skip to main |
skip to sidebar
జీనియస్ టిప్స్ -1

- ఎదుటివారితో మాట్లాడేటపుడు వారికేసి చూసి మాట్లాడండి. ఎటో చూస్తూ మాట్లాడితే చులకన అయిపోతారు.
- కొత్త వారిని కలిసినపుడు గ్లాడ్ టూ మీట్ యూ అన్నప్పుడు నిజంగా అలాగే సంతోషం ఉండాలి.
- నలుగురితో కలిసిపోయే ప్రయత్నం చెయ్యండి. వారు మాట్లాడుతున్నవి వినండి, విని వారిని మోతాదు మించకుండా అభినందించండి. ఉత్తమ శ్రోతగా ఉండటం వలన మిమ్మల్ని అభిమానించేవారి సంఖ్యా పెరుగుతుంది.
- మీరు ఎలా ఉన్నా బావున్నారని అనుకోవాలి. అది మార్చుకునేది కాదు . అప్పుడు స్వీకరించినవారే మీ నిజమిన స్నేహితులు .
- కొత్తవారిని కలిసినప్పుడు శేఖేండ్ ఇచ్చే అలవాటు చేసుకోండి. ' టచ్ ' వలన ఆత్మీయత పెరుగుతుంది.
- కొత్తవారిని కలవటానికి, మాట్లాడడానికి భయపడకండి. వారికి గవ్రవం ఇస్తే చాలు. భయపడితే జీవితాంతం భయపడాలి.
- మీరు ఏ పని చెయ్యాలన్న కొంచెం ముందుగా తయారవ్వండి. కాలేజీ, పరీక్షలు, సినిమా, పెళ్లి ఏదినా సరే, కొంచెం.., ముందు వెళ్ళే అలవాటు చేసుకోండి.
- సగం నిండిన పాలగ్లాసునిస్తే జీనియస్ సగంపాలున్నాయని ఆనందిస్తాడు . మూర్ఖుడు సగం ఖాళీగా ఉన్నాయని బాదపడతాడు.
- ఈ రోజు పనిని ఇప్పుడే చేయండి. రేపటి పని ఈ రోజే చెయ్యండి. వాయిదాలు వేసే వ్యాదికి గుడ్‌బై చెప్పండి.
- మీరు సాదిన్చాదలచుకున్న లక్ష్యం అసాద్యంకాదని గుర్తించండి . గతంలో అది చాలామంది సాదించారు. అందుకే మరోసారి ప్రయత్నించండి .
- జీవితములో మీరు ఏది సాదిన్చాలనుకున్తున్నారో ఆ రంగములో ఒక వ్యక్తిని రోల్ మోడల్ ఊహించుకోండి. ఆ వ్యక్తిలాగా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని కృషి చేయండి. ఆయన రూపం మీకు తప్పక స్పూర్తి కలిగిస్తుంది.
- చేసిన తప్పును అంగీకరించదములో తప్పులేదు. ఈనాటి సైంటిస్టులు కనిపెట్టిన వస్తువులేవీ మొదటిసారే ఆమోదిమ్పబడలేదు.
- ఏదినా ఒక మంచి ఆలోచన వచ్చినపుడు, మంచి విషయం విన్నప్పుడు ఒక నోట్‌బుక్ లో రాసుకునే అలవాటు చేసుకోండి.
- When You Are in Rome, be like a Roman అంటారు పెద్దలు. కాబట్టి పదిమందిలో ఉన్నప్పుడు, అక్కడికి తగినట్లుగా డ్రస్, భాష మార్చుకుంటూ ఉండాలి.
- మీరు ఏ మతంలో పుడితే ఆ మత భావాలను గురవించండి. ఇతరుల కోసం మీ మతాన్ని విమర్శించకండి. వారి కోసం మీ ఆచారాలను విడిచి పెట్టకండి.
- ప్రతి ఉదయం , సాయంత్రం వీలయినప్పుడు పళ్ళని బాగా బ్రష్ చేసుకోవాలి. లేకపోతే మాట్లాడేటప్పుడు వాసన వస్తుంది. ఎదుటివారు మీతో చెప్పలేక మిమ్మల్ని విడిచిపెట్టే ప్రమాదం ఉంది.
- ఎవరి విషయములోనైనా ఒక నిర్ణయము తీసుకునేటప్పుడు 1-5 స్కేలు ఉపయోగించాలి. ఉదాహరణకు ఒక ఫ్రెండంటే మీకు ఇష్టంలేదు అనుకోండి దాని స్కేలు ఇలా ఉండాలి. పరమడుర్మార్గుడు, దుర్మార్గుడు, చాలా చెడ్డవాడు, చెడ్డవాడు, మంచివాడు కాదు, మంచివాదేలే , మంచివాడు, చాలా మంచివాడు.
- మీరు పెట్టుకున్న లక్ష్యం, మీ అర్హతకు తగినట్లుగా ఉందొ లేదో చూసుకోవాలి. టెన్త్ ఫెయిల్ అయ్యి బిల్‌గేట్స్ అవుతాననీ, అంబానీ అవుతానంటే ప్రజలు నవ్వుతారు.
- మీ చేతి రాతని బాగా అందంగా ఉండేలా సాధన చెయ్యండి. అవసరమయితే కర్సివ్ రైటింగ్ పుస్తకాల్లో కాపీ రాయండి.
- " కాలం కలిసిరాలేదు " అని అనుకోకండి. కాలం ఎప్పుడు ఒకేలా ఉంటుంది. మనం చేసే పనిని బట్టే ఫలితాలుంటాయి.
- ప్రతి నిత్యం స్నానం చెయ్యాలనే నియమం పెట్టుకోండి. కొంతమంది స్టూడెంట్స్ రెండేసి రోజులు స్నానం చెయ్యరు. రైలు ప్రయాణం లాంటి సమయంలో వీలు దొరక్కపోతే కనీసం మర్మాంగాలు శుబ్రం చేసుకోండి.
- Failures are opportunities అనే సత్యం గ్రహించండి. తప్పులనుండే మనం ఎక్కువ జీవిత పాటాలు నేర్చుకుంటాం.
- జరిగిన చెడు అనుభవాలను దయిరీల్లో రాయకండి. అలాంటి దయిరీలుంటే చింపి పడేయండి. అది చదివినప్పుడల్లా మనసు పాడవుతుంది.
- ఇతరులు మాట్లాడుతున్నప్పుడు, వారి మాటకు అడ్డుతగాలకండి. వారు పూర్తిచేసిన తరువాతే మాట్లాడండి. దానివలన వారి సత్తా ఏమిటో తెలుస్తుంది.
- ఎవరయినా ఏదైనా విషయం చెప్తున్నప్పుడు మధ్యలో అడ్డుపడి " అది నాకు తెలుసు " అనకండి. దానివలన వారు చెప్పబోయే ఒక కొత్త విషయం చెప్పారు.
- ఎవరికి కష్టం వచ్చినా సహాయం చేయాలనే ఆలోచన రావొచ్చు. కానీ అలా చేయడం మీ ఇంట్లో వారికి కష్టం కలిగించవచ్చు . అప్పుడు వారిమీద ఎవరు జాలి చూపాలి ? అందుచేత మీవాళ్ళు చెప్పింది కుడా వినండి.
- మీరే కోర్సులో చేరినా మొదట్లో సిలబస్ చూసి కంగారు పడకండి. కొత్తలో అన్నీ అందరికీ కొత్తే.
- చివరకు మీకు చదువు చెప్పే టీచర్లకు కుడా.
- " నేను అనుకున్నది జరగదు " అని డిసైడ్ చేసుకోకుండా అది సాదించడానికి తగిన ప్రణాళిక వేసుకోండి.
- మీకు అంగ వాయికల్యం ఉంటె దానిని అవకాశంగా మార్చుకోండి. అటువంటివారెందరో గాయకులుగా, దాన్సర్లుగా, నాయకులుగా పేరు తెచ్చుకుని స్పూర్తి కలిగించారు.
- బవిష్యత్తు గురించి భయపడకండి. జరిగేది జరగకమానాడు. మీ కర్తవ్యం మాత్రం ఎప్పటికప్పుడు నిర్వర్తించండి.
- ఇన్ ఫీరియార్తీ కాంప్లెక్సు పోవాలంటే రోజు ఇద్దరు కొత్తవ్యక్తులతో మాట్లాడండి. అది బస్టాపు కావొచ్చు, రాయిల్వే స్టేషను కావొచ్చు.
- మనసుకి శరీరంలాగా మాంసకృత్తులు అవసరం. అవే మంచి ఆలోచనలు, ధైర్యం, పాజిటివ్ థింకింగ్.
- మీలోని లోపాలను ఎత్తిచూపే వారిని దూరం చేసుకోకండి. అవి నిజమైన లోపాలైతే సరిదిద్దుకోండి.
- మీరు సాదిన్చాలనుకుంటున్న లక్ష్యాన్ని పేపరు మీద రాయండి. దాన్ని రోజుకొకసారి చూస్తూ ఉండండి. అది మీకు ఎంతో స్పూర్తిని కలిగిస్తుంది.
- ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మీరొక్కరే దానిగురించి ఆలోచిస్తూ కుమిలిపోకండి. ఒక మంచి ఫ్రెండ్ తో చర్చించండి. అతని బుర్రలో చక్కని పరిష్కారం ఉండవచ్చు.
- ఇంకా చాలా చెప్పాలని ఉంది. అవాన్నీ తదుపరి పోస్టులలో రాస్తాను. విశ్లేషణ : అరవింద్
No comments:
Post a Comment