Sep 4, 2011

వెంకటేష్ సినిమా షూటింగ్ కు తెలంగాణా సెగ !

హీరో వెంకటేష్  సినిమా షూటింగ్ కు తెలంగాణా సెగ తగిలింది .సినిమాల నిర్మాణంలో తెలంగాణ కళాకారులకు 45 శాతం అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మూవీ చాంబర్ అసోసియేషన్ సభ్యులు, ఏబీవీపీ కార్యకర్తలు వెంకటేష్ హీరోగా నటిస్తున్న 'బాడీగార్డ్' సినిమా నిర్మాణాన్ని అడ్డుకున్నారు.
శంషాబాద్ మండలంలోని నర్కోడ అమ్మపల్లి దేవాలయంలో బాడీగార్డ్ సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలుసుకున్న తెలంగాణ మూవీచాంబర్ జిల్లా అధ్యక్షుడు బైతిశ్రీధర్ ఉపాధ్యక్షుడు కృష్ణ నేతృత్వంలో దాదాపు వందమంది ఆందోళనకారులు అక్కడకి చేరుకుని అడ్డుకున్నారు.  ఈ సమాచారం పోలీసులకు తెలియడం తో  అక్కడకు చేరుకొని ఆందోళనకారులను అడ్డుకున్నారు. సినీ నిర్మాతలు తమ సినిమాల్లో పూర్తిగా ఆంధ్రా వాళ్లకే ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణ కళాకారులకు అన్యాయం చేస్తున్నారని ఆందోళనకారులు ధ్వజమెత్తారు. దీంతో ప్రొడక్షన్ మేనేజర్లు అక్కడికి వచ్చి ఆందోళనకారులతో మాట్ల్లాడారు. ఈ సినిమాలో తెలంగాణ కళాకారులకు కూడా  అవకాశాలు కల్పించామని  వివరించడంతో ఆందోళన విరమించారు.ఆ తర్వాత షూటింగ్ కొనసాగింది.

No comments: