కథ, కథ వినిపించిన వ్యక్తి కేరక్టర్, కథలో తన కేరక్టర్... ఈ మూడూ నచ్చితే చాలు. పాత, కొత్త - చిన్న, పెద్ద అనే తారతమ్యాలు చూడరు బాలకృష్ణ. కళ్లుమూసుకొని అవకాశం ఇచ్చేస్తారు.
- అలా చాలామంది చిన్న దర్శకులకు అవకాశం ఇచ్చారాయన. ఇప్పుడు ఆ దర్శకుల వరుసలో నటుడు, దర్శకుడు సుధాకర్‌నాయుడు(జీవి) కూడా చేరబోతున్నారు.
- బాలకృష్ణను డెరైక్ట్ చేసే సువర్ణావకాశాన్ని సొంతం చేసుకున్నారని తెలిసింది.
- గతంలో చాలా చిత్రాల్లో నెగెటివ్ పాత్రల్లో కనిపించిన జీవి... ఆ తర్వాత హీరో, రంగ ది దొంగ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన బాలకృష్ణ కోసం ఓ శక్తివంతమైన కథను తయారు చేశారని, ఆ కథ బాలకృష్ణకు బాగా నచ్చి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని విశ్వసనీయ సమాచారం. ఓ అగ్ర నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని తెలిసింది.
- ఇదిలావుంటే... బాలకృష్ణ నటించిన ‘శ్రీరామరాజ్యం’ నవంబర్ 17న విడుదల కానుంది.
- ఆయన నటిస్తున్న కీర్తి కంబైన్స్ చిత్రం, మంచు లక్ష్మీప్రసన్న నిర్మిస్తున్న ‘ఊకొడతారా ఉలిక్కి పడతారా’ నిర్మాణ దశలో ఉన్నాయి.
- ఇంకా బి.గోపాల్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించే చిత్రంతో పాటు, జయంత్ దర్శకత్వంలో కూడా ఆయన ఓ చిత్రంలో నటించనున్నారని సమాచారం.
- ఇలా యమస్పీడుగా సినిమాలు చేస్తూ 100వ సినిమాకు చేరువ అవుతున్నారు బాలకృష్ణ.
Oct 25, 2011
జీవి దర్శకత్వంలో బాలకృష్ణ...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment