Sep 24, 2011

ఆయన రూటే వేరు...


ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తన రూటే వేరని శుక్రవారం మళ్ళీ నిరూపించుకున్నారు. సచివాలయ తెలంగాణా ఉద్యోగుల ఆందోళనతో సిఎం తన కాన్వారు రూటును మళ్ళీ మార్చుకున్నారు. కొద్దిరోజుల క్రితం ఉద్యోగుల ఆందోళన కారణంగా ఇన్‌ గేట్‌లో నుంచి కాకుండా అవుట్‌ గేట్‌లో నుంచి సిఎం కాన్వారు సచివాలయంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం మళ్ళీ అదే బాటపట్టారు. తొలుత ఇన్‌ గేట్‌లో నుంచి లోపలికి ప్రవేశించినప్పటికీ కొంతదూరం ప్రయణించిన తరువాత రూట్‌ మార్చుకుని బయటికొచ్చే రోడ్డుపైన సిఎం కాన్వారు ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న 'సి' బ్లాకుకు చేరింది. ఇన్‌ గేట్‌లో నుండి వచ్చే దారిపై 'హెచ్‌' బ్లాక్‌ వద్ద ఉద్యోగులు ఆందోళన చేస్తుండడంతో ప్రత్యామ్నాయ మార్గంలో ముఖ్యమంత్రి ప్రయాణించారని సిఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. సకల జనుల సమ్మె కారణంగా ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టినట్టే... రహదారి బదులు దొడ్డిదారిని ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారేమోనని పలువురు ఉద్యోగులు వ్యాఖ్యానించడం కొసమెరుపు.

No comments: