ఎన్టీఆర్, సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'ఊసరవెల్లి'. భోగవల్లి బాపినీడు సమర్పిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం డిటిఎస్ మిక్సింగ్ జరుపుకుంటోంది. చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్ 6న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ...'ఇటీవల విడుదలైన ఆడియో ఇప్పటికే చాలా పెద్ద హిట్ అయింది. దేవిశ్రీప్రసాద్ చేసిన అద్భుతమైన పాటలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. త్వరలోనే ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేయబోతున్నాం. ఎన్టీఆర్ చిత్రాల్లో వైవిధ్యమైన చిత్రంగా 'ఊసరవెల్లి' రూపొందింది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రమవుతుంది. డిఫరెంట్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీశాం. అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందన్న నమ్మకం వుంది' అని అన్నారు. తమన్నా, ప్రకాష్‌రాజ్, తనికెళ్ళ భరణి, విదూత్ జామ్వాల్, ఆద్విక్ మహాజన్, పాయల్ ఘోష్, ఆలీ, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, ఎం.ఎస్.నారాయణ, దువ్వాసి మోహన్, రఘు కారుమంచిలతోపాటు ఇంకొంతమంది నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తారు.




No comments:
Post a Comment