Sep 27, 2011

'దూకుడు' సక్సెస్‌మీట్‌...కలెక్షన్లు బాగున్నాయి...

మహేష్‌బాబు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన 'దూకుడు' సక్సెస్‌మీట్‌ సోమవారంనాడు ఫిలింనగర్‌ క్లబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... 'దూకుడు చిత్రాన్ని పెద్దహిట్‌ చేసిన తెలుగువారందరికీ కృతజ్ఞతలు. మూడురోజులకు ఆల్‌టైమ్‌ రికార్డ్‌ సాధించింది. సినిమా రోజే పుట్టునరోజు కావడంతో ప్రేక్షకులు ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నా. సినిమా విజయానికి కారకుడు మహేష్‌బాబు. అభిమానులు ఆయన్ను ఎలా చూడాలనుకుంటున్నారో ఆ విధంగా తీర్చిదిద్దాం. విజయానికి మేం తయారు చేసుకున్న స్క్రిప్ట్‌ ఒక కారణం. నేను ఎదగాలని నిర్మాతలు, నా స్నేహితులు కోరుకునానరు. సంగీత దర్శకుడు తమన్‌కు ఇది ప్రెస్టీజియస్‌ సినిమా అని చెప్పాను. ఏడాదిపాటు ట్యూన్స్‌కు కూర్చున్నాడు. ఫొటోగ్రఫీ గుహన్‌ అందంగా తీశాడు. మూడు పాటలకు దినేష్‌ డాన్స్‌ బాగా చేయించాడు. మహేష్‌ బాడీలాంగ్వేజ్‌కు సరిపడా రూపకల్పన చేశాడు. గోపీమోహన్‌, కోన వెంకట్‌లు నాతో కలిసి కష్టపడ్డారు' అని చెప్పారు.
నిర్మాత అనిల్‌ సుంకర మాట్లాడుతూ...'ఆల్‌టైమ్‌ రికార్డ్‌ అనే 21.22 కోట్లు షేర్‌ మూడు రోజులకు వచ్చింది. తెలుగు సినిమా సత్తాను చూపించింది. ఈ సినిమా తీయడం మా అదృష్టం. దసరా, సంక్రాంతికి సెలబ్రేట్‌ చేసుకునే చిత్రమిది. సినిమాను సౌతాఫ్రికా, నెదర్లాండ్‌, ఫిన్‌ల్యాండ్‌లో కూడా విడుదల చేశాం. ప్రపంచవ్యాప్తంగా 1600 స్క్రీన్స్‌లో ఆడుతోంది' అని అన్నారు. మరో నిర్మాత రామ్‌ ఆచంట మాట్లాడుతూ...'సినిమా విజయం ఆంధ్రలో ఒక ఎత్తయితే అమెరికాలో మరో ఎత్తుగా నిలిచింది. అమెరికాలో రెండు రోజుల్లో 1 మిలియన్‌ డాలర్లు క్రాస్‌ చేసింది. ఆదివారానికి 1.4 మిలియన్‌ డాలర్లు షేర్‌ వచ్చింది. విదేశాల్లో అంతమంది ఉన్నారా అనిపించింది' అని అన్నారు.

No comments: