హైదరాబాద్, మేజర్‌న్యూస్: సకల జనుల సమ్మె ఉధృ తి మరింత పెరగనున్నది. ఇప్పటికి తొమ్మిది రోజులు గడ చిపోయినా ఉద్యోగుల జేఏసీ, వివిధ శాఖల ఉద్యోగులు ఏమాత్రం వెనక్కి తగ్గకపోగా మరింత తీవ్రతరం చేసేం దుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా బస్సు చక్రాలను కదలకుండా చేసిన జేఏసీ వివిధ రూపాలలో సమ్మెను తీవ్రం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలపై ఒత్తిడి మరింత పెంచాలని, తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం వచ్చేలా చేయాలని రాజకీయ, ఉద్యోగ సం ఘాల జేఏసీలు భావిస్తున్నాయి. టీఆర్‌ఎస్ అధినేత కేసీ ఆర్ ఈ ఒత్తిడి పెంచటం కోసమే అక్టోబర్ రెండు నుంచి ఆమరణ దీక్ష మరోసారి చేపట్టాలని నిర్ణయించినప్పటికీ దాన్ని వాయిదా వేసుకోవలసి వచ్చింది. దీక్ష చేపడితే సమ్మె ఉధృతి తగ్గిపోయే ప్రమాదం ఉందని జేఏసీలు భావించటంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవలసి వచ్చింది. సకల జనుల సమ్మెను తీవ్రతరం చేసేందుకు మంగళవారం తెలంగాణా రాజకీయ జేఏసీ పలు కీల నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా ఈ నెల 24, 25 తేదీల్లో తెలం గాణాలోని అన్ని జిల్లాల్లో రైల్ రోకోలు చేపట్టాలని జేఏసీ నేతలు పిలుపు నిచ్చారు. అక్టోబర్‌లో హైదరాబాద్ నగరాన్ని దిగ్భంధిస్తామని వెల్లడించారు.
సమ్మెలో భాగంగా బుధవారం తెలంగాణ ఉద్యోగుల కుటుంబ సభ్యులతో దీక్ష నిర్వహిస్తారు. అవసరం అయితే పారిశుధ్య, ఆరోగ్య శాఖల వంటి అత్యవసర సర్వీసులను సైతం నిలిపివేయిస్తామని జేఏసీ నేతలు ఇప్పటికే హెచ్చరించారు. సమ్మెపై ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన జేఏసీ నేతలు సమ్మె విషయంలో ఎంతకైనా తెగిస్తామని స్పష్టం చేశారు. బస్సు, రైళ్ళతో పాటు విమానాశ్రయాలను సైతం ముట్టడిస్తామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాజ కీయ జేఏసీ మంగళవారం నాటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మరిం త ప్రాధాన్యం లభించింది.




No comments:
Post a Comment