Pages

Oct 1, 2011

80 సంవత్సరాల తెలుగు సినీ ఇండస్ట్రీ చరిత్రను తిరగ రాసి సంచలనం సృష్టించిన " దూకుడు "

మహేష్‌ నటించిన 'దూకుడు' కలెక్షన్ల వరద సృష్టించిందని దర్శకనిర్మాతలు అంటున్నారు. డైరెక్టర్‌ శ్రీనువైట్ల కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై జి.రమేష్‌బాబు సమర్పణలో రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మించారు. మొదటి వారం రోజుల్లోనే రూ.50 కోట్ల 7 లక్షలకు పైగా క్రాస్ , 35 కోట్ల 1 లక్ష షేర్‌ సాధించి 80 సంవత్సరాల తెలుగు చలన చిత్ర చరిత్రను తిరగ రాసిందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, నార్త్‌ ఇండియాలతోపాటు ఓవర్సీస్‌లో కూడా సంచలన విజయాన్ని సాధించిందని, సరికొత్త రికార్డులు సృష్టిస్తోందని, అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌ టైమ్స్‌లో 'దూకుడు' చిత్రం సాధించిన అద్భుత విజయంపై స్పెషల్‌ ఆర్టికల్స్‌ రాసిందని దర్శక నిర్మాతలు గుర్తుచేస్తున్నారు. 
 దయచేసి దూకుడు సూపర్ హిట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. 

No comments:

Post a Comment