనుకునే వారు
డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు భావించాలి. నాకే కోపం లేదు, ఇతరులు మాత్రం
కోపం ఉందని అంటున్నారని చెప్పేవారికి మానసిక సమస్య ఉందని భావించాలి.
కోపాన్ని అరిట్టడానికి కౌన్సిలింగ్‌తో మంచి ఫలితాలుంటాయి. కోపం
వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో కొన్ని పద్దతులు నేర్పిస్తారు. నాకు కోపం
లేదని భ్రమపడేవారికి వైద్యపరంగా చికిత్స చేయాలి.
నా
భార్య వయసు 23 ఏళ్లు. ఆరు నెలల నుంచి అసాధా రణంగా ప్రవర్తిస్తోంది. మా
పెళ్లై రెండు ఏళ్లయ్యింది. ఆమె తల్లికి మానసిక సమస్య ఉంది.
తల్లిచెప్పినట్టే వింటోంది. దీని వల్ల నాకు అసౌకర్యంగా ఉంది. ఈ సమస్య నుంచి
నా భార్య ఎలా బయటపడాలి సలహా ఇవ్వగలరు. శోభ, బద్వేలు.
అసాధారణ
ప్రవర్తన (అబ్‌నార్మల్ బిహేవియర్)ను రెండు రకాలుగా విభజించుచ్చు. కొంత
మంది వాస్తవానికి భిన్నగా ప్రవర్తిస్తారు. ఎవరో తమను పలుకరిస్తున్నారని,
హాని తలపెడతారని మాట్లాడతారు. ఈ రకాన్ని సైకోసిస్ అంటారు. ఇక రెండో రకం
మౌనంగా ఉండడం, ఎవరితో మాట్లాడకపోవడం. దీన్ని న్యూరోసిస్ అంటాం. మానసిక
సమస్యల కుటుంబ చరిత్ర ఉన్నందు వల్ల మీ భార్యను పూర్తిగా విశ్లేషించాలి.
మానసిక సమస్యలున్న కుటుంబ చరిత్ర ఉన్న వారిలో దీర్ఘకాలికంగా మానసిక సమస్యలు
తీవ్రంగా ఉంటాయి. వీలైనంత వెంటనే వైద్యం చేయించాలి. ఆలస్యం చేయకూడదు. మీరు
దగ్గర్లోని మానసిక వైద్యనిపుణున్నికలవండి. మందులు, కౌన్సిలింగ్‌తో సమస్య
నయం అవుతుంది.
నేను ఇంజనీరింగ్
చదువుతున్నాను. వయసు 22 ఏళ్లు. ఆత్మన్యూనతా భావంతో బాధపడుతున్నాను.
సిగ్గుపడతాను. దీని వల్ల ఎవరితోనూ సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. భయంగా
ఉంటుంది. క్లాసులో ప్రశ్నంచినప్పుడు సరిగ్గా జవాబు చెప్పలేకపోతున్నాను. నా
సమస్యకు పరిష్కారం ఉందా? రమేష్, విజయవాడ.
ఆత్మన్యూతన
భావాన్ని మానసిక వైద్యంలో సోషియల్ యాంగ్జైటి డిసార్డర్ అంటారు. సమాజంలో
రెండు నుంచి ఐదు శాతం మంది ఈ సమస్యతో బాధపడుతుంటారు. ఇది చాలా చిన్న
వయసులోనే వస్తుంది. పది మందితో కలవలేకపోవడం, మాట్లాడలేకపోవడం, అందరూ తననే
చూస్తున్నారని అనుకోవడం, ఏదైనా తప్పు చేస్తే ఏమంటారోనని అనుకుంటారు.
పరీక్షలంటే భయంగా ఉంటుంది. అవుతలివారు చిన్న మాట అన్నా నొచ్చుకుంటారు.
ఇబ్బందిగా ఫీల్ అవుతారు. దాన్ని మరచిపోలేరు. ఆత్మన్యూనతా భావాన్ని
కౌన్సిలింగ్ ద్వారా అధిమించే ప్రయత్నం చేయాలి. ముందుగా యాంగ్జైటీ
తగ్గించడానికి మందులతో చికిత్స చేస్తారు. ఆ తర్వాత కౌన్సిలింగ్
ఉపయోగపడతుంది.
బద్దకం వదిలేదెలా?
మా
పాప వయసు 14 ఏళ్లు. బక్కపలచగా ఉన్నా ఆరోగ్యంగా ఉంటుంది. తనకుతానుగా ఉదయం
నిద్రలేవదు. ఎవరైనా లేపితేనే లేస్తుంది. లేకుంటే పది, పదకొండు గంటల వరకు
అలాగే పడుకుంటుంది. అలారం పెట్టినా ప్రయోజనం లేదు. పరీక్షల సమయంలో కూడా
ఇలాగే చేస్తుంటుది. ఇదేమైన వ్యాధా? దీనికి చికిత్స ఉందా? నాగేందర్,
సూర్యాపేట్.
టీనేజ్ వయసు పిల్లలున్న ప్రతీ
తల్లిదండ్రులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఇది. టీనేజర్స్‌లో బద్దకం సాధారణంగా
ఉంటుంది. దీనికి కారణం ఆ వయసులో మెదడులో విడుదలయ్యే హార్మోన్లు, రసాయనాలే.
బాధ్యతలు తెలుసుకోకపోవడం, దేన్నీ పట్టించుకోలేకపోవడం, అన్నీ తెలుసనే
తలబిరుసుతనంతో ఉంటారు. ఇలాంటి బద్దకం కొంత మంది అబ్బాయిలు, అమ్మాయిల్లో
ఎక్కువుంటుంది. ఇది క్రమంగా వీరిని డిప్రెషన్‌లోకి తీసుకెళ్తుంది. ఉదయం
నిద్రలేవలేరు. లేచి ఏం చేయాలని వాదిస్తారు. ఏ పనిచేయానికీ ఇష్టపడరు.
తొందరగా అలసిపోతారు. టీనేజ్‌లో డిప్రెషన్ వచ్చే అవకాశం ఎక్కువ. ముందుగా
వీరిలో డిప్రెషన్ ఉందా లేదా అనేది కనుక్కోవాలి. కాలేజిలో, ఇంట్లో వీరిని
ఎవరైనా ఒత్తిడికి గురిచేస్తున్నారో విశ్లేషించాలి. ఏ కారణంతో ఎందుకిలా
చేస్తున్నారో పరిశీలించాలి. కౌన్సిలింగ్ ద్వారా ఈ సమస్య నుంచి వీరిని
బయటికిలాగొచ్చు.



No comments:
Post a Comment