Nov 1, 2011

సూపర్ స్టార్ సమైఖ్యవాది కాదా ?

  • సూపర్ స్టార్ కృష్ణ జై ఆంధ్రా వుద్యమానికి మద్దతు తెలిపారా ? ఆయన సమైఖ్యవాది కాదా ? బ్లాగులు వెతుకుతుంతే ఈ వార్త ఆసక్తికరంగా అనిపించింది . గతంలో కృష్ణ కు మంచి మాస్ ఫాలొయింగ్ వుడేది. ఆయన సినిమాలు కూదా అభ్యుదయ భావాలతో వుండేవి. అంధ్రప్రదేశ్ లొ తుఫాన్ వంటి విపత్తులు సంభవించినపుడు సహాయం చెసేవారిలో నాటి అగ్ర నటులలో ఆయనే ముందుండేవారు. అయితే నేడు చాలా విషయాలలో ఆయన మౌనంగానే వుంటున్నారు. తెలంగాణా విషయంలో ఆయన అభిప్రాయం కోసం ఈ సవాల్ విసిరినట్టుంది. ఏమైనా పాత రోజుల్లొ విషయాలు కూడా బ్లాగుల పుణ్యమా అని ఈజీగా తెలుసుకునే అవకాశం దొరికింది.  
  • బ్లాగులు వెతుకుతుంటే నాకు దొరికిన వార్త ఇది . మీరూ చూడండి.

జై ఆంద్రా కృష్ణ...పలుకవేమిరా...?

అప్పుడు జై ఆంధ్రా అన్న సినీ నటుల్లో చాలామంది ఇప్పుడెందుకు సమైక్య రాగం అందుకున్నారో ఓసారి ఆలోచించాలి. హైదరాబాద్ లో ఆస్తులు కూడబెట్టడంతో నాడు జైఆంధ్ర ఉద్యమానికి ఊపిరిలూదిన నాటి నాయకులు, సినీనటులు నేడు కనీసం ఆ మాట ఉచ్ఛరించడానికి కూడా ఇష్టపడటంలేదు. అందుకే మౌనముద్రవేసుకుని మూలన కూర్చున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి.
 మిగతా నటుల సంగతి ఎలా ఉన్నా, ఇంతటి మహోద్యమం జరుగుతుంటే సూపర్ స్టార్ కృష్ణ మౌనంగా ఎందుకు ఉంటున్నారు?  నాడు జై ఆంధ్రా అంటూ స్పష్టమైన ప్రకటన చేసిన కృష్ణ ఇప్పుడు ఎందుకని పెదవి విప్పడంలేదు? దీనికి కారణాలు ఏమిటో చెప్పండి...
(ఈ సందర్భంగా జైఆంధ్రా ఉద్యమం జరిగినప్పుడు తెనాలిలోని టౌన్ వైడ్ కృష్ణ కల్చరల్ యూనిట్ విడుదల చేసిన ఓ పోస్టర్ ని ఓసారి చూడండి...)

No comments: