Sep 27, 2011

బంగారం, వెండి ధరలు తగ్గుముఖం ..


ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు ఒక్కమారుగా పతనం చెందడం, నిల్వదారుల్లో అలముకున్న భయాలతో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.26,740 వద్ద ముగిసింది. సుమారు రూ. 600 మేర పతనం చెందింది. సోమవారం వ్యాపార ప్రారంభంలోనే రూ.1,540 పతనంతో రూ.25,800 స్థాయికి దిగజారింది. ఆసియాలో అమెరికా డాలరు విలువ 225 మేర పతనం కావడంతో మార్కెట్‌లో బంగారం, వెండి ధరల తగ్గుదలపై పుకార్లు వ్యాపించాయి. 1983 తరువాత ఇంతటి స్థాయిలో పతనం కళ్లచూడటం ఇదే ప్రథమం. ఇక వెండి ధర కిలోకు రూ. 500 మేర పతనమై రూ. 53,500 దగ్గర స్థిరపడింది. పారిశ్రామిక వర్గాల్లో అనిశ్చితి చాల హెచ్చ మోతాదులో ఉన్న కారణాన కడపటి రెండు వాణిజ్య అంకాల్లోనూ వెండి ధర ఏకంగా రూ.10,500ల మేర పతనమైంది. సమీప కాలంలో ఈ రెండు లోహాల ధరలు తగ్గుతాయనే కొనుగోలు అంచనాలు మార్కెట్‌లో వ్యాపించడంతో చిల్లర విపణి ఆసాంతం అప్రమత్తంగా సాగిందని నిపుణుల అభిప్రాయంగా ఉంది. కాగా 99.9 శాతం నాణ్యత గల బంగారం ఆరొందల పతనంతో రూ.26,740 దగ్గర, 99.5 శాతం నాణ్యత గల బంగారం కూడా ఆరొందల పతనంతో రూ. 26.600 దగ్గర స్థిరపడింది. కడపటి మూడు వాణిజ్య అంకాల్లోను ఏకంగా రూ.1,160 మేర నష్టం సంభవించింది.

No comments: