Aug 26, 2011

టి.వి చానల్స్ వాళ్ళకి మెదడు ఎక్కడ ఉంటుందో ??

 
ఈ డౌట్ ఎందుకు వచ్చింది అంటే ...
ఈ మధ్య కేరళ లో తిరువనంతపురం పద్మనాభ స్వామి గుడి లో సంపద గురించి వార్తలు వచ్చాయి .
స్వామి ఆస్తి సుమారు లక్ష కోట్లు ఉంటుందని .అంతవరకూ బానే ఉంది ,కానీ అక్కడే మన చానల్స్ వారి మెదడు మొద్దు బారింది ....

ఇప్పుడు ఈ సంపద తిరుపతి వెంకన్న కన్నా ఎక్కువ కదా ...
కాబట్టి 'పద్మనాభ స్వామి' రిచెస్ట్ గాడ్ అని ???
వెంకన్ననిమించి పోయాడు అని ..!!

వీళ్ళకి "దేవుళ్ళందరూ ఒకటే "అని గుర్తు రాదో,లేదో ...
మనుషుల్లో పేద, గొప్ప అని తేడా చూపించారంటే బాగానే ఉంది ,
కానీ వీళ్ళు దేవుల్లకే గొడవలు పెట్టేలా ఉన్నారు ...
వీళ్ళకి దేవుడు తో పని లేదు ...
టి ఆర్.పి మీదే దృష్టి,
మంచి పనులు చేయన్డయ్య అంటే ఒక్కడు రాడు 
కానీ ఇలా ప్రసారం చేయండి అంటే పోటి పడతారు ...
వీళ్ళు ఎప్పుడు మారతారో ...

ఓ గాడ్! వీళ్ళని క్షమించి ,కాపాడు నాయనా!!

No comments: