ఇందుకు అవసరమైన పక్కా ప్రణాళికా బద్ధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపిస్తున్నామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే వచ్చే నెల నవంబర్ 1వ తేది నుంచి తహశీల్దార్, ఎండిఒ కార్యాలయాల నుంచి నేరుగా 25 రకాల ధృవీకరణ పత్రాలు(సర్టిఫికెట్ లను) ఎలాంటి జాప్యం లేకుండా ధరఖాస్తు చేసిన 15 నిమిషాలలోనే ప్రజలకు అందేలా పైలట్ ప్రాజె క్టును చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఈపథకాన్ని ముం దుగా చిత్తూరు, ఖమ్మం, కృష్ణా జిల్లాలో అమలు చేసి, దశల వారీగా తదుపరి ఆరునెలల్లోగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ప్రవేశపెడు తున్నట్లు సీఎం ప్రకటించారు.
తాము ఈ ప్రాజెక్టు ద్వారా సర్టిఫికెట్ ఒక్కింటికి కేవలం పదిరూపాయల నామమాత్రపు రుసుమును మాత్రమే వసూలు చేస్తామని ఆయన వివరించారు. వీటితోపాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా మరిన్ని ప్రజాపయోగ పథకాలను ప్రవేశపెట్టి తీరుతామని ఆయన తెలిపారు. తాము రుపాయకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెడితే పత్రికలు, మీడియా చానళ్లు తాము చేసిన ఈపథకాన్ని తప్పుపట్టాయని, తమ పార్టీకి ఎలాంటి పత్రికలు లేకపోయినా నాయకులు, కార్యకర్తలే పత్రికలుగా మారి ప్రజలకు తాము చేపడుతున్న సంక్షేమపథకాల విషయాన్ని వివరించాలని పిలుపునిచ్చారు.
ప్రజారాజ్యం పార్టీ అధినేతగా వున్న చిరంజీవి నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా, కాంగ్రెస్ పార్టీలో ఆయన పాత్ర సూపర్,డూపర్ హిట్ అవుతుందని కిరణ్ కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. అయితే కొంతమంది తండ్రి పేరుచెప్పుకుని అధికార పీఠాన్ని అధిరోహించాలని కలలు కంటున్నారని, వాస్తవానికి తాను తన తండ్రితో కలిసి అనేక సార్లు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసినా, మంత్రి పదవిని కూడా చేపట్టలేకపోయాయని ఆయన వివరించారు. ఈ మంత్రి పదవి కోసం దాదాపు 20 ఏళ్లు వేచి చూడాల్సిన పరిస్థితి వుందని, ఆయితే అనుకోని రీతిలో ముఖ్యమంత్రి పదవిని తమ పార్టీ అధినేత సోనియా గాంధీ పిలిచి మరీ ఈ బాధ్యతలు అప్పగించారని ఆయన గుర్తు చేశారు. అంతే కాని తండ్రి వారసత్వంగా పదవులు రావని ఆయన పరోక్షంగా జగన్‌ను ఎద్దేవా చేశారు.
సామాజిక న్యాయం కోసం ప్రజారాజ్యం పార్టీని స్థాపించినా, పార్టీ ప్రణాళికా బద్ధంగా తీసుకువెళ్లడంలో కొన్ని పొరపాట్లు జరిగాయని ఆయన ఒప్పుకున్నారు. ఈకారణంగానే 180 సీట్లు సాధించి 18 సీట్లకే పరిమితమైపోయామని చిరంజీవి అన్నారు. అయితే తాను సినిమా ప్లాప్ ఫిలాసఫీని తాను ఫాలో అవుతున్న కారణంగానే ప్రజారాజ్యం పార్టీ అనుకోని రీతిలో సీట్లు దక్కించుకోలేకపోయినా, ప్రజల్లో వున్న నమ్మకాన్ని ఓటింగ్ శాతం ద్వారా సాధించుకున్నామని ఆయనఅన్నారు. ఇక రాష్ట్ర రాజకీయాల విషయానికే వస్తే బాబు అధికార దాహంతోనూ, వై.ఎస్.జగన్ ధన దాహంతో విర్రవీగుతున్నారని, భవిష్యత్‌లో వీరి భవిష్యత్‌ను ప్రజలే మారుస్తారని చిరంజీవి వాఖ్యానించారు.
వై.ఎస్.జగన్ ప్రస్తుతం మహారాజుల పాలనలో వున్నట్లు భ్రమ పడుతున్నారని, అయితే రాజుల కాలం పోయి ప్రజా పాలన కాలం వచ్చేసినా, అభ్రమలోనే కొనసాగుతున్న కారణంగా తన తండ్రి భౌతికకాయం పక్కనే వుంచుకుని ముఖ్యమంత్రి అవుతామనే విధంగా పగటి కలలు కన్నారని చిరంజీవి ఎద్దేవా చేశారు. ఇక మరో నేత చంద్రబాబు నాయుడు విషయానికే వస్తే అధికారం వున్నప్పుడు సామాన్యులు, రైతులు, మహిళలు కనిపించని బాబుకు ఇప్పుడు రైతు ద్వారా రాజ్యాన్ని సాధించడానికి కలలు కంటున్నారని విమర్శించారు.
అవినీతిపై అన్నహాజారే లాంటి సామాజిక కార్యకర్తలు పోరాటం చేస్తుంటే ఆయన కుడా అన్నహాజారేకు మద్దతుగా ఢిల్లీవెళ్లి భంగపడిన విషయాన్ని మరిచిపోకూడదని ఆయన బాబు సూచించారు. దేశాన్ని లౌకిక రాజ్యంగానే కాకుండా ప్రగతి పథంలో నడిపంచగలిగే ఒకే ఒక కాంగ్రెస్‌పార్టీ అధినేత సోనియా గాంధీకే వుందని చిరంజీవి పేర్కొన్నారు. వచ్చే 2014లోపు పదువులు ఇవ్వకపోయినాపార్టీకోసం సాధారణ కార్యకర్తగా పనిచేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ మాట్లాడుతూ పార్టీని యువరక్తంతోనే పూర్తిగా నింపుతామని, తద్వారా పార్టీని పూర్తి పటిష్టంగా చేస్తామని ప్రకటించారు.
రాష్ట్రంలోని కొంతమంది నాయకులు అధికార మధంతో ఒకరు, ధన మధంతో మరోకరు కాంగ్రెస్‌పార్టీపై అవాకులు, చెవాకులు పేలుతున్నారని ఓదార్పు, రైతు యాత్రలు చేపడుతున్నారని పరోక్షంగా బాబు, జగన్‌లపై విమర్శల వర్షం కురిపించారు.వీరిద్దరికి అవినీతిని చట్టం చేస్తే దర్జాగా వీరిద్దరు దోచుకుపోతారని, ఇలాంటి మొసలి న్నీరు, మొసలి తోలు కప్పుకునే నాయకులు నుంచి ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఆయన హెచ్చరించారు.
ఈవేదికపై కేంద్ర మంత్రి దగ్గుపాటి పురంధరేశ్వరి, రాజ్యసభ సభ్యులు టి.సుబ్బరామిరెడ్డి, మంత్రులు శత్రుచర్ల విజయరామరాజు, పి.బాలరాజు, ధర్మాన ప్రసాదరావు, ప్రభుత్వ విప్ కొండ్రు మురళి, బొబ్బిలి, టెక్కలి పార్లమెంట్ సభ్యులు బొత్స ఝాన్సీ, కిల్లీ కృపారాణి, మాజీ మంత్రి షబ్బీర్ ఆలీలు ప్రసంగించగా, మంత్రులు వట్టి వసంతకుమార్, తోట నర్సింహాం, గంటా శ్రీనివాసరావు, విశాఖనగర మేయర్ పులుసు జనార్ధనరావు, మూడు జిల్లాలకు చెందిన కాంగ్రెస్‌పార్టీ శాసనసభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
‘త్రిమూర్తుల’ అవతారం..!
అధికార కాంగ్రెపార్టీలో సరికొత్త అవతారానికి విశాఖలో ఆదివారం జరిగిన ‘ఉత్తరాంధ్ర కాంగ్రెస్ గర్జన’ వేదికైంది. ఈగర్జన విజయవంతం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఢోకా లే దనే విధంగా పార్టీ కింద స్థాయి కార్యకర్తల నుంచి పార్టీ శ్రేణుల వరకు సంకేతాలు ఇచ్చారు. కార్యక్రమం విజయవంతం ద్వారా పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ తన సత్తా నిరూపించుకున్నట్లయింది. అయితే కాంగ్రెస్‌పార్టీ బహిరంగ సభల్లో రోటీన్ ఉపన్యాసాలకు భిన్నంగా పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచే విధంగా కార్యక్రమాన్ని రూపకల్పన చేసి, ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్‌కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ, కాంగ్రెస్ పార్టీ మెగా నాయకుడు చిరంజీవిలను వేదికపై ఉపన్యసించిన ప్రతి ఒక్కరు త్రిమూర్తులుగా అభివర్ణించడం విశేషం.
రాష్ట్ర మంత్రుల ఉపన్యాసాల్లో పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలను ఒక పక్క విశ్లేషిస్తూనే మరోపక్క పార్టీ లోని పట్టున్న నాయకులుగా ఈ ముగ్గురిని అభివర్ణించడం, అదే రీతిలో తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడు,వై.ఎస్.ఆర్.కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌లపై ప్రధానంగా ఆరోపణస్త్రాలు సంధించడం విశేషం. ఈ గర్జనకు తెలంగాణ ప్రాంతం నుంచి అతిథిగా వచ్చిన మాజీ మంత్రి షబ్బీర్‌ఆలీ సైతం దివంగతనేత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డితో తనకున్న సాన్నిహిత్యాన్ని వివరిస్తూనే,మరోవైపు ఆయన తనయుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిపై తనదైన శైలిలో విమర్శలు చేశారు.




No comments:
Post a Comment