Sep 26, 2011

కంప్యూటర్‌ వర్సెస్‌ మనిషి !

Computer-Crashకంప్యూటర్‌ను మనిషి సృష్టిస్తే, అదే మనిషిని భగవంతుడు సృష్టించాడనేది మతాలకు అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా అందరి విశ్వాసం. మనిషి సృష్టించిన కంప్యూ టర్‌ను, భగవంతుడు సృష్టించిన మానవుడనే కంప్యూటర్‌ను సరిపోల్చుకుంటే, తనను సృష్టించిన మనిషికే కంప్యూటర్‌ భవిష్య జీవితం గురించి మార్గనిర్దేశం చేస్తుంది. అది పలా అని పరిశీలిస్తే.....

1. ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చిన కంప్యూటర్‌లో పటువంటి జీవం కానీ, సాఫ్ట్‌ వేర్‌ కానీ ఉండదు. అదే విధంగా స్త్రీ గర్భస్త పిండంలో ప్రవేశపెట్టబడిన జీవిలో సైతం పటువంటి చలనం ఉండదు. కంప్యూటర్‌లో సాఫ్ట్‌వేర్‌ వేసిన తరువాతనే కంప్యూ టర్‌లో జీవం వస్తుంది. నిర్ణీతమైన కాల పరిమితి లోనే భగవంతుడి నిర్ణయానుసారం గర్భస్త పిండంలో జీవం నెలకొంటుంది. కంప్యూ టర్‌లో విండోస్‌ లేదా మ్యాక్‌ సాఫ్ట్‌వేర్‌ను లోడ్‌ చేసి ప్రోగ్రాంకు పలా సిద్ధం చేస్తామో అదే విధంగా భగవంతుడు గర్భస్త పిండంలో జీవం పోసే సమయంలోనే ‘‘మానవా!

ఇప్పటి వరకు జరిగింది జరిగిపోయింది, దానిని తిరిగి తవ్వుకోవటం వ్యర్ధం. ఇంత వరకు నువ్వు చేసింది చాలు, ఇకపైనైనా నీలో మార్పు తీసుకురా, నిరంతర కృషితో నిన్ను నువ్వు మార్చుకొని నా దరికి చేరుకో, నీకు నేనిచ్చే చివరి అవకాశం ఇదే’’ అంటూ మానుష ప్రాకృత కర్మ అనబడే సాఫ్ట్‌వేర్‌ను గర్భస్త పిండంలో లోడ్‌ చేస్తాడు. కంప్యూటర్‌లో విండోస్‌ లేదా మ్యాక్‌ సాఫ్ట్‌వేర్‌ వేసిన తరువాత ఆ సాఫ్ట్‌వేర్‌ను కంప్యూటర్‌లో రిజిస్టర్‌ చేసేందుకు రీస్టార్ట్‌ చేసిన తరువాత పలా అయితే కంప్యూటర్‌ నిరంతరంగా పనిచేసేందుకు సిద్ధమవుతుందో అదే విధంగా మానవుడు శిరోదయం అయిన తరుణంలో తొలి శ్వాస తీసుకొని తన ప్రాకృత కర్మను అనుభవించేందుకు సిద్దమవుతాడు.

2. కంప్యూటర్‌లో ఆపరేటింగ్‌ సిస్టంను లోడ్‌ చేసిన తరువాత ఆ కంప్యూటర్‌ను నడిపించే వ్యక్తి తన అవసరాల మేరకు ఇతర సాఫ్ట్‌వేర్‌ లను ఇన్‌స్టాల్‌ చేస్తాడు. అదే విధంగా పటు వంటి మతం లేదా కులం లేని నూతన శిశువు తాను పెరిగే వాతావరణం, పెద్దల పెంపకం, జీవన విధానం, సామాజిక స్థితులకు అనుగుణంగా పెరిగి తనకంటూ ఒక మతం, ఒక కులం, జీవన శైలి, బాంధవ్యాలు అనబడే వివిధ సాఫ్ట్‌వేర్‌లతో ఇన్‌స్టాల్‌ చేయబడి తదనుగుణమైన ప్రవర్తన కల్గియుంటాడు. కంప్యూటర్‌లో సాఫ్ట్‌వేర్‌లు పన్ని వేసినా సక్రమమైన విధానంలో ఆ కంప్యూటర్‌ వాడబడినట్లయితే దాని నుండి వచ్చే అవుట్‌పుట్‌లు అన్నీ పంతో బాగుంటాయి.

కంప్యూటర్‌ను ఆపరేట్‌ చేసే సమయంలో సరైన కమాండ్‌లు ఇవ్వక పోయినా, ఉన్నటువంటి సాఫ్ట్‌వేర్‌ను సక్రమంగా ఉపయోగించ పోయినా ఆ కంప్యూటర్‌ నుండి వచ్చే అవుట్‌పుట్‌లు పంతో భయంకరమైన ఫలితాలను కలిగి యుండి, ప్రోగ్రాం చేయబడిన కంప్యూటర్‌కు సైతం భారంగా మారతాయి. అదే విధంగా మానవుడు తాను జన్మించిన కుటుంబ స్థితులు, సామాజిక స్థితులు, బంధువులతో కొనసాగించే బాంధవ్యాలను అనుసరించి తన జీవన శైలిని సక్రమ మార్గంలో మలుచుకున్న ట్లయితే ఆ మానవుడు చేసే పనులు అన్నీ సక్రమంగా ఉంటాయి.

తనను నమ్మిన వారికి లాభదాయకంగా ఉంటాయి. వచ్చిన బ్యాడ్‌ అవుట్‌పుట్లతో భారంగా మారిన కంప్యూటర్‌ హ్యాంగ్‌ అవుతుంది. అదే విధంగా మానవుడు తాను చేసిన దుష్కర్మల వల్ల వచ్చిన ఫలితాలతో అతని జీవిత కాలంలో ఏదో ఒక రోజున ‘‘తాను పందుకు పుట్టాడు, పందుకు బతుకుతున్నాడు, పందుకు మరణించబో తున్నాడు’’ అనే సందేహాలు జనించి అతని జీవితం నిస్సారంగా మిగిలి పోతుంది.

ఇదే మానవుడి జీవితంలో మనిషనే కంప్యూటర్‌ హ్యాంగ్‌ అయిన పరిస్థితి. కంప్యూటర్‌ హ్యాంగ్‌ అయినప్పుడు మనిషి ఏం చేస్తాడు, సాధార ణంగా రీస్టార్ట్‌ చేస్తాడు. అదే విధంగా మనిషి తన జీవితం నిస్సారంగా మిగిలిపోయి నపుడు, నిస్సహాయ స్థితిలో కొట్టుకు పోయేటప్పుడు ఇతరులను నిందించకుండా, తన పరిస్థితికి దారితీసిన కారణాలు ఏమిటని తనను తాను ప్రశ్నించుకొని పునరావలోకనం చేసుకోవాలి. మనిషి తన జీవితాన్ని రీస్టార్ట్‌ చేయడంగా భావించవచ్చు.

3. కంప్యూటర్‌ను రీస్టార్ట్‌ చేసిన తరువాత అయినా కంప్యూటర్‌ను సక్రమ మార్గంలో వినియోగిస్తే వచ్చే అవుట్‌పుట్‌లు బాగుం టాయి. కంప్యూటర్‌ కూడా సుదీర్ఘకాలం మన్నుతుంది. అది గ్రహించని కంప్యూటర్‌ వినియోగదారడు బ్యాడ్‌ కమాండ్‌లనే ఇస్తూ కంప్యూటర్‌ను అస్తవ్యస్తంగా వినియోగిస్తే, ఆ కంప్యూటర్‌ అతి కొద్దికాలంలోనే ఫార్మేట్‌కు గురవుతుంది.

అదే విధంగా మనిషి తన జీవితాన్ని ‘‘తాను పందుకు పుట్టాడు, పందుకు బతుకుతున్నాడు, పందుకు మరణించబో తున్నాడు’’ అంటూ ప్రశ్నించుకొని రీస్టార్ట్‌ చేసిన తరువాత సక్రమ మార్గంలో తన జీవితాన్ని మళ్ళించుకున్నట్లయితే, చక్కటి ప్రశాంతతో ఆహ్లాదకరమైన జీవితాన్ని సుదీర్ఘకాలం గడుపుతాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలను రాబట్టడం ద్వారా జీవితాన్ని రీస్టార్ట్‌ చేసినప్పటికీ అజ్ఞానానికి, ప్రలోభాలకు, అత్యాశకు గురై అదేవిధమైన పాత జీవితాన్ని గడిపినట్లయితే చివరికి మిగిలేది శూన్యం. ఆపై సంభవించేదే మరణం, దీన్ని కంప్యూటర్‌ పరిజ్ఞానానికి సంబంధించిన ఫార్మేట్‌గా భావించవచ్చు. కంప్యూటర్‌ను ఫార్మేట్‌ చేస్తే, హార్డ్‌ డిస్క్‌లలో మిగిలేది ఏముంటుంది శూన్యం తప్ప. అదే విధమైన శూన్యాన్నే మరణించిన వ్యక్తి పొందవలసి ఉంటుంది. 

4. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే హార్డ్‌ డిస్క్‌ క్రాష్‌ అయితే తప్ప కంప్యూటర్‌ను పన్నిసార్లయినా ఫార్మేట్‌ చేయవచ్చు.మళ్ళీ మళ్ళీ మనిషి తన ప్రయోజనాలకు వాడుకోవచ్చు. అయితే కంప్యూటర్‌లాంటి మనిషి మరణాన్ని చవిచూసినట్లయితే,ఆ మనిషి కంప్యూటర్‌ మాదిరిగా పునర్జీవాన్ని పొందలేడు. అదే మనిషికీ, కంప్యూటర్‌కూ గల వ్యత్యాసం. దైవ సమానుడిగా తనకు తాను భావించే ప్రతియొక మనిషికీ, మానవుల ఊహకు అందని భగవంతుడికీ గల వ్యత్యాసం.

No comments: