పాఠశాలలకు విద్యాశాఖ దసరా సెలవులు ప్రకటించింది. 27వ తేదీ నుంచి వచ్చే నెల 9
వరకు దసరా సెలవులు కొనసాగుతాయని జిల్లా విద్యాశాఖాధికారి శ్రీహరి
తెలిపారు. వచ్చే నెల 10న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
సకల జనుల సమ్మె నేపథ్యంలో ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు
అనధికారికంగా సెలవులు ప్రకటించేశారు. ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది సమ్మెలో
పాలుపంచుకుంటుండటంతో విద్యార్థులు బడులకు రావటం లేదు. ప్రభుత్వ హాస్టళ్లను
ఖాళీ చేసి విద్యార్థులు ఇప్పటికే ఊళ్లకు వెళ్లిపోయారు. వచ్చే నెల 10 నాటికి
పరిస్థితి చక్కబడితేగాని బడులు పునఃప్రారంభమయ్యే అవకాశం లేదు.
Sep 27, 2011
నేటినుంచి బడులకు దసరా సెలవులు ప్రకటించిన : విద్యాశాఖ :-)
Subscribe to:
Post Comments (Atom)




No comments:
Post a Comment