Oct 23, 2011

టాలీవుడ్ టాప్ హీరో ఎవరు ..? మహేష్ - జు|| ఎన్.టీ.ఆర్. లలో ఎవరు టాప్ ? .. చదవండి .. !


 http://4.bp.blogspot.com/-BJAkiq-qTz4/TpFwpZzTMuI/AAAAAAAAAGM/4KRaV_v2jFo/s640/NTR+KRISHNA.png
http://videomasti.net/Uploaded_Images/d8f5cb126b4f_C78A/Mahesh-Jr-NTR.jpg
  • ఆ రెండు కుటుంబాల మధ్య మళ్ళీ పోటీ మొదలైంది. నందమూరి-ఘట్టమనేని కుటుంబాల మధ్య టాలీవుడ్ నంబర్ వన్ స్థానం కోసం పోటీ మొదలైంది. ఒకప్పుడు ఎన్.టీ.ఆర్ - కృష్ణ ల మధ్య వున్నా పోటీ - నేడు మహేష్ బాబు-ఎన్.టీ.ఆర్ ల మధ్య నడుస్తోంది. 
  • తెలుగు చిత్ర రంగం లో హీరో ల మధ్య నంబర్ వన్ స్థానం పై ఎప్పటికప్పుడు పోటీ నెలకొనడం సహజం గా జరిగేదే. తాజాగా ఈ పోటీ మహేష్ - ఎన్.టీ.ఆర్ ల మధ్య నెలకొంది.
  • గతం లో కూడా హీరోల మధ్య పోటీ వున్నా ఒక హీరో చాలా కాలం వరకు ఆ స్థానాన్ని కాపడుకునేవాడు.
  • గతంలో కొన్ని సినిమా పత్రికలు ఈ స్థానాలపై పోటీలు నిర్వహించేవి . పోటీల నిర్వహణ పత్రికల నిజాయితీ కూడా నమ్మశక్యంగానే ఉండేవి . 
  • జ్యోతి చిత్ర అనే సినీ వార పత్రిక ఏడాదికొకసారి తెలుగులో సూపర్ స్టార్ ఎవరు ? అనే దానిపై పోల్ నిర్వహించేది . మొదట ఎన్.టీ.ఆర్. ఎన్నిక కాగా ఆయన రాజకీయాలోలోకి వెళ్ళాక కృష్ణ వరుసగా మూడు సార్లు సూపర్ స్టార్ గా ఎన్నికై హాట్రిక్ కొట్టారు . 
  • ఆ తర్వాత ఎప్పటికీ ఆయనే సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు . కృష్ణ కూడా రాజకీయాలలో ప్రవేశించడంతో చిరంజీవి డాన్సులతో ఆంద్రదేశాన్ని ఉర్రూతలూగించి మెగా స్టార్ గా ఎదిగారు . 
  • కొన్నాళ్ళు చిరంజీవి , బాలకృష్ణల మద్య ఈ నంబర్ వన్ స్థానం పై పోటీ జరిగింది . బాలకృష్ణ కు మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్నా రికార్డుల మోత మొగిన్చినా చిరంజీవి మెగా స్టార్ గా మానేజ్ అయ్యాడు . 
  • పాత తరం హీరోలలో కొంత కాలం మినహా ఎన్.టీ.ఆర్. ఎవర్ గ్రీన్ రారాజుగా వెలుగొందారు . కొన్ని సందర్బాలలో కృష్ణ , శోభన్ బాబు లు ఎన్.టీ.ఆర్. ను బీట్ చేసారు . 
  • ఎన్.టీ.ఆర్ కూ  కృష్ణ కూ ఎప్పుడూ పోటీ వాతావరణం నిలబడి ఉండేది . దాదాపు వారిరువురికీ సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది . ప్రస్తుతం అదే కుటుంబాలకు చెందినా వారసులు నందమూరి తారక రామారావు,  ఘట్టమనేని మహేష్ బాబు ల మద్య నంబర్ వన్ స్థానం కోసం పోటీ నడుస్తుంది .
  • వీరిద్దరూ ఎవరికీ వారే తమదైన స్టైల్ లో దూసుకు పోతున్నారు. వీరిరువురికీ హిట్ , ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఇమేజ్ ను కలిగి వున్నారు.
  • హీరోలు గా కాక ఇరువురు పోటీ పడి యాడ్స్ లో యాక్ట్  చేస్తున్నారు. యాడ్స్ లో మహేష్ ముందున్నాడు. 
  • సింహాద్రి తో ఎన్.టీ .ఆర్ పూర్తి స్థాయి హీరోగా మారగా , మహేష్ పోకిరీ తో ఆకాశమంత ఎదిగాడు.
  • ఎన్.టీ.ఆర్ కూ మహేష్ కూ ఒక విషయం లో పోలిక లేదు. 
  • ఎన్.టీ.ఆర్ పక్కా మాస్ . రాజకీయాలలో కూడా రాటుదేలాడు. తాతకు తగ్గ మనవడని పించు కుంటున్నాడు.  రాబోయేకాలం లో సి.ఎం పోటీ లిస్టు లో మన బుడ్డోడి పేరు కూడా వుంది . రాజకీయాలలో తాత స్తానాన్ని భర్తీ చేయగలిగే వారసుడిగా ప్రజలు సైతం జూనియర్ ను గుర్తిస్తున్నారు. 
  • మహేష్ లో మాస్ యాంగిల్ వున్నా క్లాసికల్ హీరో గానే చూస్తున్నారు. కృష్ణ డేరింగ్ - డాషింగ్ గా వుంటే మహేష్ స్లో గా ఉంటాడు. లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తుంటాడు. కృష్ణ లా మొహమాటపడి ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేయక పోవడం , కృష్ణ కంటే చాల రెట్లు మెరుగైన పరిపూర్ణ నటుడిగా రోజు రోజుకూ మహేష్ ఎదుగుతున్నా తండ్రిలా జనం లో కలిసి పోయే డాషింగ్ నేచర్ మాత్రం లేదు. 
  • ఇలా వారసత్వ లక్షణాలలో ఎన్.టీ.ఆర్ ముందుంటే మహేష్ చాలా వెనుక బడ్డాడు.
  • హీరోలుగా చూస్తే మహేష్ కు ప్లస్ పాయింట్స్ ఎక్కువ. సహజమైన గ్లామర్ , హుందా అయిన నటన, బ్లాక్ బస్టర్ విజయాలు తో మహేష్ మాంచి దూకుడు మీద వున్నాడు. జూనియర్ ఈ విషయం లో కాస్త వెనుకబడే వున్నాడు. డైలాగ్ డెలివరీ లో మాత్రం జూనియర్ మించే చాన్స్ మహేష్ కు లేదు. 
  • ఇలా ప్లస్ , మైనస్ ల లెక్కలతో చూస్తే ఇద్దరూ ఎవరికీ వారే పోటాపోటీగా దూసుకు పోతున్నారు. ప్రస్తుతానికి మహేష్ బాబు హవా నడుస్తున్నా జూనియర్ ను తక్కువ అంచనా వేయడానికి లేదు.

No comments: