నాయుడుపేట, మేజర్‌న్యూస్: ఎస్‌ఇజడ్‌లలో భూములు కొల్పోయిన రైతుల కన్నీరు తుడిచేందుకు ఉత్తరప్రదేశ్‌కు వెళ్ళి ఆ ప్రభుత్వంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్‌ఇజడ్ బాధిత రైతులు కనిపిం చడం లేదా? అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. రాష్ట్ర రైతులను పరామర్శించడానికి ఆయన ఇక్కడికి వస్తే జనం తరిమి కొట్టడం ఖాయమని అభిప్రా యపడ్డారు. మంగళవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలో ఉన్నందున అక్కడికి వెళ్ళిన రాహుల్‌గాంధీ ఎస్‌ఇజడ్‌ల పేరుతో పేద రైతుల భూములను స్వాధీనం చేసుకొని రైతులకు అన్యాయం చేసిందని అక్కడి ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నాటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం లక్షలాది ఎకరాల పేద రైతుల భూములను తక్కువ రేటుకు కొనుగోలు చేసి అధిక రేట్లకు బడా కంపెనీలకు వి్రయించిన విషయం ఆయనకు గుర్తు లేదా అని చంద్రబాబు రాహుల్‌ను ప్రశ్నించారు. అవినీతిని పెంచి పోషించింది కాంగ్రెస్ ప్రభుత్వమే నంటూ చంద్రబాబు మండిపడ్డారు. సెల్‌ఫోన్ల కుంభకోణంలో కోట్లాది రూపాయాల అవినీతి జరగడంతో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన డిఎంకె నాయకులు కనిమొలి, రాజా అరెస్టులు జరగలేదా?, దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు.సీబీఐ విచారణతో వణుకు పుట్టిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అరెస్టు తథ్యమని తెలుసుకొన్న తర్వాత తనను కాపాడమంటూ ఢిల్లీ వెళ్ళి సోనియా కాళ్ళ మీద పడ్డాడని చంద్రబాబు విమర్శించారు.




No comments:
Post a Comment