Sep 26, 2011

ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు అద్భుతమైన బిళ్ల ..

ప్రొస్టేట్‌ క్యాన్సర్‌తో బాధపడే వారికి ఉపశమనం కలిగించే వార్త ఇది. ఈ క్యాన్సర్‌ బాధితులు మరో ఐదు నెలలు జీవించేందుకు వీలు కల్పించే అద్భుతమైన బిళ్లను బ్రిటన్‌లో ప్రవేశపెట్టారు. దీనికి యురొపియన్‌ మెడికల్‌ అథారిటీస్‌ నుంచి ఆమోదం లభించింది. ఈ మందును బ్రిటీష్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. జైటిగ అనే పేరు గల మందు ఖరీదు నెలకు 3000 పౌండ్లు. పురుషుల్లో వచ్చే అడ్వాన్స్‌డ్‌, తీవ్ర ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ బాధితుల జీవనప్రమాణాన్ని ఇది పెంచుతుంది. జైటిగ టెస్టొస్టిరాన్‌కు వెళ్లే కణతి సరఫరాను అడ్డుకుంటుంది. ఫలితంగా కణతి పెరగడం నిలుస్తుంది. 80 శాతం వరకు డ్రగ్‌ రెసిస్టెన్‌ ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ బాధితులు దీన్ని ఉపయోగించారు. వీరంతా యాంటి హర్మోనల్‌, కీమోథెరపీ చికిత్స పొందుతున్నవారే. 2000 మందిపై ప్రయోగం చేశారు. రోజుకు ఒక బిళ్ల తీసుకునే వారు 15.8 నెలలు జీవించారు. ఉత్తుత్తి మాత్ర తీసుకున్న వారు సగటున 11.2 నెలలు జీవించారు. ఈ మందుకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ అండ్‌ క్లినికల్‌ ఎక్సలెన్స్‌ అనుమతి లభించాల్సి ఉంది. 2012లో ఈ బిళ్ల అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

No comments: