పూర్వకాలంలో
గురువుల వద్దకు విద్యార్థులు వెళ్లి విద్యనభ్యసించేవారు. అలాగే సంగీతం,
నాట్యం, విలు విద్యలు ఇలా ఏదైనా సరే వాటికి ప్రత్యేకమైన గురువులను
ఆశ్రయించడం పరిపాటే. ఆ తరువాత నృత్య కళాశాలలు, సంగీత కాలేజీలు, వంటలను
నేర్చుకోవడం కోసం హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులు...ఇలా అనేకం వచ్చాయి.
ఆసక్తి కలవారికి నేర్పించేందుకు ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిని
ప్రోత్సాహించిది. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. డాన్సింగ్, కుకింగ్,
సంగీత పరికరాలను పలికించే విధానాలు...ఇలా ఎటువంటి పనులైనా ప్రస్తుత యువత
ఇంటర్‌నెట్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇంటర్‌నెట్‌లనే తమ గురువుగా భావించి
ఏకలవ్యులు అయిపోతున్నారు. తమ పీసీలనే పెద్దబాలశిక్షలుగా, ట్యూటర్లుగా,
అధ్యాపకులుగా, సలహాలిచ్చే మేధావులుగా భావిస్తున్నారు నేటి యంగ్‌స్టర్స్.ఇక ఇష్టమైన ఏ వంటలనయినా, డాన్స్, సంగీతం, పెయింటింగ్...ఇలా వేటినైనా గడప దాటకుండానే నేర్చుకోవచ్చు. వాటిల్లో ప్రావీణ్యత సంపాదించి అందరినీ అబ్బురపరచవచ్చు. గురువులేని విద్య గుడ్డి విద్య అన్నారు పెద్దలు. మాకు ఇంటర్‌నెట్ ఉంటే చాలు అంటున్నారు నేటి యువతీయువకులు. కాలంతో పాటే కొన్ని మార్పులు జరుగుతుంటాయి. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ యుగం నడుస్తోంది. అందులో ప్రముఖంగా చెప్పుకోవలసినది ఇంటర్‌నెట్. కొన్ని రోజుల క్రిందటి వరకు విషయాలను గురించి తెలియజేసేదిగా ఉన్న నెట్ ప్రస్తుతం ఆసక్తి కలవారికి ఏ విద్య నైనా నేర్పించే స్థాయికి ఎదిగింది. యువతకు కల్పతరువైంది.
చాలా నేర్చుకున్నాను...
‘నేను క్రమం తప్పకుండా రోజూ ‘హౌటూ’ (ఎలాచేయాలి) అనే వీడియోస్ చూస్తుంటాను. అందులో వచ్చే బేకింగ్ టిప్స్‌ను నేర్చుకుంటాను. వంటలను ఎలా వండాలో చెబుతున్నప్పుడు వాటినన్నింటినీ రాసుకుంటాను. ఈ వీడియోలో వంటను ఎలా చేయాలో చాలా విపులంగా వివరిస్తారు. మనకు ఏదైనా సందేహాలు ఉంటే మెయిల్‌ద్వారా సమాధానాలిస్తారు. అంతేకాకుండా కొత్త వంటకాలను గురించి, వాటి తయారీగురించి కూడా తెలియజేస్తుంటారు. అలా ఇంటర్‌నెట్ ద్వారా చాలా స్కిల్స్ నేర్చుకున్నాను’ అని పావని తెలిపారు.
‘నాకు, నా స్నేహితురాలికి దాల్ ఫ్రై చేయడ మెలాగో నేర్చుకోవాలనిపించింది. అప్పుడునేను వంటలను ఎలా తయారుచేయా లో నేర్పించే సైట్‌కు వెళ్లాను. యూట్యూబ్‌కు లాగిన్ అయి ట్యుటోరియల్ వీడియోస్‌ను నేను నా ఫ్రెండ్‌తో కలిసి రోజూ చూసేవాళ్లం. అందులో అంధ్రా వంటకాలనుంచి ప్రపంచంలోని అన్ని రకాల వంటకాలను ఎలా తయారుచేస్తారో విపులంగా వివరిస్తారు. తరువాత దాల్‌ఫ్రైను చేయడమె లాగో స్టెప్‌బైస్టెప్ అనుసరించాము. చిన్నగా ప్రాక్టీస్ మొదలుపెట్టాం. ఇప్పుడు మేము ఎంతో బాగా చేయగలం. ప్రస్తుతం మా రెగ్యులర్ స్టఫ్ అదే. ఇంటర్‌నెట్ ఓ మంచిటీచర్‌అని నాకు ఇప్పుడు అర్థ మైంది. ఎంతో తేలికగా నేర్చుకునేందుకు ఇది ఓ మంచి అవకాశం కూడా అని నా నమ్మకం’ అని పీజీ విద్యార్థి కీర్తన తెలిపింది.




No comments:
Post a Comment