skip to main |
skip to sidebar
సీనియర్ల ఇష్టం : రిటైర్మెంట్‌పై గంగూలీ
: సచిన్, లక్ష్మణ్, ద్రావిడ్‌ల రిటైర్మెంట్‌ను వారి అభిష్టానికి వదలాలని, సీయర్ ఆటగాళ్లు తప్పుకోవడానికి ఇది తగిన సమయం కాదని, జట్టు నుంచి వైదొలగాలని వారిని సెలక్టర్లు బలవంత పెట్టకూడదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. 'తమ ప్రదర్శన తగ్గినప్పుడు వారి స్వయంగా నిర్ణయం తీసుకుంటారు. ద్రావిడ్, లక్ష్మణ్ ఇప్పటికే వన్డే క్రికెట్ నుంచి తప్పుకున్నారు. సచిన్ పరిమితంగా వన్డే క్రికెట్ ఆడుతున్నాడు. వన్డేల్లో యువ క్రికెటర్లు సత్తా చాటుతున్నారు. కానీ టెస్టుల్లో వారి ప్రదర్శన ఆందోళనల కలిగిస్తోంది' అని దాదా తెలిపాడు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా సీనియర్లు టెస్టుల నుంచి వైదొలుగుతారని అన్నాడు. 1983 ప్రపంచ కప్ నెగ్గిన తర్వాత సీనియర్లపై సెలక్టర్లు ఒక నిర్ణయం తీసుకున్నారు. 'సీనియర్లను రిటైర్ కావాలని సెలక్టర్లు కోరడం ఆటగాళ్లు ఇష్టపడరు. ఇది చాలా కష్టమైన నిర్ణయం. ఈ సీనియర్లకు సెలక్టర్లు పూర్తి గౌరవం ఇవ్వాలి' అని కపిల్ అన్నాడు. ఒక టెస్టులో సచిన్, లక్ష్మణ్, ద్రావిడ్‌లలో ఒకరికి విశ్రాంతి ఇచ్చి ఇద్దరిని మాత్రమే ఆడించాలని, వారి స్థానంలో యువ క్రికెటర్లను పరీక్షించాలన్నాడు. ఎక్కువ రిస్క్ తీసుకుని యువకులకు అవకాశం ఇవ్వడం ప్రమాదని, ఒక్కసారి మార్పులు చేయడం సరికాదని కపిల్ తెలిపాడు. యువ క్రికెటర్ల ప్రదర్శనపై ఫిట్‌నెస్ తీవ్ర ప్రభావం చూపిస్తోందని అన్నాడు. అయినా అంతర్జాతీయ వేదికలపై వారికి తగిన అవకాశాలు కల్పించాలన్నాడు. సచిన్, లక్ష్మణ్, ద్రావిడ్‌ల స్థానాలు భర్తీ చేయడం అంత సులుకాదు. ఇదీ ఎంతో కఠినతరమైంది. కానీ టెస్టుల్లో యువకులు విఫలమైనా మళ్లీ మళ్లీ వారికి అవకాశాలు కల్పించాలి. టెస్టుల్లో యువ క్రికెటర్లు విఫలం కావడం వారి తప్పుకాదు. ప్రస్తుతం కోచ్‌లు, సెలక్టర్ల పాత్రను మరువరాదు. వారి ఫిట్‌లెస్ స్థాయిని పెంచాల్సిన అవసరం ఉందని మాజీల వాదన 'నేటి క్రీడాకారుల్లో పని నైతికత లోపించింది. వారి ఫిట్‌నెస్ స్థాయి పెరగాలి. కోహ్లి, పూజరా, రోహిత్‌లకు మరో అవకాశం ఇవ్వాలి. సురేష్ రైనా చాలా అవకాశాలు వృథా చేసుకున్నాడు. రైనా, యువీలకు మరో ఛాన్స్ ఇవ్వాలి' అని మదన్‌లాల్ తెలిపాడు.
No comments:
Post a Comment