టాలీవుడ్ యువ హీరోలు…సినిమాల్లో తమ ప్రేమను సక్సెస్ చేసుకోవడానికి ఎన్ని
తంటాలు పడుతుంటారో మనం అనేక సినిమాల్లో చూస్తూనే ఉంటాం. అదే విధంగా నిజ
జీవితంలోనూ ఈ యువ హీరోలంతా తమ ప్రేమను సఫలం చేసుకోవడానికి అదే తరహాలో
కష్టాలు పడుతున్నారు. అయితే సినిమాల్లో వారు అవలంభించే విధానాలకు, నిజ
జీవితంలో ఉపయోగించిన ఫార్మలాకు చాలా తేడా ఉండటం విశేషం.
గతంలో మహేష్ బాబు తన సహచర నటి నమ్రత శిరోద్కర్ ను పెళ్లి చేసుకున్న తీరును చూసినా…. మొన్నా మధ్య విష్ణు తను మనసుపడ్డ వెరోనికాను సొంతం చుసుకున్న వైనం, తాజాగా అల్లు అర్జున్, రామ్ చరణ్ లు తమ ప్రేమను సక్సెస్ చేసుకునే విషయంలో ఉపయోగించిన ఫార్ములా గమనిస్తే ఆశ్చర్యం కలుగక మానదు.

తాము మనసు పడిన అమ్మాయిల గురించి నేరుగా ఇంట్లో వాళ్లకి చెబితే…. వాళ్లు
ఒప్పుకుంటారో? లేదో గ్యారంటీ లేదు కాబట్టి ముందు ఆ విషయాన్ని మీడియాకు లీక్
చేస్తున్నారు కొందరు హీరోలు. ఈ ప్రచారంతో నెమ్మదిగా అసలు విషయం ఇంట్లో
వాళ్లకి తెలిసి పోతోంది. దీంతో వాళ్ల నుంచి వచ్చే స్పందనను బట్టి పెద్దల
సమక్షంలో పెళ్లి చేసుకోవాలా? లేక దొంగ చాటుగా పెళ్లి చేసుకుని ఆ తర్వాత
పెద్దలను ఒప్పించాలా? అనే విషయం నిర్ణయించుకుంటున్నారు.
అప్పట్లో మహేష్-నమ్రతల పెళ్లికి కుటుంబ సభ్యలు ఒప్పు కోక పోవడంతో ముందు వారికి తెలియకుండా పెళ్లి చేసుకుని వచ్చి, ఆ తర్వాత వారిని ఒప్పించాడు. మహేష్ ను ఆదర్శంగా తీసుకున్న ఇతర యువ హీరోలు కూడా ఇదే రూట్లో ఫాలో అయి సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అయితే మహేష్ కు ఇతర హీరోలకు ఒక్కటే తేడా. ఇంట్లో వాళ్లకి తెలియకుండా మహేష్ పెళ్లి జరిగితే, మిగతా వారంతా కింద మీదన పడి కుటుంబ సభ్యులను ఒప్పించారు. ఈ ఫార్ములాను తాజాగా రామ్ చరణ్ ఉపయోగించుకుంటున్నాడు. ఇంకా మున్ముందు ఇంకెంత మంది ఈ బాటలో నడుస్తారో..చూడాల్సిందే...?

No comments:
Post a Comment