హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బయోటెక్నాలజీ రంగంలో అంతర్జాతీయ కేంద్రంగా భారత్ ఎదుగుతోందని అసోసియేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ లెడ్ ఎంటర్‌ప్రైజెస్(ఏబీఎల్‌ఈ) తెలిపింది. 2010లో దేశంలో ఈ పరిశ్రమ 4 బిలియన్ డాలర్ల వ్యాపారం నమోదు చేసిందని ఏబీఎల్‌ఈ చైర్మన్, స్ట్రాండ్ లైఫ్ సెన్సైస్ సీఈవో విజయ్ చంద్రు తెలిపారు. బుధవారమిక్కడ హెచ్‌ఐసీసీలో ప్రారంభమైన బయోటెక్నాలజీ ఇండస్ట్రీ ఆర్గనైజేషన్(బయో) రెండవ అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ఇక్కడి బయో టెక్నాలజీ పరిశ్రమ 25 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తోందని చంద్రు పేర్కొన్నారు. 
ఎన్నో అనుకూలతలు..
భారత బయోటెక్ కంపెనీలతో భాగస్వామ్యానికి విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని గ్లెన్‌మార్క్ ఫార్మా సీఎండీ గ్లెన్ సల్దానా చెప్పారు. అంతర్జాతీయస్థాయి సదుపాయాలు, ప్రత్యేక పరిశోధనలు, నిపుణులు, వ్యయ నియంత్రణ చర్యలు, కంపెనీలపట్ల నమ్మకం వంటివి ఇందుకు దోహదం చేస్తున్నాయన్నారు.
భాగస్వామ్యమే దిక్కు..
భారతీయ కంపెనీలకు ఔషధం అభివృద్ధి మొదలు మార్కెట్ చేసే వరకు సామర్థ్యం లేకపోవడం శోచనీయమని సల్దానా అన్నారు. ఔషధ పరీక్షల కోసం భాగస్వామ్యంపై ఆధారపడాల్సి వస్తోందని వెల్లడించారు. ఈ విషయంలో రానున్న రోజుల్లో ఎంఎన్‌సీలు సంకట స్థితి ఎదుర్కొంటాయని అభిప్రాయపడ్డారు. భారత్‌లో గతేడాది 233 బిలియన్ డాలర్ల విలువైన 350 ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. ఒక్కో ఔషధం మూడో దశ పరీక్షలకు సుమారు రూ.450 కోట్లకుపైగా వ్యయం అవుతోందని, కంపెనీలకు ఇది తలకు మించిన భారమవుతోందని వివరించారు.
150కి పైగా కంపెనీలు..
రెండు రోజులపాటు జరిగే బయో ఇండియా సదస్సులో అబాట్, ఆస్ట్రా జెనికా, ఎంఎస్‌డీ, ఎలీ లిల్లీ, ఫైజర్, నోవో నార్డిస్క్, ఇంటాస్, లుపిన్, మెర్క్, నోవార్టిస్ వంటి 150కి పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి. 500 మందికిపైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. భాగస్వామ్య సమావేశాలకు సదస్సు వేదిక కానుంది.
ఔరంగాబాద్‌లో గ్లెన్‌మార్క్ యూనిట్..
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో గ్లెన్‌మార్క్ కొత్తగా యూనిట్ ఏర్పాటు చేయనుంది. కంపెనీకి ఇప్పటికే మూడు ఏపీఐ, తొమ్మిది ఫినిష్డ్ డోసేజ్ తయారీ యూనిట్లున్నాయి. అతిసారాన్ని నివారించే క్లోఫెలమర్ ఔషధం మూడో దశ పరీక్షలు పూర్తి అయ్యాయని, మార్కెట్ చేసేందుకు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్టు కంపెనీ తెలిపింది.
ఔషధ పరీక్షలపై సరైన విధానమే లేదు..
ఔషధ పరీక్షల నిబంధనలకు సంబంధించి భారత్‌లో సరైన విధానం, నిలకడ లేదని బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా తీవ్రస్థాయిలో విమర్శించారు. బయో ఇండియా సదస్సులో భాగంగా ఏర్పాటైన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పరిశ్రమకు ప్రభుత్వపరంగా ఆటంకాలున్నాయని అన్నారు. ‘ఔషధ పరీక్షల అనుమతులు ఆలస్యమవుతున్నాయి. దీంతో పెట్టుబడులు, సమయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే వ్యయం, సమయం మూడు నాలుగింతలు ఎక్కువగా తీసుకుంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఔషధ పరీక్షలకు భారత్ అనువైంది కాదనే అభిప్రాయం వస్తోంది’ అని పేర్కొన్నారు. పేటెంట్ కాలపరిమితి కుచించుకుపోయి, కంపెనీలు ఫలాలు అందుకోలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీలు నిబంధనలకు లోబడే పరీక్షలు జరుపుతున్నాయన్నారు. ఐటీ, ఫార్మా రంగాల తర్వాత బయోటెక్ పరిశ్రమ దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని, అందుకుతగ్గ వనరులు ఇక్కడ ఉన్నాయన్నారు. ఎఫ్‌డీఐల పట్ల పరిశ్రమ సుముఖంగా లేదన్నారు.

No comments:
Post a Comment