Sep 2, 2011

" రామోజీ రామాయణం " లో రాముడెవరో చెప్పండి ! ఐదువేలు బహుమతి పొందండి!

 
ప్రముఖ నిర్మాత,పత్రికాధిపతి రామోజీ రావు ఉషా కిరణ్  పతాకం పై కడప కధల నేపధ్యం లో వినూత్నపంధాలో రాజకీయ నేతలను నటులుగా పెట్టి "రామోజీ రామాయణం " పేరిట ఒక సంచలన  చిత్ర్రాన్ని నిర్మించబోతున్నారు .రామాయణం లోని  వివిధ పాత్రలకు  మన నేతల్లో ఎవరు
ఖచ్చితం గానప్పుతారో తెలియ చేయ  గోరుతున్నాం.  రావణ పాత్ర కోసం యువ నేత జగన్  ను  రామోజీ గారే స్వయం గా ఎంపిక చేసారు. 
ఆ పాత్రకు మాత్రం ఎవరిని సిఫారసు చేయ వద్దని మనవి.
సమ కాలీన నేతల్లో చంద్రబాబు,
కిరణ్ కుమార్ రెడ్డి డీఎల్,బొత్స,రోశయ్య,మైసూరా,హరికృష్ణ ,నన్నప నేని రాజకుమారి ,లక్ష్మి పార్వతి,కొండా సురేఖ ,ఉండవల్లి,వివేకా,హనుమంత రావు,శంకర రావు.అంబటి రాంబాబు,అనం వివేకా ల లో ఎవరు ఏ పాత్రకు సూట్ అవుతారో చెబితే అయిదు వేలు రూపాయలు బహుమతి గా అందజేస్తాం.రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ ,లోకేష్ పేర్లను కూడా సూచించగలరు
*ఎవరి పేర్లు ఆయినా
మర్చిపోయి వుంటే క్షమించగలరు.    

No comments: