Sep 26, 2011

ఎన్టీఆర్ 'ఊసరవల్లి' కాదు...!


యంగ్ టైగర్ ఎన్టీఆర్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వస్తున్న సినిమాకి 'ఊసరవల్లి' అనే టైటిల్ ప్రాచుర్యంలో ఉంది. ఈ టైటిల్ తో పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. ఐతే ఈ చిత్ర టైటిల్ పై ఎన్టీఆర్ ఫాన్స్ మండిపడుతున్నారు. ఈ టైటిల్ బాగోలేదని వేరేది పెట్టాలని సుచానలిచ్చారు. దీంతో ఎన్టీఆర్ కూడా దీనిపై ఆలోచనలో పడ్డారు. టైటిల్ తనకు కూడా నచ్చలేదని  చెప్పాడు. దీంతో ఈ సినిమాకి మరో టైటిల్ వెతికే పనిలో పడ్డారు దర్శకనిర్మాతలు.
ఈ సినిమాకి బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన మిల్క్ బ్యూటీ తమన్నా నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చనున్నాడు.

No comments: