టాలీవుడ్ టాప్ హీరో ఎవరు ..? మహేష్ - జు|| ఎన్.టీ.ఆర్. లలో ఎవరు టాప్ ? .. చదవండి .. !
ఆ రెండు కుటుంబాల మధ్య మళ్ళీ పోటీ మొదలైంది. నందమూరి-ఘట్టమనేని కుటుంబాల మధ్య టాలీవుడ్ నంబర్ వన్ స్థానం కోసం పోటీ మొదలైంది. ఒకప్పుడు ఎన్.టీ.ఆర్ - కృష్ణ ల మధ్య వున్నా పోటీ - నేడు మహేష్ బాబు-ఎన్.టీ.ఆర్ ల మధ్య నడుస్తోంది.
తెలుగు చిత్ర రంగం లో హీరో ల మధ్య నంబర్ వన్ స్థానం పై ఎప్పటికప్పుడు పోటీ నెలకొనడం సహజం గా జరిగేదే. తాజాగా ఈ పోటీ మహేష్ - ఎన్.టీ.ఆర్ ల మధ్య నెలకొంది.
గతం లో కూడా హీరోల మధ్య పోటీ వున్నా ఒక హీరో చాలా కాలం వరకు ఆ స్థానాన్ని కాపడుకునేవాడు.
గతంలో కొన్ని సినిమా పత్రికలు ఈ స్థానాలపై పోటీలు నిర్వహించేవి . పోటీల నిర్వహణ పత్రికల నిజాయితీ కూడా నమ్మశక్యంగానే ఉండేవి .
జ్యోతి చిత్ర అనే సినీ వార పత్రిక ఏడాదికొకసారి తెలుగులో సూపర్ స్టార్ ఎవరు ? అనే దానిపై పోల్ నిర్వహించేది . మొదట ఎన్.టీ.ఆర్. ఎన్నిక కాగా ఆయన రాజకీయాలోలోకి వెళ్ళాక కృష్ణ వరుసగా మూడు సార్లు సూపర్ స్టార్ గా ఎన్నికై హాట్రిక్ కొట్టారు .
ఆ తర్వాత ఎప్పటికీ ఆయనే సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు . కృష్ణ కూడా రాజకీయాలలో ప్రవేశించడంతో చిరంజీవి డాన్సులతో ఆంద్రదేశాన్ని ఉర్రూతలూగించి మెగా స్టార్ గా ఎదిగారు .
కొన్నాళ్ళు చిరంజీవి , బాలకృష్ణల మద్య ఈ నంబర్ వన్ స్థానం పై పోటీ జరిగింది . బాలకృష్ణ కు మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్నా రికార్డుల మోత మొగిన్చినా చిరంజీవి మెగా స్టార్ గా మానేజ్ అయ్యాడు .
పాత తరం హీరోలలో కొంత కాలం మినహా ఎన్.టీ.ఆర్. ఎవర్ గ్రీన్ రారాజుగా వెలుగొందారు . కొన్ని సందర్బాలలో కృష్ణ , శోభన్ బాబు లు ఎన్.టీ.ఆర్. ను బీట్ చేసారు .
ఎన్.టీ.ఆర్ కూ కృష్ణ కూ ఎప్పుడూ పోటీ వాతావరణం నిలబడి ఉండేది . దాదాపు వారిరువురికీ సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది . ప్రస్తుతం అదే కుటుంబాలకు చెందినా వారసులు నందమూరి తారక రామారావు, ఘట్టమనేని మహేష్ బాబు ల మద్య నంబర్ వన్ స్థానం కోసం పోటీ నడుస్తుంది .
వీరిద్దరూ ఎవరికీ వారే తమదైన స్టైల్ లో దూసుకు పోతున్నారు. వీరిరువురికీ హిట్ , ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఇమేజ్ ను కలిగి వున్నారు.
హీరోలు గా కాక ఇరువురు పోటీ పడి యాడ్స్ లో యాక్ట్ చేస్తున్నారు. యాడ్స్ లో మహేష్ ముందున్నాడు.
సింహాద్రి తో ఎన్.టీ .ఆర్ పూర్తి స్థాయి హీరోగా మారగా , మహేష్ పోకిరీ తో ఆకాశమంత ఎదిగాడు.
ఎన్.టీ.ఆర్ కూ మహేష్ కూ ఒక విషయం లో పోలిక లేదు.
ఎన్.టీ.ఆర్ పక్కా మాస్ . రాజకీయాలలో కూడా రాటుదేలాడు. తాతకు తగ్గ మనవడని పించు కుంటున్నాడు. రాబోయేకాలం లో సి.ఎం పోటీ లిస్టు లో మన బుడ్డోడి పేరు కూడా వుంది . రాజకీయాలలో తాత స్తానాన్ని భర్తీ చేయగలిగే వారసుడిగా ప్రజలు సైతం జూనియర్ ను గుర్తిస్తున్నారు.
మహేష్ లో మాస్ యాంగిల్ వున్నా క్లాసికల్ హీరో గానే చూస్తున్నారు. కృష్ణ డేరింగ్ - డాషింగ్ గా వుంటే మహేష్ స్లో గా ఉంటాడు. లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తుంటాడు. కృష్ణ లా మొహమాటపడి ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేయక పోవడం , కృష్ణ కంటే చాల రెట్లు మెరుగైన పరిపూర్ణ నటుడిగా రోజు రోజుకూ మహేష్ ఎదుగుతున్నా తండ్రిలా జనం లో కలిసి పోయే డాషింగ్ నేచర్ మాత్రం లేదు.
ఇలా వారసత్వ లక్షణాలలో ఎన్.టీ.ఆర్ ముందుంటే మహేష్ చాలా వెనుక బడ్డాడు.
హీరోలుగా చూస్తే మహేష్ కు ప్లస్ పాయింట్స్ ఎక్కువ. సహజమైన గ్లామర్ , హుందా అయిన నటన, బ్లాక్ బస్టర్ విజయాలు తో మహేష్ మాంచి దూకుడు మీద వున్నాడు. జూనియర్ ఈ విషయం లో కాస్త వెనుకబడే వున్నాడు. డైలాగ్ డెలివరీ లో మాత్రం జూనియర్ మించే చాన్స్ మహేష్ కు లేదు.
ఇలా ప్లస్ , మైనస్ ల లెక్కలతో చూస్తే ఇద్దరూ ఎవరికీ వారే పోటాపోటీగా దూసుకు పోతున్నారు. ప్రస్తుతానికి మహేష్ బాబు హవా నడుస్తున్నా జూనియర్ ను తక్కువ అంచనా వేయడానికి లేదు.
No comments:
Post a Comment