- గూడాచారి 117 తో తెలుగు ప్రజలకు " అతిధి " గా పరిచయమైన సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన " దూకుడు " 80 సంవత్సరాల తెలుగు సినీ ఇండస్ట్రీ చరిత్రను తిరగ రాసింది .
- ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీస్ అయ్యింది .
- ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా దూకుడు సంచలన విజయాలను సాధించింది .
- " కథలో కొత్తదనం ఏమీ లేదు , శ్రీను వైట్ల దర్శకత్వంలో వెరైటీ ఏమీ లేదు . సినిమాకు హీరొయిన్ ప్లస్ కాదు . మహేష్ బాబు ఇమేజ్ కు సరిపడా ఫైట్లు లేవు .
- పద్మశ్రీ బ్రమ్మానందం , ఎమ్మెస్ నారాయణ కామెడీ ఏ సినిమాకి విజయం కాదు .
- " ఐనా దూకుడు దూసుకెళ్లడానికి గల కారణం ఆ " ఒక్కడు " మాత్రమె . ఆ ఒక్కడి " ఖలేజా " మాత్రమే .
- దూకుడు విజయానికి కారణం కేవలం సూపర్ స్టార్ కృష్ణ అనేది " నిజం " కాదు .
- ఆ ఒక్కడి " నిజాన్ని " ఎవరు అర్థం చేసుకోలేక పోయారు . తమిళ్ సూపర్ స్టార్ రజినీ కొత్త " రోబో " గ్రాఫిక్స్ మాయలో ఉన్న తెలుగు ప్రజలు త్రివిక్రమ్ వెలికితీసిన మహేష్ కొత్త " ఖలేజా " ని ఎవరు గుర్తించలేకపోయారు .
- పోకిరీ రికార్డులు బ్రేక్ చేయలేదనీ , 3 గంటల లేన్తీ సినిమా అని విమర్శకులు హేళన చేసినా " రాజకుమారుడి " దూసుకెళ్తున్న దూకుడుతో విమర్శకులు ముక్కున వేలేసుకున్నారు .
- ఈ " దూకుడు " హిట్ కు ప్రధానమైన కారణం " మహేష్ అధ్బుతమైన నటనే . అయినా ఈ నటన మహేష్ కు పెద్దదేమీ కాదు .
- రిలీస్ అవుతున్న ప్రతి సినిమాకు అతని నటనలో మంచి మార్పు వస్తుంది .
- " అతడు " నేడు తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేకమైన పాత్రను వహిస్తున్నాడు .
- " దూకుడు " 80 సంవత్సరాల తెలుగు సినీ ఇండస్ట్రీ చరిత్రను తిరగ రాసినా మహేష్ ను పూర్తి స్థాయి నటుడిగా ఆవిష్కరించాలేడనే చెప్పాలి .
- ప్రిన్స్ నటన అమోఘం . సోషల్ నెట్వర్క్ ల ద్వారా అభిమానులకు దగ్గరవుతూ .. తెలుగు సినీ ఇండస్ట్రీ కి " ఒక " " సైనికుడు " గా ఉంటున్నాడు .
- మొదట్లో డైలాగులలో కొంచెం వీక్ అయినప్పటికీ , తన ప్రతి సినిమాకీ దానిని ఇంప్రూవ్ చేసుకుంటూనే వచ్చాడు .
- జల్సా లో తన వాయిస్ లో ని స్వీట్ నేస ను ప్రూవ్ చేసుకున్నాడు .
- " అతడు " " ఒక్కడు " గా మారి " సైనికుడు " గా నిలిచి పోరాడి దూకుడు ను సూపర్ హిట్ చేసాడనేది " నిజం . "
దూకుడు పోకిరీ రికార్డులను బ్రేక్ చేస్తుందా ? : - దూకుడు 80 సం || తెలుగు సినీ ఇండస్ట్రీ చరిత్రను తిరగ రాసినా " పోకిరి " రికార్డులను బ్రేక్ చేయలేదు . ఎందుకంటె :
- పోకిరి రిలీస్ అయిన రోజుల్లో థియేటర్లు తక్కువ . దూరప్రాంతాల వారు కుడా సిటీలకు వచ్చి సినిమా చూసి వెళ్ళేవారు .
- కానీ ప్రస్తుతం మారుమూల ప్రాంతాలకు దగ్గరలో కుడా థియేటర్లు అందుబాటులో కి వచ్చాయి .
- అదొక్కటే కారణం కాదు . ఇప్పుడు టెక్నాలజీ బాగా డవలప్ అయింది .
- సినిమా రిలీస్ అయిన 10 రోజులకే ఇంటర్నెట్ లో కి రావడం . రాత్రి డవున్లోడ్ చేసుకుని పొద్దున్నే చూడడం చాలా ఈసీ అయిపొయింది . దీనివల్ల కలెక్షన్లకు చాల నష్టం వాటిల్లింది .
- రిలీస్ అయిన మొదట్లో సిటీ ల లో ఒక్క రోజే మూడు , నాలుగు థియేటర్లకు ఒక్క సినిమా నే ఇవ్వడం వలన చాలా మంది ఒక్క రోజే చాలా మంది సినిమా చూసే అవకాశం ఉంది .
- పై కారణాల వాళ్ళ దూకుడు పోకిరి రికార్డులను బ్రేక్ చేయడం కష్టం అనే చెప్పాలి .
ఈ అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి .
No comments:
Post a Comment