*తారస్థాయికి చేరుతున్న ప్రచ్ఛన్న యుద్దం
*పీసీసీ చీఫ్ బొత్సకు చెక్ పెట్టేందుకు సీఎం యత్నాలు
*మంత్రికి తెలియకుండానే ఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులు
*బొత్సకు మాటమాత్రం చెప్పకుండానే రూపాయికే కిలో బియ్యం పథకం ప్రకటన
*రగలిపోతున్న సత్తిబాబు... ఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించబోనని హామీ
*నల్లారి వైఫల్యాలను వారితోనే ఎండగట్టిస్తూ హైకమాండ్ దృష్టిలో చులకన చేసే యత్నం
హైదరాబాద్, న్యూస్‌లైన్: కలహాల కాంగ్రెస్‌లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సాక్షాత్తు రాష్ర్ట ప్రభుత్వ అధినేత, పీసీసీ రధసారథి మధ్య ఆధిపత్య పోరు ఉధృతమైంది. ఒకరిపై ఇంకొకరు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తమదైన బాటలో హైకమాండ్‌కు నివేదికలు సమర్పిస్తున్నారు. పీసీసీ పీఠం ఎక్కిన రోజునే తాను సీఎం పీఠాన్ని ఆశిస్తున్నట్టు బొత్స సత్యనారాయణ ప్రకటించిన రోజు నుంచి వీరిద్దరి మధ్య పోరు తీవ్రమైంది. ఆర్టీసీలో కాంట్రాక్టు కార్మికులను తొలగించడం, రూపాయికే కిలోబియ్యం ఇస్తామంటూ ముఖ్యమంత్రి తిరుపతిలో ఏకపక్షంగా ప్రకటన చేయడంపై బొత్స ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది.
ప్రభుత్వానికి సంబంధించిన కీలక నిర్ణయాలు చేసిన తరుణంలో కనీసం మంత్రిగా ఉన్న తనకు ఒక మాట చెప్పకపోవడం, పీసీసీ అధ్యక్షుడి హోదాలో కూడా కనీస సమాచారం ఇవ్వకపోవడమంటే సీఎం కావాలనే చేశారన్న అభిప్రాయంతో బొత్స ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆర్టీసీలో కాంట్రాక్టు కార్మికులను తొలగించిన అంశం టీవీల్లో చూసిన తర్వాత గానీ తనకు తెలియలేదని బొత్స ప్రకటించడానికి కారణం కూడా ఇదేనని అంటున్నారు. అలాగే రూపాయికే కిలో బియ్యం ఇస్తామని సీఎం చెప్పారా? నాకు తెలియదే... అని బొత్స వ్యాఖ్యానించడం ఆయనలోని అసంతృప్తిని బయటపెట్టిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఎత్తుకు పైఎత్తులు: మంత్రివర్గం నుంచి బొత్సను తప్పించాలని మొదటినుంచి కోరుకుంటున్న సీఎం ఆ మేరకు ఢిల్లీ పెద్దలకు ఇదివరకే నివేదించారు. అది గమనించిన తర్వాత బొత్స తనదైన రీతిలో గాంధీభవన్‌లో వ్యవహారాలు ప్రారంభించారు. తెలంగాణ విషయంతోపాటు వివిధ అంశాల్లో సీఎం తీరును వ్యతిరేకిస్తున్న మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీలు కేశవరావు, వివేక్, మధుయాష్కీ, రాజగోపాల్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మందా జగన్నాథంతో పాటు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి వంటి సీనియర్ నేతలందరితో నిత్యం సమావేశాలు నిర్వహిస్తున్నారు.
బొత్సతో సమావేశమైన ప్రతిసారి ఆయా నేతలంతా సీఎంను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతోపాటు రాష్ర్టంలో జరుగుతున్న పరిణామాలు సీఎం వైఫల్యంగా పేర్కొంటూ హైకమాండ్ పెద్దలకు బొత్స ఎప్పటికప్పుడు నివేదికలు పంపుతున్నట్లు సమాచారం. మరోవైపు పార్టీపరంగా జరిగే కార్యక్రమాలకు సీఎంను దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమైన కార్యక్రమాలపైనా సీఎంతో చర్చించడం లేదని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
విశాఖలో ఈనెల 25న నిర్వహించే ‘ఉత్తరాంధ్ర కాంగ్రెస్ గర్జన’ సభకు తాను, చిరంజీవి ప్రధాన ఆకర్షణగా నిలవాలని భావించిన సత్తిబాబు ఈ సభకు కిరణ్‌కుమార్‌రెడ్డి రావడం లేదని చెప్పారు. ఇది గమనించిన సీఎం తాను కూడా విశాఖ సభకు వస్తానని చెప్పుకోవాల్సి వచ్చింది. అంతకుముందు బొత్స విదేశీ పర్యటనలో ఉండగా ఆయన సొంత జిల్లా విజయనగరం సమీక్షను ఏర్పాటు చేశారు. విదేశాల్లో ఉన్న బొత్స అది గమనించి జిల్లా అధికారులకు చెప్పి మరీ ఆ సమీక్షా సమావేశాన్ని రద్దు చేయించారు.
కనీస సమాచారమూ కరవు
కిరణ్‌ను ఢీకొనేందుకు అదనపు బలంకోసం బొత్స కొత్తగా కాంగ్రెస్‌లో చేరిన చిరంజీవిని చేరదీశారు. ఇప్పుడు పార్టీలో చిరు వర్గమంతా బొత్స వర్గంగా మారిపోయిందన్న చర్చ కూడా ఉంది. ఈ పరిస్థితుల్లోనే బొత్సను తన మార్గం నుంచి తప్పించడానికి కిరణ్ కూడా అదేస్థాయిలో తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
పాలనాపరమైన విషయాల్లో బొత్సను దాదాపుగా దూరం పెడుతున్నారు. ముఖ్యంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పీసీసీ చీఫ్‌గా ఉన్న వ్యక్తితో చర్చించడం పరిపాటి. అయినప్పటికీ సత్తిబాబుకు సీఎం చెప్పకుండానే రూపాయికి కిలోబియ్యం పథకాన్ని ప్రకటించేశారు. తనకు కనీస సమాచారం లేకుండా తిరుపతిలో సీఎం రూపాయి కిలోబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టడంపట్ల బొత్స బహిరంగంగానే ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఆర్టీసీలో కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు అంశం తనకు తెలియదని బొత్స చెబుతున్నది పూర్తి వాస్తవవిరుద్ధమని, సమ్మెలో పాల్గొనే ఉద్యోగులపై ఎస్మాను ప్రయోగించాలని తీసుకున్న నిర్ణయంపై బొత్స సంతకం చేశారనీ, అందులో పేరా 8లో పేర్కొన్నట్టుగానే విధులకు హాజరుకాని కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించడం జరిగిందని సీఎం సన్నిహితవర్గాలు చెబుతున్నాయి.
*పీసీసీ చీఫ్ బొత్సకు చెక్ పెట్టేందుకు సీఎం యత్నాలు
*మంత్రికి తెలియకుండానే ఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులు
*బొత్సకు మాటమాత్రం చెప్పకుండానే రూపాయికే కిలో బియ్యం పథకం ప్రకటన
*రగలిపోతున్న సత్తిబాబు... ఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించబోనని హామీ
*నల్లారి వైఫల్యాలను వారితోనే ఎండగట్టిస్తూ హైకమాండ్ దృష్టిలో చులకన చేసే యత్నం
ఎత్తుకు పైఎత్తులు: మంత్రివర్గం నుంచి బొత్సను తప్పించాలని మొదటినుంచి కోరుకుంటున్న సీఎం ఆ మేరకు ఢిల్లీ పెద్దలకు ఇదివరకే నివేదించారు. అది గమనించిన తర్వాత బొత్స తనదైన రీతిలో గాంధీభవన్‌లో వ్యవహారాలు ప్రారంభించారు. తెలంగాణ విషయంతోపాటు వివిధ అంశాల్లో సీఎం తీరును వ్యతిరేకిస్తున్న మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీలు కేశవరావు, వివేక్, మధుయాష్కీ, రాజగోపాల్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మందా జగన్నాథంతో పాటు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి వంటి సీనియర్ నేతలందరితో నిత్యం సమావేశాలు నిర్వహిస్తున్నారు.
బొత్సతో సమావేశమైన ప్రతిసారి ఆయా నేతలంతా సీఎంను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతోపాటు రాష్ర్టంలో జరుగుతున్న పరిణామాలు సీఎం వైఫల్యంగా పేర్కొంటూ హైకమాండ్ పెద్దలకు బొత్స ఎప్పటికప్పుడు నివేదికలు పంపుతున్నట్లు సమాచారం. మరోవైపు పార్టీపరంగా జరిగే కార్యక్రమాలకు సీఎంను దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమైన కార్యక్రమాలపైనా సీఎంతో చర్చించడం లేదని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
విశాఖలో ఈనెల 25న నిర్వహించే ‘ఉత్తరాంధ్ర కాంగ్రెస్ గర్జన’ సభకు తాను, చిరంజీవి ప్రధాన ఆకర్షణగా నిలవాలని భావించిన సత్తిబాబు ఈ సభకు కిరణ్‌కుమార్‌రెడ్డి రావడం లేదని చెప్పారు. ఇది గమనించిన సీఎం తాను కూడా విశాఖ సభకు వస్తానని చెప్పుకోవాల్సి వచ్చింది. అంతకుముందు బొత్స విదేశీ పర్యటనలో ఉండగా ఆయన సొంత జిల్లా విజయనగరం సమీక్షను ఏర్పాటు చేశారు. విదేశాల్లో ఉన్న బొత్స అది గమనించి జిల్లా అధికారులకు చెప్పి మరీ ఆ సమీక్షా సమావేశాన్ని రద్దు చేయించారు.
కనీస సమాచారమూ కరవు
కిరణ్‌ను ఢీకొనేందుకు అదనపు బలంకోసం బొత్స కొత్తగా కాంగ్రెస్‌లో చేరిన చిరంజీవిని చేరదీశారు. ఇప్పుడు పార్టీలో చిరు వర్గమంతా బొత్స వర్గంగా మారిపోయిందన్న చర్చ కూడా ఉంది. ఈ పరిస్థితుల్లోనే బొత్సను తన మార్గం నుంచి తప్పించడానికి కిరణ్ కూడా అదేస్థాయిలో తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
పాలనాపరమైన విషయాల్లో బొత్సను దాదాపుగా దూరం పెడుతున్నారు. ముఖ్యంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పీసీసీ చీఫ్‌గా ఉన్న వ్యక్తితో చర్చించడం పరిపాటి. అయినప్పటికీ సత్తిబాబుకు సీఎం చెప్పకుండానే రూపాయికి కిలోబియ్యం పథకాన్ని ప్రకటించేశారు. తనకు కనీస సమాచారం లేకుండా తిరుపతిలో సీఎం రూపాయి కిలోబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టడంపట్ల బొత్స బహిరంగంగానే ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఆర్టీసీలో కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు అంశం తనకు తెలియదని బొత్స చెబుతున్నది పూర్తి వాస్తవవిరుద్ధమని, సమ్మెలో పాల్గొనే ఉద్యోగులపై ఎస్మాను ప్రయోగించాలని తీసుకున్న నిర్ణయంపై బొత్స సంతకం చేశారనీ, అందులో పేరా 8లో పేర్కొన్నట్టుగానే విధులకు హాజరుకాని కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించడం జరిగిందని సీఎం సన్నిహితవర్గాలు చెబుతున్నాయి.

No comments:
Post a Comment