Sep 2, 2011

ఆస్తుల విషయంలో చంద్రబాబు చెప్పినవన్ని అబద్దాలే !

చంద్రబాబు ఆస్తులు బినామీ పేర్ల మీద ఇంకా ఉన్నాయని దివంగత నేత 
ఎన్ టి రామారావు సతీమణి లక్ష్మిపార్వతి ఆరోపించారు. ఆస్తుల విషయంలో చంద్రబాబు చెప్పినవన్నఅబద్దాలేనని ఆమె తెలిపారు. బాబుపై సీబీఐ విచారణ ఎందుకు జరిపించడం లేదని 
ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు ఆస్తులు ఐదువేల కోట్లకు పైనేనని ఆమె అన్నారు. రాజకీయాల్లో చంద్రబాబు మహానటుడు అని.. ఆయనకు 20 ఆస్కార్‌లు ఇచ్చిన తక్కువేనన్నారు. జూనియర్ ఎన్టీఆర్  పెళ్లి కుదిర్చినందుకు లోకేశ్‌కు గిఫ్ట్‌గా స్టూడియో-ఎన్ టెలివిజన్ చానెల్‌ను ఇచ్చారని లక్ష్మిపార్వతి తెలిపింది. సింగపూర్ ఆస్తుల వివాదంలో అంతర్జాతీయ మాఫియా నాయకుడు దావూద్ ఇబ్రహీం కూడా జోక్యం చేసుకున్నారని ఆమె మీడియాకు వెల్లడించారు. కాణిపాకం వినాయకుడి ఆలయంలో తన పిల్లల మీద ప్రమాణం చేసి ఇప్పటికైనా నిజాలు చెప్పాలన్నారు. భువనేశ్వరి కి ఎన్టీఆర్  పైసా కట్నం కూడా ఇవ్వలేదని మరి ఆమె పేరుమీద ఆస్తులు  ఎలా వచ్చాయని ప్రశ్నించారు. లోకేష్ ఏ ఉద్యోగం,వ్యాపారం చేసి 7కోట్లు సంపాదించారని లక్ష్మి పార్వతి అన్నారు. 

No comments: