- శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో వెంకటేష్, మహేష్ అన్నదమ్ములుగా నటించనున్నారు .
- ఈ విషయాన్ని నిర్మాత తెలియజేస్తూ...' విజయదశమి ' పర్వదినాన మా సంస్థ కార్యాలయంలో పూజ నిర్వహించాం.
- కథ చెప్పినప్పుడు ఇద్దరు హీరోలు అంగీకారం తెలిపారు. ఈ కథను దర్శకుడు శ్రీకాంత్ రెండేళ్ల క్రితం చెప్పాడు.
- ముందుగా వెంకటేష్ గ్రీన్‌సిగల్ ఇచ్చాడు.
- రెండో హీరో కోసం వెతుకుతూ 'దూకుడు' సెట్‌లో మహేష్‌ను కలిసి కథ చెబితే..15 నిముషాల్లో ఓకే చేశాడు.
- ఇది కుటుంబకథా చిత్రం. హీరోలు బిజీగా ఉన్నందున పూజకు రాలేదు. రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభిస్తాం.
- మేలో సినిమాను విడుదల చేస్తాం' అని తెలిపారు.
- పూజా కార్యక్రమానికి దాసరి నారాయణరావు, రాజమౌళి, వినాయక్ తదితరులు హాజరయ్యారు. చక్కటి తెలుగు టైటిల్‌తో సినిమా వస్తుందనీ, ఈ సందర్భంగా యూనిట్‌కు వారు శుభాకాంక్షలు తెలియజేసారు .
‘సీతమ్మ వాకిట్లో...’ సూపర్స్టార్స్అందరి దృష్టినీ తమవేపు నిలుపుకునే అసలు సిసలైన మల్టీస్టారర్ చిత్రానికి రంగం సిద్ధమైంది.
- ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సాక్షిగా ప్రేక్షకుల మనసుల్లో మరుమల్లెలు పూయించడానికి ఇద్దరు అగ్రహీరోలు- ప్రిన్స్ మహేష్ బాబు , వెంకటేష్ రెడీ అయ్యారు. ఈ సూపర్‌స్టార్స్ ఇద్దరినీ ఒకే స్క్రీన్ మీదకు తీసుకొచ్చిన క్రెడిట్ సంచనల చిత్రాల నిర్మాత ‘దిల్’ రాజుకు దక్కుతుంది.
- సరిగ్గా మూడేళ్ల క్రితం ప్రేక్షకులను ‘కొత్తబంగారులోకం’లో విహరింపజేసిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకుడు కావడం విశేషం.
- అపురూప కలయికలో వస్తున్న ఈ చిత్రానికి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ అన్న పేరును పెట్టి, తొలి అడుగులోనే అభినందనలు అందుకుంటున్నారాయన.
- ఇద్దరు నాయికలు వుండే ఈ చిత్రంలో ఓ కథానాయికగా సమంత నటించనున్నట్టు సమాచారం.
- ‘దూకుడు’లో మహేష్‌బాబు సరసన చేసిన సమంత ఇందులో రెండోసారి ఆయన సరసన జతకడుతున్నట్టు వినికిడి.
- ‘దిల్’రాజు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం దసరారోజు అయిన ఈ నెల 6న నిర్వహించనున్నట్టు తెలిసింది. వచ్చే ఏడాది విడుదలయ్యే ఈ సినిమా ప్రేక్షకులకు నిజంగా ‘డబుల్ ధమాకా’నే అని చెప్పొచ్చు.
Oct 8, 2011
సీతమ్మ వాకిట్లో .... సుపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు , వెంకటేష్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment